శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

* ఎమ్మెల్సీ రేసులో అగ్రనేతలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు, నవంబర్ 19: త్వరలో ఖాళీకానున్న ఎమ్మెల్సీ పదవులు పొందేందుకు జిల్లాకు చెందిన టిడిపి నేతలు ఇప్పట్నుంచే అస్త్రాలు సిద్ధం చేస్తున్నారు. ఈక్రమంలోనే అందివచ్చిన అవకాశంలా టిడిపి జాతీయ ప్రధానకార్యదర్శి నారా లోకేష్ జిల్లా పర్యటనను విజయవంతం చేసేందుకు ఎవరికి వారు తమ వంతు తీవ్రంగానే శ్రమించారు. ఎలాగోలా చినబాబు జిల్లా పర్యటన విజయవంతం కావడంతో ఆయన వద్ద తమకు మంచి మార్కులే పడుంటాయనే ఆనందంలో జిల్లా అగ్రనేతలు ఉన్నారు. వచ్చే ఏడాది గవర్నర్ కోటాతో కలుపుకొని 18 ఎమ్మెల్సీ స్థానాలు భర్తీ చేయాల్సి ఉంది. ఇక ఎమ్మెల్సీ పదవిని ఆశిస్తున్నవారి సంఖ్య జిల్లాలో గణనీయంగానే ఉంది. అయితే వారిలో మాజీ మంత్రులు ఆదాల ప్రభాకర్‌రెడ్డి, ఆనం రామనారాయణరెడ్డి, ప్రస్తుత ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డిల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. జిల్లాలో రెడ్ల సామాజిక వర్గం నుంచి టిడిపికి మద్దతు తగ్గిన నేపథ్యంలో పై ముగ్గురిలో కనీసం ఇద్దరికైనా ఎమ్మెల్సీ పదవులు దక్కే అవకాశం ఉందని టిడిపి వర్గీయులు భావిస్తున్నారు. ఎమ్మెల్సీ పదవిపై ఆదాల ఎప్పట్నుంచో ఆశలు పెట్టుకొని ఉన్నారు. సాధారణ ఎన్నికల్లో ఓడిపోయినప్పటికి అన్ని నియోజకవర్గాల్లోనూ సొంత వర్గం ఉండడం ఆయన ప్రత్యేకత. ఇక ఇటీవల పార్టీలో చేరిన ఆనం రామనారాయణరెడ్డికి ఆత్మకూరు నియోజకవర్గ ఇన్‌చార్జ్ అవకాశం కల్పించడాన్నిబట్టి చూస్తే 2019 ఎన్నికల్లో అక్కడ్నుంచి పార్టీ అభ్యర్థిగా రామనారాయణరెడ్డిని టిడిపి అధినేత చంద్రబాబు ముందుగానే నిర్ణయించినట్లు పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని రెండేళ్ల ముందు ఆయనకు ఎమ్మెల్సీ ఇస్తారని చెప్పలేం. అదే సమయంలో అవకాశం దక్కదని కొట్టిపారేయలేని పరిస్థితి. ఆనం కుటుంబ రాజకీయ చరిత్ర చూసైనా చంద్రబాబు అవకాశం కల్పించవచ్చని ఆనం అనుచరులు భావిస్తున్నారు. ఇక వాకాటి నారాయణరెడ్డి విషయానికొస్తే.. గవర్నర్ కోటాలో అవకాశం కల్పించకపోయినా స్థానిక సంస్థల అభ్యర్థిగా తిరిగి వాకాటికే చంద్రబాబు అవకాశం కల్పిస్తారనే చర్చ జిల్లాలో జోరుగా సాగుతోంది. 2014 ఎన్నికల అనంతరం కాంగ్రెస్‌ను వీడి టిడిపిలో చేరిన మొదటి ప్రజాప్రతినిధిగా వాకాటికి చంద్రబాబు వద్ద మంచి పేరే ఉంది. దీనికితోడు రెడ్డి సామాజిక వర్గం కావడం, సూళ్లూరుపేట నియోజకవర్గంలో గెలుపోటములను ప్రభావితం చేసే వ్యక్తి కావడం వాకాటి కలిసొచ్చే అంశం. అదేవిధంగా ప్రముఖ పారిశ్రామికవేత్త, టిడిపి మద్దతుదారు కొండేపాటి గంగాప్రసాద్ కూడా వాకాటికి ఎమ్మెల్సీ ఇప్పించేందుకు కృషి చేస్తారు. ఒకవేళ టిడిపిలో ఇతర నేతలకు స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా పోటీ చేసే అవకాశం కల్పిస్తే పార్టీలో ఉన్న వర్గాలు, విభేదాల