శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

ఖాదీ, హస్తకళలను ప్రోత్సహించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు కలెక్టరేట్, జనవరి 7: ఖాదీ ఉత్పత్తులు, హస్తకళలను ప్రోత్సహించి వాటి వినియోగాన్ని విస్తృతపరచాలని పురపాలక మంత్రి డాక్టర్ పి నారాయణ అన్నారు. జిల్లా కేంద్రంలోని సర్వోదయ కళాశాల ప్రాంగణంలో శనివారం ఆయన రాష్టస్థ్రాయి ఖాదీ బజార్ ప్రదర్శనను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రం నలుమూలల నుండి నాణ్యమైన ఖాదీ, హస్తకళల ఉత్పత్తులు ఒకచోట ప్రదర్శించి సరసమైన ధరలకు విక్రయించటం వినియోగదారులకు మంచి అవకాశమన్నారు. ఖాదీకి స్వాత్యంత్య్ర ఉద్యమంతో అనుబంధం ఉందని, ఖాదీ అంటే జాతిపిత గాంధీ స్ఫురణకు వస్తారన్నారు. ఎంపి మేకపాటి రాజమోహన్‌రెడ్డి, ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీ్ధర్‌రెడ్డి మాట్లాడుతూ ప్రదర్శనలో ఉంచిన వస్తువులు నాణ్యతతో పాటు ఆకర్షణీయంగా ఉన్నాయన్నారు. ఈ ఉత్పత్తుల రాష్టవ్య్రాప్త ప్రదర్శనను జిల్లాలో ఏర్పాటుచేసి ఈనెల 22 వరకు నిర్వహించటం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో కలెక్టర్ ముత్యాలరాజు, ఖాదీ విలేజ్ కమిషన్ ఉప సంచాలకులు భూమయ్య, బిజెపి అధికార ప్రతినిధి కర్నాటి ఆంజనేయరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

‘అందరికీ ఆరోగ్యం-చంద్రన్న ఆశయం’
నెల్లూరు కలెక్టరేట్, జనవరి 7: రాష్ట్రంలో అందరికీ ఆరోగ్య భద్రత కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని ఎన్‌టిఆర్ వైద్యసేవ జిల్లా సమన్వయకర్త డాక్టర్ సి దయాకర్ అన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ప్రధాన వైద్యశాలలో శనివారం నిర్వహించిన అందరికీ ఆరోగ్యం-చంద్రన్న ఆశయం అనే పథక కరపత్రాన్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటివరకు ప్రభుత్వ ఉద్యోగులకు, పాత్రికేయులకు వర్తింపజేసిన ఆరోగ్య సంరక్షణ పథకాన్ని దారిద్య్రరేఖకు దిగువన ఉన్న 32 లక్షల కుటుంబాలకు వర్తింప చేసేందుకు ప్రభుత్వం సంకల్పించిందన్నారు. ఇందుకోసం ఏడాదికి 1200 రూపాయలను వచ్చేనెల 28వ తేదీలోగా చెల్లిస్తే 1044 వ్యాధులకు ప్రభుత్వ, ప్రైవేటు వైద్యశాలల ద్వారా నాణ్యమైన వైద్యం అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

చంద్రన్న బీమా మహత్తర పథకం
ఎంఎల్‌సి సోమిరెడ్డి స్పష్టం
మనుబోలు, జనవరి 7: ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రవేశపెట్టిన చంద్రన్న బీమా మహత్తర పథకమని ఎంఎల్‌సి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి అన్నారు. స్థానిక హైస్కూల్‌లో శనివారం సర్పంచ్ కంచి పద్మ అధ్యక్షతన జన్మభూమి సమావేశం నిర్వహించారు. ఈసమావేశంలో ఆయన మాట్లాడుతూ గతంలో డబ్బున్న వారికే బీమా సౌకర్యం కలిగి వుండేవారని, నేడు ముఖ్యమంత్రి రాష్ట్రంలో 18 సంవత్సరాలు నిండి 70 సంవత్సరాల లోపు ఉన్న ప్రతిఒక్కరికీ ఈ బీమా ప్రవేశపెట్టారని తెలిపారు. పేదల సమస్యలను పరిష్కరించడానికే ప్రభుత్వం జన్మభూమి సమావేశాలను ఏర్పాటు చేసిందన్నారు. ప్రస్తుతం మండలంలో ఉన్న కండలేరు ఆయకట్టు రైతులకు ఇప్పటికే 1 టిఎంసి నీటిని విడుదల చేశామని మిగిలిన 0.4 టిఎంసి నీటిని రేపటి నుండి విడుదల చేయాలని కలెక్టర్ ముత్యాలరాజును కోరారు. వచ్చిన నీటిని వృథా చేయకుండా పొదుపుగా వినియోగించుకోవాలని ఆయన సూచించారు. జిల్లా కలెక్టర్ ముత్యాలరాజు మాట్లాడుతూ సంక్షేమ పథకాలను అర్హులైన పేద ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. పొగరహిత సమాజం ఏర్పాటు చేయడానికి ప్రతిఒక్కరికి దీపం పథకం కింద గ్యాస్ కనెక్షన్‌ను అందిస్తున్నామన్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 66 శాతం చంద్రన్న కానుకలను అందించామని సంక్రాంతి లోపల 100 శాతం అందిస్తామన్నారు. అనంతరం సామూహిక సీమంతాలు, అన్నప్రాసన కార్యక్రమాలను నిర్వహించారు. మనుబోలు పంచాయతీ ఈ-పంచాయతీగా ఆన్‌లైన్ చేయగా సోమిరెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంఎల్‌సి బీద రవిచంద్ర, జడ్‌పిటిసి తిరివీధి రమేష్, ఎంపిడిఓ కె.హేమలత, తహశీల్దారు కెవి రమణయ్య, ఇరిగేషన్ డిఈ సమీవుల్లా, డిప్యూటి డిఈఓ మంజులాక్షి, సింగిల్ విండో డైరెక్టర్ చిట్టమూరు వెంకటశేషారెడ్డి, తెలుగుదేశం నాయకులు గాలి రామక్రిష్ణారెడ్డి, రామక్రిష్ణయ్య, సుధాకర్‌రెడ్డి, విజయభాస్కర్‌రెడ్డి, చేరెడ్డి పట్ట్భారామిరెడ్డి, కిషోర్‌నాయుడు, కిరణ్, దయాకర్, ఉపసర్పంచ్ దండు చంద్రశేఖర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.