శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

విపిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మెగా వైద్య శిబిరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు, నవంబర్ 6: వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్థానిక కనుపర్తిపాడు సమీపంలోని విపిఆర్ ఆసుపత్రిలో ఆదివారం ఉచిత మెగా వైద్య శిబిరం ఏర్పాటైంది. సింహపురి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి సహకారంతో ఏర్పాటైన ఈ శిబిరంలో గుండె, కీళ్లు ఎముకలు, డయాబెటిస్, ఊపిరితిత్తులు, జీర్ణకోశ విభాగాల్లో 500 మందికి పైగా రోగులకు పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఫౌండేషన్ వ్యవస్థాపకులు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ ఈ ఉచిత వైద్య శిబిరాలను జిల్లాలోని 46 మండలాల్లో విడతల వారీగా నిర్వహించి ఉచిత వైద్యంతో పాటు ఉచితంగా మందులను కూడా అందిస్తామని తెలిపారు. అదేవిధంగా విపిఆర్ ఆసుపత్రి పేదల కోసం ఉచిత వైద్యం అందించేందుకు 24 గంటలు అందుబాటులో ఉండేలా అంబులెన్స్‌ను డాక్టర్లతో సిద్ధంగా ఉంచామన్నారు. ప్రత్యేకంగా పాముకాటు బారిన పడిన వారికి తమ ఆసుపత్రిలో ఉచితంగా మందులు అందిస్తామని వెల్లడించారు. తమ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇప్పటికే అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ఉచిత పాఠశాలను నిర్వహిస్తున్నామని, అదేవిధంగా ఆసుపత్రిలో అన్ని వసతులతో పేదలకు అన్ని రకాల మెరుగైన వైద్యం అందిస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ ఎండి వేమిరెడ్డి ప్రశాంత్‌రెడ్డి, సింహపురి ఆసుపత్రి చైర్మన్ రవీంద్రరెడ్డి వైద్యులు శశిధర్‌రెడ్డి, సిఎస్ రెడ్డి, శ్రీలక్ష్మి, ఫౌండేషన్ సిఇఓ నారాయణరెడ్డి, కేతంరెడ్డి వినోద్‌రెడ్డి, విపిఆర్ పాఠశాల ప్రిన్సిపాల్ శ్రీనివాస్ తదితరులున్నారు.