కారణంగా ఒకరికొకరు సహకరించుకొనే అవకాశమే లేదు. దీంతో ఓటమి తప్పదు. ఈ అంశాలను బేరీజు వేసుకొని జిల్లాలోని అన్ని రాజకీయ కుటుంబాలతో సత్సంబంధాలు నెరిపే వాకాటికే స్థానిక సంస్థల ద్వారా ఎమ్మెల్సీ అవకాశం మళ్లీ చంద్రబాబు కల్పించే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. అయితే ఎవరెన్ని ఆశలు పెట్టుకున్నా.. చివరకు అధినేత మదిలో ఎవరు మెదులుతున్నారనే విషయంలో స్పష్టత వచ్చేందుకు మరి కొంతకాలం వేచిచూడాలి.

విద్యార్థులను క్రీడల్లో ప్రోత్సహించాలి
* నగర మేయర్ అజీజ్ సూచన
* రాష్టస్థ్రాయి టెన్నికాయిట్ పోటీలు ప్రారంభం
వేదాయపాళెం, నవంబర్ 19 : విద్యార్థులకు చదువుతోపాటు క్రీడల్లో కూడా తల్లిదండ్రులు ప్రోత్సహించాలని నగర మేయర్ అబ్దుల్ అజీజ్ అన్నారు. నగరంలోని ఎసి సుబ్బారెడ్డి స్టేడియంలో శనివారం 35వ రాష్టస్థ్రాయి టెన్నికాయిట్ పోటీలు ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిధిగా పాల్గొని క్రీడలను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విద్యార్థులు క్రీడల్లో పాల్గొనేలా తల్లిదండ్రులు శ్రద్ధ తీసుకోవాలన్నారు. క్రీడల్లో రాణిస్తున్నవారంతా ప్రస్తుతం ఉన్నత శిఖరాలను అధిరోహిస్తున్నారన్నారు. ఈ పోటీల్లో పాల్గొన్న క్రీడాకారులు ఒలంపిక్ క్రీడల్లో మన దేశ క్రీడాకారులు రాణించిన విధంగా ముందుకు దూసుకెళ్లాలన్నారు. జిల్లాల్లో రాష్టస్థ్రాయి క్రీడలు నిర్వహించడం అనందంగా ఉందన్నారు. నెల్లూరు జిల్లాలో జాతీయస్థాయి క్రీడా పోటీలు నిర్వహించేందుకు తెలుగుదేశం ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. క్రీడాకారులు తమ ప్రతిభను చూపి క్రీడల్లో ముందుకు సాగాలని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. క్రీడాకారులు గెలుపోటములను ఒకేలా తీసుకొని తమ లక్ష్యాలను సాధించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ టెన్నికాయిట్ అసోసియేషన్ ఆర్గనైజింగ్ సెక్రటరి కెఎన్‌వి సత్యనారాయణ మాట్లాడుతూ రాష్ట్ర విభజన తరువాత రాష్టస్థ్రాయి టెన్నికాయిట్ పోటీలను నెల్లూరు జిల్లాలో మొదటిసారి నిర్వహిస్తున్నామన్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈ ఏడాది సింగిల్స్, మిక్స్‌డ్ డబుల్స్ విభాగాలలో పోటీలను నిర్వహిస్తున్నామన్నారు. ఈ పోటీల్లో ఉత్తమ ప్రతిభ చూపిన క్రీడాకారులను రాష్ట్ర జట్టుకు ఎంపిక చేయడం జరుగుతుందన్నారు. ఎంపికైన క్రీడాకారులు డిసెంబరు 9, 10, 11వ తేదిలలో హైదరాబాదులో జరిగే జాతీయస్థాయి పోటీలలో పాల్గొంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో శాప్ డైరెక్టర్ ఎం.రవీంద్రబాబు, డిఎస్‌డిఓ పివి రమణయ్య, కార్పొరేటర్ రజని, ఏపి హ్యాండ్‌బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు టి.మనోహరం, ఆంధ్రప్రదేశ్ టెన్నికాయిట్ అసోసియేషన్ కార్యదర్శి ముస్త్ఫా అలీఖాన్, గడ్డం రమణయ్య, రామ్మూర్తి, నాగయ్య తదితరులు పాల్గొన్నారు.
