నెల్లూరు

రెండో పంటకు నీరందేనా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు, మార్చి 22: గతేడాది వర్షాలు సమృద్ధిగా కురవడంతో ఈ ఏదాది రెండో పంట పండించుకోవచ్చని రైతులు సంబరపడ్డారు. అయితే తేలని నీటి లెక్కలతో రెండో పంటకు సాగునీరు ప్రశ్నార్ధకమయింది. సోమశిల నీటి లెక్కల్లో తేడాలు ఉన్నాయని ప్రతిపక్ష పార్టీలు అంటుండగా, లేదు నీటి నిల్వలు సరిగానే ఉన్నాయని ప్రభుత్వం, పాలకపక్ష నాయకులు అంటున్నారు. పెన్నా రైతుల ఆందోళనల నేపథ్యంలో రెండో పంటకు సాగునీరందించేలా ఈనెల 20న సాగునీటి సలహా సంఘం (ఐఎబి) సమావేశం నిర్వహిస్తామని కలెక్టర్ ఎం జానకి ప్రకటించారు. ఇందుకోసం ఈనెల 15న డెల్టా రైతులతో ఆమె సమావేశం నిర్వహించారు. 22 టిఎంసిల సాగునీటి లెక్కల తదితరాలపై చర్చించారు. సోమశిల ప్రాజెక్ట్‌లో నీటి నిల్వల్లో తేడాలున్నట్టు రైతుసంఘం, ప్రతిపక్ష వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు. దీనిపై స్పందించిన కలెక్టర్ నీటి నిల్వలపై ఆరా కోసం స్వయంగా వెళ్లి పరిశీలించి నీటి నిల్వలు వివరాలు తెలుసుకున్నారు. ప్రాజెక్ట్ ఇంజనీర్ల వివరాల మేరకు 32.806 టిఎంసిల నీరు ఉన్నట్లు పేర్కొన్నారు. అయితే కలెక్టర్ ఆదేశాల మేరకు పరిశీలనకు వెళ్లిన ఆత్మకూరు తహశీల్దారు వెంకటేశ్వర్లుకు మాత్రం 36.056 టిఎంసిల నీరు ఉన్నట్లు తెలిపారు. ఇలా తేడా వచ్చిన 3.250 టిఎంసిల నీరు అధికంగా ఉన్నా రికార్డుల్లో తక్కువగా చూపడాన్ని అందరూ తప్పు పడుతున్నారు. దీనిపై స్పందించిన కలెక్టర్ ప్రాజెక్ట్ కార్యనిర్వాహక ఇంజనీరు ఎస్ వెంకటేశ్వరరావును సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. అనంతరం కలెక్టర్ దీనిపై పూర్తిస్థాయి విచారణ చేపట్టారు. తొలినుంచి ఇంజనీర్ల పనితీరుపై ఆరోపణలు వినిపిస్తూనే ఉన్నాయి. అయితే సోమశిల ప్రాజెక్ట్‌లో నీరు దుర్వినియోగం కాలేదని కలెక్టర్ ఈనెల 19న ప్రకటించారు. సేకరించిన సమాచారం మేరకు నీటి గణాంకాలు పూర్తిస్థాయిలో లేవని, అయితే ప్రాజెక్ట్‌ల్లో ఉన్న నీరు, విడుదల, వస్తున్న నీటి గణాంకాలను పూన్తిగా పరిశీలించామని చెప్పారు. రైతు సంఘాలు ఆరోపిస్తున్నట్లు 26 టిఎంసి నీరు దుర్వినియోగం కాలేదని, ప్రాజెక్ట్‌లోనే నీరు నిల్వ ఉందన్నారు. ఏదిఏమైనా ఇప్పటికైనా పెన్నా డెల్టా రైతులకు న్యాయం చేసి రెండో పంటకు సాగునీరు అందించాలని రైతులు కోరుతున్నారు.
నేడు ఐఎబి సమావేశం
అనేక అవాంతరాలు, అనుమానాలు, వాయిదాల మధ్య ఎట్టకేలకు సాగునీటి సలహా సంఘం (ఐఎబి) సమావేశం బుధవారం మధ్యాహ్నం నిర్వహించనున్నారు. దీనిపై పాలకపక్ష ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రతిపక్ష పార్టీ ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రైతుసంఘాల నాయకుల మధ్య వాడివేడి చర్చ జరుగనుంది.