శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

ఇదేం నిర్వహణ?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూళ్లూరుపేట, డిసెంబర్ 27: పక్షుల పండుగ సభా వేదికపై సాక్షాత్తు మంత్రి, అధికార పార్టీ ప్రజాప్రతినిధుల ముందు ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య తెలుగుదేశం ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. పండుగ ప్రారంభానికి మంత్రి శిద్దా రాఘవరావు, ఎమ్మెల్సీలు వాకాటి నారాయణరెడ్డి, బీద రవిచంద్ర తదితరులతో కలసి నవ్వుతూ వచ్చిన ఎమ్మెల్యే సభావేదిక వద్ద కాసేపు సాంస్కృతిక కార్యక్రమాలు సైతం తిలకించారు. అనంతరం సభా వేదికపైకి మొదట ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డిని జిల్లా అధికారులు పిలవడంతో సంజీవయ్య సభా ప్రాంగణం నుండి ఆగ్రహం వ్యక్తం చేసి వెళ్లిపోయారు. ఎమ్మెల్యే సభా అధ్యక్షుడిగా పిలవకుండా ఇదేమిటి అంటూ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసి తన అనుచరులతో కలసి నిరసన వ్యక్తం చేస్తూ వెళ్లిపోయారు. దీంతో కాసేపు సభలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మంత్రి, అధికార పార్టీ నేతలు చేసేదేమిలేక వేదికపై అరగంటసేపు మిన్నకుండిపోయారు. ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డి, ఆర్డీవో శీనానాయక్ వెంటనే ఎమ్మెల్యే వద్దకు వెళ్లి పొరపాటు జరిగింది, మీరే సభాధ్యక్షులు, కార్యక్రమం నిర్వహించాలని కోరినా తనకు ప్రతియేటా అన్యాయం జరుగుతూనే ఉందని, నేను రానునంటూ ముక్కుసూటిగా చెప్పేశారు. చివరకు వాకాటి ఇది మన ప్రాంత పండుగ రావాలంటూ బతిమాలి సభా వేదిక వద్దకు తీసుకొచ్చారు. తాఏమీ మాట్లాడనని, మీరే నిర్వహించడంటూ ఎమ్మెల్యే ఆవేశంగా పేర్కొన్నారు. అధికారులు, నేతలందరూ సర్దిచెప్పడంతో మైక్ తీసుకొని ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. పక్షులు లేని పండుగ ఎందుకంటూ గత రెండు పండుగలకు ముఖ్యమంత్రి ఇచ్చిన సందేశం, మంత్రి నారాయణ ఇచ్చిన హామీలు ఏమయ్యాయి అంటూ దీనికి ఇన్‌చార్జి మంత్రి సమాధానం చెప్పాలంటూ ఆవేశంగా మాట్లాడారు. ప్రభుత్వంపై విమర్శలు చేస్తుండగా మంత్రి ఆవేశంగా పైకి లేసేందుకు ప్రయత్నించగా పరసా వెంకటరత్నం జోక్యం చేసుకొని మంత్రిని సముదాయించారు. ఎమ్మెల్యే అంతటితో ఆగకుండా ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు, పక్షులు లేని పండుగ ఎందుకు.. పక్షులున్న గ్రామాలైన వేనాడు, పేర్నాడుకు రోడ్డు సౌకర్యం కల్పించేందుకు గతిలేదు ఇంత హంగామా అవసరమా అంటూ ఆవేశంగా ఊగిపోయారు. తనకు ప్రతిసారి అవమానమే జరుగుతోందని, అధికార్టీ నేతలు అభివృద్ధి చేశామంటూ ఈ ప్రాంతంలో నీరు-చెట్టులో దోచుకున్నారంటూ విమర్శలు చేశారు. చెంగాళమ్మ ఆలయం వద్ద బ్రిడ్జి నిర్మించలేదు, పులికాట్ పూడికతీత లేదు, నేలపట్టులో అభివృద్ధి లేదంటూ ఇదేనా ప్రభుత్వ పనితీరంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎమ్మెల్యే విమర్శలకు వాకాటి కౌంటర్
ప్రభుత్వంపై విమర్శలు చేసినంతసేపు ఓపిగ్గా విన్న అధికార పార్టీ నేతలు ఘాటుగా సమాధానమిచ్చారు. వాకాటి నారాయణరెడ్డి మైక్ అందుకొని ఇదేమి ఇప్పుడు ప్రారంభించిన పండుగ కాదు, టిడిపి అధికారంలోకి వచ్చిన తరువాత ప్రత్యేక రాష్ట్ర పండుగ చేసి నిధులు కేటాయించి ఈ ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తుంటే సలహాలు ఇవ్వాల్సిన ప్రతిపక్ష ఎమ్మెల్యే విమర్శలు చేయడం సమంజసం కాదని హితవు పలికారు. అభివృద్ధిలో అందరు పాలుపంచుకొని నిధులు సాధించుకోవాలే తప్ప ఏదో జరిగిన చిన్నపొరపాటుకు వేదికపై ప్రతిపక్ష పాత్రం పోషించడం మంచి పద్ధతి కాదన్నారు. ఇప్పటికే ముఖ్యమంత్రి దృష్టికి ఈ ప్రాంత సమస్యలు తీసుకెళ్లి నిధులు సైతం మంజూరయ్యాయని ఇది తెలుసుకొని మాట్లాడాలన్నారు. మాజీ మంత్రి పరసా కూడా పరోక్షంగా కిలివేటిపై విమర్శలు చేశారు. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసిన ఘతన టిడిపికే దక్కుతుందని, రాబోయే కాలంలో మరింత అభివృద్ధి చేస్తామన్నారు. ఎమ్మెల్సీ బీద కూడా ఎమ్మెల్యే మాటలను తప్పుబట్టారు. నిన్నటి వరకు పక్షుల పండుగ అంటూ తిరిగిన ఎమ్మెల్యే వేదిక వద్దకు వచ్చేసరికి ఒక్కసారిగా అనుచరులతో కలసి వెళ్లిపోతే సమస్య పరిష్కారం కాదన్నారు.

పక్షుల పండుగపై సైకత శిల్పం
గూడూరు, డిసెంబర్ 27: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న పక్షుల పండుగను పురస్కరించుకుని గూడూరు నియోజకవర్గంలోని చిల్లకూరు మండలం ఏరూరుకు చెందిన మంచాల సనత్‌కుమార్ పక్షుల పండుగ విశిష్టతను తెలిపే సైకత శిల్పాన్ని ఏర్పాటు చేశారు. దీనిని తిలకించేందుకు చుట్టుపక్కల గ్రామాలవారు వచ్చారు. తనదైన శైలిలో వివిధ పండుగలు, ఇతర ముఖ్య సందర్భాలలో ఇటువంటి సైకత శిల్పాలను వేయడం ఆయన ఆనవాయితీగా పెట్టుకున్నారు.