పోటాపోటీగా తలపడ్డ క్రీడాకారులు
నగరంలో శనివారం ప్రారంభమైన రాష్టస్థ్రాయి టెన్నికాయిట్ పోటీలలో 13 జిల్లాలకు సంబంధించి 260 మందికిపైగా క్రీడాకారులు పాల్గొన్నారు. సింగిల్స్, మిక్సిడ్ డబుల్స్ విభాగాలలో తొలిరోజు క్రీడాకారులు పోటాపోటీగా తలపడ్డారు. తమతమ ప్రతిభను చూపి ప్రత్యర్థులపై విజయం సాధించారు. తొలిరోజు జరిగిన మ్యాచ్‌లలో బాలుర విభాగంలో పలు జిల్లాలకు చెందిన 10 మంది క్రీడాకారులు విజయం సాధించగా బాలికల విభాగంలో 20 మ్యాచ్‌లలో 19 మంది బాలికలు విజయం సాధించారు.

ఘనంగా ఇందిరాగాంధీ శత జయంతోత్సవ శాంతి ర్యాలీ
నెల్లూరుసిటీ, నవంబర్ 19: దివంగత ప్రధానమంత్రి ఇందిరాగాంధీ శత జయంతోత్సవ శాంతి ర్యాలీని శనివారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా ఇందిరాభవన్‌లో గల ఆమె విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం అక్కడ నుంచి ర్యాలీగా బయలుదేరి ఆర్టీసీ బస్టాండ్ వద్ద గల ఆమె విగ్రహానికి పూలమాలలు వేశారు. ఈసందర్భంగా డిసిసి అధ్యక్షుడు పనబాక కృష్ణయ్య మాట్లాడుతూ భారతదేశ మొట్టమొదటి మహిళా ప్రధానిగా 16 సంవత్సరాలు పాలించి ఎన్నో సంస్కరణలు, సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి భారతదేశానికి ఒక దశ దిశ నిర్దేశించారని చెప్పారు. ఇందిరాగాంధీ బ్యాంకులను జాతీయం చేసి ప్రజల వద్దకు బ్యాంకులను తీసుకునివెళ్తే ప్రస్తుతం ఎన్‌డిఎ ప్రభుత్వం నల్లధన పేరుతో 500, 1000 రూపాయల నోట్లను రద్దు చేసి సామాన్య ప్రజలను బ్యాంకుల వద్ద వీధులపాలు చేశారన్నారు. ఆమె సిద్ధాంతాలను, ఆదర్శాలను నేటితరం స్ఫూర్తిగా తీసుకుని కాంగ్రెస్ పార్టీకి పునరాంకితం కావాలని ప్రజలకు పిలుపునిచ్చారు. అందుకే ఇందిరమ్మ రాజ్యం- ఇంటింటా సౌభాగ్యం అనే నినాదంతో ఈ ఉత్సవాలను శాంతి యాత్ర ద్వారా ప్రారంభించామని చెప్పారు. ఏడాదిపాటు వివిధ కార్యక్రమాలు కొనసాగుతాయన్నారు. పిసిసి ఉపాధ్యక్షుడు చేవూరు దేవకుమార్‌రెడ్డి మాట్లాడుతూ భారతదేశ మొట్టమొదటి మహిళా ప్రధానిగా 16 సంవత్సరాపాటు పాలించి ప్రజల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారన్నారు. భారతదేశం కోసం ప్రాణత్యాగం చేసి మహోన్నత నాయకురాలు ఇందిరాగాంధీ అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు సివి శేషారెడ్డి, వైద్యలింగం, గాలాజు శివాచారి, ఆసీఫ్ పాషా, పత్తి సీతారాంబాబు, కేశవనారాయణ, అనూరాధరెడ్డి, లతరెడ్డి, ఎస్‌కె జహంగీర్, షేక్ ఫయాజ్ తదితరులు పాల్గొన్నారు.

