శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

ఆత్మకూరు బ్యాంకుల్లో ఐటి తనిఖీలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆత్మకూరు, డిసెంబర్ 27: ఆత్మకూరు పట్టణంలోని నాలుగు బ్యాంకుల్లో ఆదాయ పన్నుశాఖ అధికారులు తనిఖీలు నిర్వహించారు. మంగళవారం నిర్వహించిన ఈ తనిఖీల్లో భాగంగా గత నవంబర్ 8 తరువాత జరిగిన పెద్ద ఖాతాదారుల లావాదేవీలపై పరిశీలన చేశారు. పట్టణానికి చెందిన ముగ్గురి ధనవంతుల ఖాతాలపై ఈ సందర్భంగా అనుమానాలు వ్యక్తమయ్యాయి. స్థానిక బైపాస్ రోడ్డులో ఉన్న కొత్తగా కొలువుదీరిన బ్యాంకులపై ఐటి అధికారులు ప్రత్యేకంగా పరిశీలన గావించడం గమనార్హం.

మెడపై కత్తిపెట్టే బ్లాక్‌మెయిల్ సమ్మె సమంజసం కాదు
ఎపిపిఎస్‌సి ద్వారా వర్శిటీ అసిస్టెంట్ పోస్టుల భర్తీ
ప్రభుత్వ విద్యాసంస్థల్లో వైఫై, సిసి కెమెరాల ఏర్పాటు

