శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

9 నుండి కానిస్టేబుల్ ఎంపిక దేహ ధారుడ్య పరీక్షలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు, డిసెంబర్ 5: పోలీస్ కానిస్టేబుల్ , జైల్‌వార్డర్ పోస్టుల భర్తీకి సంబంధించిన ప్రక్రియలో భాగంగా ఈనెల 9వ తేదీ నుంచి రాత పరీక్షల్లో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు ఈనెల 9 నుండి 14వ తేదీ వరకు దేహ ధారుడ్య పరీక్షలు నిర్వహించనున్నట్లు జిల్లా ఎస్పీ విశాల్‌గున్ని వెల్లడించారు. సోమవారం స్థానిక ఉమేష్ చంద్ర సమావేశ మందిరంలో ఆయన విలేఖరులతో మాట్లాడుతూ గత నెల 6వ తేదీన జిల్లాలోని నెల్లూరు, కావలి కేంద్రాల్లో జరిగిన రాత పరీక్షల్లో 5,850 మంది అభ్యర్థులు దేహధారుడ్య పరీక్షలకు అర్హత సాధించారన్నారు. ఈ పరీక్షల్లో మొదట అభ్యర్థుల అర్హత, ఇతర ధ్రువపత్రాల పరిశీలన జరుగుతుందని, తమ సర్ట్ఫికేట్లన్నింటిని వెంట తెచ్చుకోవాలని ఆయన సూచించారు. ఒరిజినల్ సర్ట్ఫికేట్ల పరిశీలనకు ఎటువంటి అదనపు గడువు ఇవ్వబడదని స్పష్టం చేశారు. ఒక్కో అభ్యర్థికి ఒకే రోజు రెండు దశల్లో పరీక్షలు నిర్వహిస్తామని, మొదట శారీరక కొలతలు, 1600 మీ.పరుగు పోటీ ఉంటుందని, ఈ రెండు అంశాల్లో తప్పక ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుందన్నారు. పిఎంటిలో అనర్హత పొందితే వారు అప్పీలు చేసుకోవచ్చని, అప్పీళ్లను చివరిరోజు పరిశీలించడం జరుగుతుందన్నారు. పరుగు పందెం తర్వాత లాంగ్ జంప్ పోటీలు జరపబడతాయన్నారు. ఈ పరీక్షల్లో ఉత్తీర్ణులైన అభ్యర్థులు జనవరి 22న జరిగే చివరి రాత పరీక్షకు వారికి కేటాయించిన పరీక్షా కేంద్రాల్లో హాజరు కావాల్సి ఉంటుందన్నారు. రాష్ట్రంలో కాకినాడ, విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, తిరుపతి, కర్నూలు పట్టణాల్లో కేంద్రాలు ఏర్పాటు చేశారన్నారు. దేహధారుడ్యం, రాత పరీక్షల్లో ఎటువంటి అధునాతన సాంకేతిక పరిజ్ఞానం, సాంకేతిక పరికరాలు ఉపయోగించకుండా పారదర్శకంగా పరీక్షలు నిర్వహించేందుకు అభ్యర్థులు సహకరించాలని కోరారు. అభ్యర్థులు ఎటువంటి ప్రలోభాలకు లోనవకుండా స్వేచ్ఛగా పరీక్షల్లో పాల్గొనాలని, ఎవరైనా అభ్యర్థులను ప్రలోభ పెట్టినట్లయితే వారిపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఎస్పీ హెచ్చరించారు. దేహధారుడ్య పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులకు ఎస్పీ శుభాకాంక్షలు తెలియచేశారు.

బెటాలియన్ కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం
వెంకటగిరి, డిసెంబర్ 5: మండలంలోని వల్లవేడు వద్ద ఉన్న రాష్ట్ర తొమ్మిదవ బెటాలియన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న చిత్తూరుకు చెందిన ఇంతియాజ్ (40) పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన సోమవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. విధి నిర్వహణలో భాగంగా బెటాలియన్ కమాండెంట్ తనను వేధిస్తున్నారని, దానితో పాటు సస్పెండ్ చేస్తానని బెదిరించారని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన అనంతరం ఇంతియాజ్ తెలిపారు. పట్టణంలోని కాశీపేట సెంటర్‌లో ఇంతియాజ్ ఆత్మహత్యా యత్నానికి పాల్పడిన సంఘటన తెలుసుకున్న కమాండెంట్, బెటాలియన్ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకొని పట్ణంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఇతని పరిస్థితి విషమంగా ఉండటంతో తిరుపతి తరలించారు. ఈ విషయమై కమాండెంట్‌ను విలేఖర్లు ప్రశ్నించగా, ఇంతియాజ్ ఆత్మహత్యాయత్నానికి, తనకు ఎలాంటి సంబంధం లేదని పేర్కొన్నారు.