నోట్ల రద్దుతో దేశ ఆర్థిక వ్యవస్థ ఛిన్నాభిన్నం
ఎమ్మెల్యే కాకాణి విమర్శ
మనుబోలు, నవంబర్ 19: ఇటీవల రూ.500, రూ.1000 నోట్ల రద్దుతో దేశ ఆర్థిక వ్యవస్థ ఛిన్నాభిన్నంగా తయారైందని జిల్లా వైఎస్‌ఆర్‌సిపి అధ్యక్షుడు, స్థానిక శాసనసభ్యుడు కాకాణి గోవర్ధనరెడ్డి విమర్శించారు. స్థానిక ఎంపిపి చిట్టమూరు అనితమ్మ అధ్యక్షతన జరిగిన సర్వసభ్య సమావేశంలో ఆయన ముఖ్య అతిధిగా విచ్చేశారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ నల్లధనం నివారించడాన్ని ప్రతిఓక్కరు ఆహ్వానిస్తారని, అయితే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముందస్తు జాగ్రత్తలు, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకుండా నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించడంతో ప్రజల్లో తీవ్రమైన గందగోళ పరిస్ధితులు ఏర్పడ్డాయన్నారు. పెద్ద నోట్లను రద్దు చేస్తున్నామని చెపుతూ మరో వైపు రూ.2వేల నోట్లను తీసుకువచ్చి చిల్లర దోరకడం సమస్యగా తయారైందన్నారు. నేడు బ్యాంకులు, ఏటిఎంలు వద్ద కిలోమీటర్ల నోట్ల కోసం ప్రజలు క్యూ కడుతున్నారని, సగటు మనిషి ఇబ్బందులకు గురిచేయడం మంచి పద్ధతి కాదన్నారు. ప్రస్తుతం రైతులు సాగునీటి కోసం ఒకవైపు ఇబ్బందులుపడుతుంటే మరోవైపు నోట్లు మార్పిడితో ఇబ్బందులు పడుతున్నారన్నారు. ప్రభుత్వం రైతులు, రైతు కూలీలు క్రెడిట్, డెబిట్ కార్డులు, ఆన్‌లైన్ కార్యకలాపాలు నిర్వహించుకోవాలని చెపుతున్నారని, ఇది అసాధ్యమన్నారు. నీరు విత్తనాలు కొనుగోలు నుండి చివరి వరకు నగదు కార్యకలాపాలు చేయడం మాత్రమే తెలుసన్నారు. బ్యాంకర్లు డిసెంబరు 31వతేది వరకు బ్యాంకుల్లో కేవలం నోట్ల మార్పిడి తప్ప ఎటువంటి కార్యక్రమాలు చేపట్టమని చెపుతున్నారన్నారు. రైతులకు రుణాలు సకాలంలో ఇప్పించే విధంగా చర్యలు చేపట్టారని జిల్లా కలెక్టరును కోఉనున్నట్లు తెలిపారు. బ్యాంకు అధికారులతో మాట్లాడి రైతులకు రుణాలు ఇప్పించే బాధ్యత ప్రభుత్వ యంత్రాంగంపై ఉందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పడంతో పెద్ద నోట్లు రద్దు చేశారని చెప్పుకుంటున్నారని, ప్రస్తుతం ప్రజలు పడుతున్న చిల్లర సమస్యను బాధలను నివారించడంకు కేంద్ర ప్రభుత్వం మాట్లాడి చేపట్టాలన్నారు. ఈకార్యక్రమంలో ఎంపిడిఓ కె.హేమలత, తహశీల్దారు కెవి.రమణయ్య, మండల ఉపాధ్యక్షుడు రఘురామిరెడ్డి తదితరులు ఉన్నారు.