నెల్లూరు కలెక్టరేట్, డిసెంబర్ 27: ఉత్తమ విద్యనందించేందుకు పాఠశాల విద్య, అధ్యాపక వృత్తి శిక్షణలో ఉన్నత ప్రమాణాలు సాధించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర మానవ వనరుల మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. జిల్లాలో ఏర్పాటు చేయనున్న జాతీయ విద్యా పరిశోధన, శిక్షణా సంస్థ(ఎన్‌సిఇఆర్‌టి) భూమిపూజకు వచ్చిన ఆయన నెల్లూరు నగరంలోని దర్గామిట్టలో ఉన్న ఓ హోటల్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతూ ఈ ఏడాది ఎంసెట్‌ను యధావిధిగా నిర్వహిస్తామన్నారు. అయితే ఎంసెట్‌కు ప్రాముఖ్యత తగ్గుతున్న దృష్ట్యా మెడిసిన్ కాకుండా మిగిలిన సెట్‌లను ఒక్కో వర్శిటీ ఒక్కో విభాగం సెట్ నిర్వహించాలనే ఆలోచన ఉందన్నారు. 20 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న 1100 వందల నియామకాలను చేపట్టడంతో పాటు 1000పైగా ఉన్న అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను ఎపిపిఎస్సి ద్వారా భర్తీచేస్తామన్నారు. గతంలో వీటిపై ఆరోపణలు రావటంతో పారదర్శకత కోసం ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. దక్షిణాది రాష్ట్రాల చిరకాలక స్వప్నమైన ఎన్‌సిఇఆర్‌టి సంస్థ ఏర్పాటు తొలుత విశాఖలో ప్రారంభించాలనుకున్నా జిల్లా ప్రత్యేక అవసరాల దృష్ట్యా కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు సూచన మేరకు ఇక్కడ నెలకొల్పుతున్నామన్నారు. విభజన అనంతరం 16,500కోట్లు లోటు బడ్జెట్ ఉన్నప్పటికి విద్యను ప్రోత్సహించటానికి గత ప్రభుత్వాల కన్నా 70.5శాతం నిధుల పెంచామన్నారు. ఏడాదికి 21.500కోట్లు విద్యకు కేటాయింపులు చేశామన్నారు. 12000మంది డిఎస్‌సి ద్వారా నియమించామన్నారు. విద్యాసంస్థల్లో వౌలిక వసతుల కల్పనకు 4000వేల కోట్లతో ప్రణాళికలు రూపొందించామన్నారు. పాఠశాల నిర్వహణ కమిటీలకు శిక్షణ అందజేయటంతో పాటు విధిగా పండుగ వాతావరణంలో వార్షికోత్సవాలు నిర్వహించాలన్నారు. ఆర్ధికంగా బలపడిన ఔత్సాహికులు విద్యకు చేయూత అందించాలన్న ప్రభుత్వ పిలుపు మేరకు 10కోట్ల మేర నిధులు సమకూరాయన్నారు. 100కోట్ల అంచనాలతో రాష్టవ్య్రాప్తంగా 5వేల పాఠశాలల్లో డిజిటల్ తరగతులు నిర్వహిస్తామన్నారు. ఇందుకోసం ప్రభుత్వం 70శాతం నిధులు, ప్రవాస భారతీయులు 30శాతం నిధులతో నిర్వహించనున్నామన్నారు. క్రమేపి అన్ని రెవెన్యూ డివిజన్లలో ఆదర్శ పాఠశాలలు నెలకొల్పుతామన్నారు. ఇకనుండి ప్రతి ఏడాది జనవరి 3న సావిత్రిభాయి పూలే జయంతిని పురస్కరించుకుని మహిళా ఉపాధ్యాయ దినోత్సవం నిర్వహించ తలపెట్టామన్నారు. దీనికి జాతీయ స్థాయిలో మంచి స్పందన వచ్చిందన్నారు. ప్రభుత్వ విద్యాసంస్థల్లో ప్రతిభగలవారు అధికమని ప్రభుత్వ విద్యను ప్రోత్సహించటం ద్వారా ప్రైవేటు విద్యను అధిగమిస్తామన్నారు. ఇందుకోసం రాష్టస్థ్రాయిలోని 175 నియోజకవర్గాల్లో అన్ని విద్యా ప్రామాణికాలను పరిగణనలోకి తీసుకుని ఉత్తమ విద్య ఎలా అందించాలనే విషయంపై వర్క్‌షాపు నిర్వహిస్తామన్నారు. ఉన్నత విద్యలో వర్శిటీలకు ర్యాంకింగ్ వ్యవస్థ ఏర్పాటుతో పాటు విఐటి, ఎస్‌ఆర్‌ఎం, ఎన్‌ఐటి వంటి ప్రైవేటు వర్శిటీల స్థాపిస్తామన్నారు. నైతిక విలువలు, నిత్య జీవితానికి అవసరమయ్యే విద్యనందిస్తామన్నారు. ఇప్పటికే ఐఐఎం, ఐఐటీ, త్రిబుల్ ఐటీ, ఎన్‌ఐటి వంటి ప్రతిష్టాత్మక వర్శిటీలు స్థాపించామని, వీటితో పాటు పెట్రోలియం, రైల్వే, కేంద్రీయ వర్శిటీల ఏర్పాటుకు కృషి చేస్తున్నామన్నారు. వర్శిటీల ప్రగతిపై మూడు మాసాలకోసారి సమీక్ష నిర్వహిస్తున్నారు. వర్శిటీలను యుఎస్‌ఎ, ఫిన్‌లాండ్ వంటి ఇతర దేశాల విద్యతో సమ్మిళతం చేసి అధ్యయనంపై నివేదిక తయారు చేస్తామన్నారు. ఇటీవల తన ఆధ్యర్యంలో విద్యపై బృందంగా ఆ దేశాలలో పర్యటించామని ఆయా దేశాల విద్యార్థులతో పాటే పీజులు వసూలు చేయాలనే బృంద అభ్యర్ధన మేరకు ఫీజు రాయితీ కల్పించారన్నారు.
సమ్మె సమంజసం కాదు
ఉద్యోగుల పట్ల ప్రభుత్వం సానుకూలంగా ఉందని, పరిష్కారం దిశగా ఇప్పటికే కేబినెట్ సబ్ కమిటీ నియమించామన్నారు. విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని కాంటాక్ట్ లెక్చరర్స్ వెంటనే విధుల్లో చేరాలన్నారు. మెడపై కత్తి పెట్టే బ్లాక్ మెయిలింగ్ సమ్మెలు సమంజసం కాదన్నారు. తన పిలుపు మేరకు విధులకు హాజరవుతున్న వారికి ధన్యవాదాలన్నారు.