శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

ఘనంగా చండీయాగం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూళ్లూరుపేట, నవంబర్ 14: కార్తీకపౌర్ణమి పర్వదినం సందర్భంగా చెంగాళమ్మ ఆలయంలో సోమవారం మహా చండీయాగం ఘనంగా నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలోని యాగశాల మండపంలో అమ్మవారి ఉత్సవ విగ్రహం ఏర్పాటు చేసి వేధపండితులు, మంత్రోచ్ఛరణల నడుమ యాగాన్ని వైభవంగా చేశారు. ఉభయ కర్తలుగా ఆలయ చైర్మన్ ముప్పాళ్ల వెంకటేశ్వర రెడ్డి దంపతులు వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో ఈవో శ్రీనివాసుల రెడ్డి, పాలక మండలి సభ్యులు ఆకుతోట రమేష్, యుగంధర్, గోపాల్ రెడ్డి, పెరుమాళ్ తదితరులు పాల్గొన్నారు.

ముక్కంఠేశ్వరునికి ప్రత్యేక పూజలు
గూడూరు, నవంబర్ 14: కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని సోమవారం పలు శివాలయాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పూజలు నిర్వహించారు. శివునికి అత్యంత ప్రీతిపాత్రమైన సోమవారం, కార్తీక మాసం, పౌర్ణమి తిథులు కలసి రావడంతో పలు ఆలయాలకు భక్తులు పోటేత్తారు. పౌర్ణమిని పురస్కరించుకొని ఆలయాల్లో కార్తీక దీపాలను వెలిగించి తమ మ్రొక్కులను తీర్చుకొన్నారు. అలాగే పలుచోట్ల శివునికి రుద్రాభిషేకాలు నిర్వహించారు. ఉదయం నుండి ఆలయాలకు భక్తులు పోటెత్తారు. నిర్వహకులు భక్తులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. శివునికి పాలు, తేనె, నెయ్యి, పెరుగు, విభూతి, చందనంతో అభిషేకాలు నిర్వహించారు. శివుడి అభిషేక ప్రియుడు కావడంతో భక్తులు స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్ధ ప్రసాదాను స్వీకరించారు.