మోటారుసైకిల్‌ని ఢీకొన్న ఆటో:ఒకరి మృతి
సంగం, నవంబర్ 19: సంగం మండలం కొరిమెర్ల గ్రామం వద్ద శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. తండ్రి, కొడుకు మోటారుసైకిల్‌పై వస్తుండగా ఎదురుగా వస్తున్న ఆటో అదుపుతప్పి ఢీకొనడంతో తండ్రి అక్కడికక్కడే మృతిచెందగా కొడుకుకి తీవ్రగాయాలయ్యాయి. వివరాలిలా ఉన్నాయి కొండాపురం మండలం చింతలదేవి గ్రామానికి చెందిన కంచెర్ల. రాబర్ట్ తన కొడుకు కంచెర్ల. మెషెక్ తో కలిసి మోటారుసైకిల్‌పై నెల్లూరు లో చదువుతున్న తన కుమార్తె వద్ద కు వెల్తున్న క్రమంలో, బుచ్చిరెడ్డిపాళెం నుండి కలిగిరి వైపు వెళుతున్న మదర్‌హోమ్ చిన్నపిల్లల అనాధాశ్రమంకి చెందిన ఆటో కొరిమెర్ల వద్ద అదుపుతప్పి మోటారు సైకిల్‌ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మోటారు సైకిల్‌ని నడుపుతున్న రాబర్ట్(46) అక్కడికక్కడే మృతిచెందాడు,కుమారుడు మెషెక్‌కు తీవ్ర గాయాలవడంతో 108 లో వైద్యశాలకు తరలించారు. రాబర్ట్ చింతలదేవిలోని పశుక్షేత్రంలో కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్నాడు.సంగం ఎస్ ఐ వేణు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పంచనామాకు తరలించారు.కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

టిడిపి రాకుంటే రుణమాఫీయే లేదు
* ఎమ్మెల్యే పోలంరెడ్డి
బుచ్చిరెడ్డిపాళెం, నవంబర్ 19: తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాకపోఉంటే రుణమాఫీ ప్రసక్తే లేదని ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి అన్నారు. జన చైతన్యయాత్రలో భాగంగా బుచ్చిరెడ్డిపాళెం పట్టణం, కాగులపాడు గ్రామాలలో శనివారం ఆయన పర్యటించారు. ఈ సంధర్భంగా ఆయన మాట్లాడుతూ రుణమాఫీ సాధ్యం కాదన్న ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రైతుల గురించి మాట్లాడడం విచిత్రమని ఎద్దేవా చేశారు. రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ప్రాధాన్యతా క్రమంలో నెరవేరుస్తూ వస్తున్నామన్నారు. ప్రతిపక్షం నిర్మాణాత్మక పాత్ర పోషించడంలో దారుణంగా విఫలమైందని విమర్శించారు. పార్టీ సభ్యత్వ నమోదులో బుచ్చిరెడ్డిపాళెం వెనకబడి ఉందన్నారు. పార్టీ క్యాడర్ హుషారుగా పనిచేసి పార్టీని బలోపేతం చేయాలని ఆయన సూచించారు. ఈ సందర్భంగా స్థానికుల సమస్యలపై అర్జీలు స్వీకరించిన ఆయన వాటి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ యాత్రలో పార్టీ నాయకులు ఎర్రంరెడ్డి గోవర్థన్‌రెడ్డి, బుచ్చి, కాగులపాడు సర్పంచులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

