శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

సామాన్య ప్రజలను ఇబ్బంది పెట్టడం దారుణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లురుసిటీ, నవంబర్ 14: బిజెపి ప్రభుత్వం తీసుకున్న 500, 1000 రూపాయల నోట్ల రద్దు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సోమవారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నగరంలోని ఎస్‌బిఐ వద్ద ధర్నా నిర్వహించారు. ఈసందర్భంగా డిసిసి అధ్యక్షుడు పనబాక కృష్ణయ్య మాట్లాడుతూ నల్లధనాన్ని వెలికితీయడం మంచిదే కాని, అది ఆర్థికశాస్త్రం ప్రకారం శాస్ర్తియంగా చేయాలన్నారు. ఈరకంగా చేసి ప్రజలను ఇబ్బందులకు గురిచేయడం దారుణమని అన్నారు. బిజెపి ప్రభుత్వం నల్లధనాన్ని అరికట్టేందుకు గొప్పలు చెప్పుకుంటూ ముందు జాగ్రత్తలు తీసుకోకుండా 500, 1000 రూపాయల నోట్లు రద్దు చేసి సామాన్య ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలగించారని అన్నారు. బిజెపి ఎన్నికల మ్యానిఫెస్టోలో హామీ ఇచ్చిన ప్రకారం విదేశీ బ్యాంకులు, స్విస్‌బ్యాంకుల్లో ఉన్న భారత నల్లకుబేరుల ధనం 85 లక్షల కోట్ల రూపాయలను వెనక్కి రప్పించి భారదేశంలో ఉన్న ప్రతి పౌరుని ఖాతాలో 15 లక్షల రూపాయల చొప్పున జమ చేస్తానని చెప్పిన ప్రధానమంత్రి ఈ దేశ సామాన్య ప్రజలైన రైతులు, కూలీలు, చిన్న కార్మికులు, చిన్న వ్యాపారస్తులు , విద్యార్థులు, మహిళలు అందరిని రోడ్లమీదకు తీసుకునివచ్చి బ్యాంకుల ముందు గంటల తరబడి క్యూలో ఉండేటట్లు చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. 500, 1000 రూపాయల వల్ల బ్లాక్‌మనీ చెలామణి అవుతుందని చెప్పిన బిజెపి ప్రభుత్వం అంతకంటే 2వేల విలువైన 2వేల రూపాయల నోట్లను చలామణికి ప్రవేశపెట్టడం వల్ల నల్లధనం మరింత పెరిగే అవకాశం లేదా అని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో సివి శేషారెడ్డి, చేవూరు దేకుమార్‌రెడ్డి, చెంచలబాబుయాదవ్, భవానీ నాగేంద్రప్రసాద్, గాలాజు శివాచారి తదితరులు పాల్గొన్నారు.