శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

‘సాక్ష్యాలు లభించినా దోషులనెందుకు అరెస్ట్ చేయరు?’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు కలెక్టరేట్, ఏప్రిల్ 18: గ్రామీణ మండలంలోని దేవరపాళెం, నరసింహకొండ ఆలయాల భూమల్లో కోట్లాది రూపాయల అక్రమాలు జరిగితే పోలీసులు సంబంధిత వ్యక్తులను అరెస్ట్ చేయకపోవటం దారుణమని సిపిఎం గ్రామీణ కార్యదర్శి ప్రభుత్వాన్ని విమర్శించారు. జిల్లా కేంద్రంలోని ఆ పార్టీ కార్యాలయంలో సోమవారం ఆయన మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో ఆధారాలు లభించినా నిందితులను అరెస్ట్ చేయకపోవటం పట్ల పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయన్నారు. ఇంత భారీ స్థాయిలో అవినీతి జరిగితే ప్రాథమిక నివేదికలో పోలీసులు కనీసం టేకు చెట్లు ప్రస్తావించకపోవటం వెనుక మతలబు ఏమిటని ఆయన ప్రశ్నించారు. ఈ చర్యను పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నదన్నారు. పోలీసులు, ప్రభుత్వం ఇలాగే మీనమేషాలు లెక్కిస్తే పెద్దఎత్తున ఆందోళనలు చేపడతామని ఆయన హెచ్చరించారు. వెంటనే దోషులను అరెస్ట్ చేసి ప్రభుత్వ ఆస్తులను కాపాడాలని, కాజేసిన సొమ్మును వారినుండి వసూలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. సమావేశంలో కొండా ప్రసాద్, బత్తల కృష్ణయ్య, ఆలూరు తిరుపాలు తదితరులు పాల్గొన్నారు.