నోట్ల రద్దుతో దేశ ఆర్థిక వ్యవస్థ ఛిన్నాభిన్నం
ఎమ్మెల్యే కాకాణి విమర్శ
మనుబోలు, నవంబర్ 19: ఇటీవల రూ.500, రూ.1000 నోట్ల రద్దుతో దేశ ఆర్థిక వ్యవస్థ ఛిన్నాభిన్నంగా తయారైందని జిల్లా వైఎస్‌ఆర్‌సిపి అధ్యక్షుడు, స్థానిక శాసనసభ్యుడు కాకాణి గోవర్ధనరెడ్డి విమర్శించారు. స్థానిక ఎంపిపి చిట్టమూరు అనితమ్మ అధ్యక్షతన జరిగిన సర్వసభ్య సమావేశంలో ఆయన ముఖ్య అతిధిగా విచ్చేశారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ నల్లధనం నివారించడాన్ని ప్రతిఓక్కరు ఆహ్వానిస్తారని, అయితే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముందస్తు జాగ్రత్తలు, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకుండా నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించడంతో ప్రజల్లో తీవ్రమైన గందగోళ పరిస్ధితులు ఏర్పడ్డాయన్నారు. పెద్ద నోట్లను రద్దు చేస్తున్నామని చెపుతూ మరో వైపు రూ.2వేల నోట్లను తీసుకువచ్చి చిల్లర దోరకడం సమస్యగా తయారైందన్నారు. నేడు బ్యాంకులు, ఏటిఎంలు వద్ద కిలోమీటర్ల నోట్ల కోసం ప్రజలు క్యూ కడుతున్నారని, సగటు మనిషి ఇబ్బందులకు గురిచేయడం మంచి పద్ధతి కాదన్నారు. ప్రస్తుతం రైతులు సాగునీటి కోసం ఒకవైపు ఇబ్బందులుపడుతుంటే మరోవైపు నోట్లు మార్పిడితో ఇబ్బందులు పడుతున్నారన్నారు. ప్రభుత్వం రైతులు, రైతు కూలీలు క్రెడిట్, డెబిట్ కార్డులు, ఆన్‌లైన్ కార్యకలాపాలు నిర్వహించుకోవాలని చెపుతున్నారని, ఇది అసాధ్యమన్నారు. నీరు విత్తనాలు కొనుగోలు నుండి చివరి వరకు నగదు కార్యకలాపాలు చేయడం మాత్రమే తెలుసన్నారు. బ్యాంకర్లు డిసెంబరు 31వతేది వరకు బ్యాంకుల్లో కేవలం నోట్ల మార్పిడి తప్ప ఎటువంటి కార్యక్రమాలు చేపట్టమని చెపుతున్నారన్నారు. రైతులకు రుణాలు సకాలంలో ఇప్పించే విధంగా చర్యలు చేపట్టారని జిల్లా కలెక్టరును కోఉనున్నట్లు తెలిపారు. బ్యాంకు అధికారులతో మాట్లాడి రైతులకు రుణాలు ఇప్పించే బాధ్యత ప్రభుత్వ యంత్రాంగంపై ఉందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పడంతో పెద్ద నోట్లు రద్దు చేశారని చెప్పుకుంటున్నారని, ప్రస్తుతం ప్రజలు పడుతున్న చిల్లర సమస్యను బాధలను నివారించడంకు కేంద్ర ప్రభుత్వం మాట్లాడి చేపట్టాలన్నారు. ఈకార్యక్రమంలో ఎంపిడిఓ కె.హేమలత, తహశీల్దారు కెవి.రమణయ్య, మండల ఉపాధ్యక్షుడు రఘురామిరెడ్డి తదితరులు ఉన్నారు.

‘విద్యార్థులు ఆలోచనా విధానంతో అద్భుత విజయాలు సాధించవచ్చు’
వేదాయపాళెం, నవంబర్ 19: విద్యార్థులు శాస్ర్తియ పరిజ్ఞానంతో ఆలోచన, పరిశోధనలతో అద్భుత విజయాలు సాధించవచ్చని రక్షణ మంత్రిత్వ శాఖ శాస్ర్తియ సలహాదారు డాక్టర్ జి.సతీష్‌రెడ్డి అన్నారు. నగరంలోని సుబేదారుపేటలో ఉన్న సెయింట్ జాన్స్ ఇంగ్లీషు మీడియం స్కూల్‌లో శనివారం 6వ జిల్లా వైద్య, విజ్ఞానిక ప్రదర్శనను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిధిగా పాల్గొని ప్రదర్శనను ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో సతీష్‌రెడ్డి మాట్లాడుతూ 1500 సంవత్సరాలలో మనదేశం శాస్ర్తియ విజ్ఞానంలో ఇతర దేశాలకంటే ముందంజలో ఉండేదన్నారు. ఐన్‌స్టీన్, న్యూటన్ లాంటి ప్రముఖ శాస్తజ్ఞ్రులు మన దేశం నుంచి పరిశోధనలు చేసి శాస్ర్తియ విజ్ఞానంలో పలు విజయాలు సాధించడం జరిగిందన్నారు. కాలక్రమేణ మన దేశంలో శాస్ర్తియ విజ్ఞానంలో కొంత మేరకు వెనుకబడిందని 1950 నుంచి స్వాతంత్య్రం వచ్చిన తరువాత మనదేశంలో రక్షణ పరంగా అంతరిక్ష పరంగా, పలు శాస్ర్తియ పరిశోధనలు చేయడం మొదలుపెట్టి శాస్ర్తియ విజ్ఞానంలో గణణీయమైన అభివృద్థి సాధించడం జరిగిందన్నారు. ఈ ప్రక్రియలో ప్రధానంగా డాక్టర్ అబ్దుల్ కలాం శాస్ర్తియ విజ్ఞానంతో అనేక పరిశోధనలు చేసి పీ ఎస్ ఎల్‌వి, క్షిపణీలు, బ్రహ్మాస్ క్షిపణికి రూపకల్పన చేసి అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన మహోన్నత వ్యక్తిఅని కొనియాడారు. సాధారణ కుటుంబంలో జన్మించి మదేశాన్ని ప్రపంచ అగ్రదేశాల సరసన చేర్చి గుర్తింపు తెచ్చారన్నారు. వారి స్ఫూర్తితో విద్యార్థులు శాస్ర్తియ, సాంకేతిక పరిజ్ఞానంతో మంచి శాస్తవ్రేత్తలుగా ఎదగాలన్నారు. ప్రతి విద్యార్థి ప్రధానంగా దినపత్రిక చదవడం, ప్రశ్నించడం, పరిశోధించడం అలవర్చుకున్నప్పుడే మంచి శాస్తజ్ఞ్రులుగా తయారవచ్చన్నారు. ఇన్‌చార్జి జిల్లా కలెక్టర్ ఏ ఎండి ఇంతియాజ్ అహ్మద్ మాట్లాడుతూ విద్యార్థులు అబ్దుల్ కలాం లాంటి మహఋ౎ వ్యక్తుల లాంటి శాస్తజ్ఞ్రులను స్ఫూర్తిగా తీసుకొని శాస్ర్తియ విజ్ఞానంలో రాణించాలన్నారు. ప్రతి విషయంలో ప్రశ్నిస్తూ ముందుకు వెళ్లాలన్నారు. ప్రముఖ శాస్తజ్ఞ్రడు జగదీష్ మాట్లాడుతూ ప్రతి విద్యార్థి వారిలో ఉన్న సృజనాత్మకతను వెలికితీసి శాస్ర్తియ సాంకేతిక విజ్ఞానంలో ఎదగాలన్నారు. ప్రధానంగా ప్రకృతిలో ఉన్న వనరులను ఆధారంగా చేసుకొని శాస్ర్తియ విజ్ఞానంలో పరిశోధన చేసి శాస్తజ్ఞ్రులుగా విజయాలు సాధించడం జరిగిందన్నారు. అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన ప్రదర్శనలను తిలకించి వాటిని గురించి అడిగి తెలసుకున్నారు. ఈ కార్యక్రమంలో చర్చి పాదర్ బిషప్, సర్వశిక్ష అభియాన్ పిఓ కనకనరసారెడ్డి, డిప్యూటీ విద్యాశాఖాధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.