శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

నెల్లూరు కార్పొరేషన్ పరిధిలో దశలవారీగా అభివృద్ధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు, జనవరి 7: నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఎన్నడూ లేని విధంగా గత ఏడాది జనవరి నుంచి దశలవారీగా ఇప్పటివరకు 140 కోట్ల రూపాయలు కేటాయించినట్లు రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పి నారాయణ పేర్కొన్నారు. నగర కార్పొరేషన్ పరిధిలో 50వ డివిజన్‌లో జన్మభూమి-మావూరు కార్యక్రమానికి శనివారం మంత్రి ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఆయా డివిజన్ల ప్రజా ప్రతినిధుల సూచనల మేరకు డివిజన్లలో త్వరలోనే అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రాష్టవ్య్రాప్తంగా పేదలకు లక్షా 20 వేల ఇళ్లు నిర్మించడానికి కృషి చేస్తోందన్నారు. పేదలకు గృహాలు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించి ఇస్తామన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాల గురించి ఆయన మాట్లాడుతూ తల్లీబిడ్డ పథకానికి 270 వాహనాలు కొనుగోలు చేసినట్లు తెలిపారు. ఎన్నికల వాగ్దానాల్లో లేనివి చంద్రన్న బీమా, చంద్రన్న కానుక వంటి పథకాలు కూడా రాష్ట్ర ప్రభుత్వం పేదలకు ఇస్తోందన్నారు. అర్హులైన వారికి పింఛన్లు, రేషన్‌కార్డులు, హెల్త్‌కార్డులు ఇవ్వనున్నట్లు తెలిపారు. పేదరికాన్ని పారదోలడానికి చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన వెల్లడించారు. రాష్ట్రంలో ఉన్న 110 మున్సిపల్ స్కూళ్లలో ఐఐటి ఫౌండేషన్ కోర్సును ప్రవేశపెట్టినట్లు ఆయన తెలిపారు. అంగన్‌వాడీ స్కూళ్లలో లోగడ ఆరేళ్ల వయసున్న పిల్లలందరిని ఒకే గదిలో కూర్చొపెట్టేవారన్నారు. దీనివల్ల నాణ్యతాపరమైన విద్య చిన్నపిల్లలకు అందదనే ఉద్దేశ్యంతో దాన్ని సరిదిద్దడానికి ప్రభుత్వం ఉత్వర్వులు జారీచేసి అమలు చేయనున్నట్లు ఆయన తెలిపారు. దీని ప్రకారం నర్సరీ, ఎల్‌కెజి, యుకెజి తరగతులుగా విభజించి కార్పొరేట్ స్థాయిలో అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా చిన్నపిల్లలకు విద్యనందించడానికి శ్రీకారం చుట్టినట్లు మంత్రి తెలిపారు. నెల్లూరు నగర కార్పొరేషన్‌లో అభివృద్ధి పథకాల గురించి వివరించారు. 1100 కోట్ల హడ్కో రుణంతో నగరంలో భూగర్భ డ్రైనేజీ నిర్మాణం, తాగునీరు అందించడానికి ఇప్పటికే చర్యలు తీసుకున్నట్లు ఆయన తెలిపారు. చెత్తను ఉపయోగించి విద్యుత్‌ను తయారుచేసే ప్లాంటును కూడా ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. అనంతరం మంత్రి నారాయణ గర్భిణులకు సీమంతాలు నిర్వహించారు. ఈ సమావేశంలో మాజీ శాసనసభ్యుడు, టిడిపి నగర ఇన్‌చార్జ్ ఎం శ్రీ్ధర్‌కృష్ణారెడ్డి, కార్పొరేటర్లు పాల్గొన్నారు.

కార్పొ‘రేటు’తో ఢీకి రెడీ
* ఎంఎల్‌సి యండపల్లి సవాల్
ఆత్మకూరు, జనవరి 7: కార్పొరేట్ శక్తులు రాజకీయ రంగప్రవేశం చేస్తే ప్రజాస్వామ్యం నిలువునా ఖూనీ అవుతుందని అమెరికాకు చెందిన మాజీ అధ్యక్షులు రూజ్‌వెల్ట్ ఎప్పుడో చెప్పారని, ఇప్పుడు జిల్లాకు చెందిన రాష్ట్ర సచివులు పొంగూరు నారాయణ ఆ అంశాన్ని తేటతెల్లం చేసేలా ప్రవర్తిస్తున్నారని తూర్పు రాయలసీమ పట్ట్భద్ర ఎంఎల్‌సి యండ్లపల్లి శ్రీనివాసులురెడ్డి పేర్కొన్నారు. రానున్న ఎంఎల్‌సి ఎన్నికల్లో తిరిగి పోటీ చేస్తున్న తనకు ఓట్లేసి గెలిపించాలంటూ శనివారం ఆత్మకూరులోని వివిధ ప్రభుత్వ కార్యాలయాలు, స్కూళ్లతోపాటు ప్రైవేట్ విద్యాసంస్థల్లో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా యూటిఎఫ్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎంఎల్‌సిగా కాకుండానే అమాత్య పదవి అందిపుచ్చుకున్న విద్య, వైద్య వ్యాపారవేత్త పొంగూరు నారాయణ ఆద్యంతం అంతా ధనార్జనే ధ్యేయంగా కొనసాగుతున్నారని దుయ్యబట్టారు. అందుకే మున్సిపల్ స్కూళ్లను నారాయణ విద్యాసంస్థల ఆధీనంలో లీజుకు తీసుకోవాలనే ప్రయత్నం చేశారన్నారు. అయితే ప్రజాస్వామ్యవాదులుగా తాము అడ్డుకున్నట్లు గుర్తు చేశారు. ఇదేవిధంగా వైద్యారోగ్య మంత్రి కామినేని శ్రీనివాస్, విద్యామంత్రి గంటా శ్రీనివాస్‌లు కూడా కొనసాగుతున్నారని ఆరోపించారు. వైద్యారోగ్య మంత్రి కామినేని తిరుపతిలో ప్రభుత్వాసుపత్రిని అపోలోకు అప్పగించారన్నారు. ఆయనకు చెందిన ప్రైవేట్ ఆసుపత్రి పరిధిలోకి రాష్ట్రంలోని మరో ఏడు జిల్లా ఆసుపత్రులను లీజు పేరిట స్వాధీనపరచుకోవడం దారుణమన్నారు. ఎప్పటికప్పుడు ప్రభుత్వాధినేతల్ని పారిశ్రామికవేత్తలు మభ్యపరచుకుంటున్నారంటూ జిల్లాలోని తడ వద్ద శ్రీసిటీ నిర్వాకాలపై ఆరోపించారు. సిరులు పండించే భూములందుకుని స్థానికులకు ఉద్యోగ అవకాశాలు ఇవ్వకుండా నిర్లక్ష్యం ప్రదర్శించడం అమానుషమన్నారు. తమిళనాడు నుంచి నిత్యం బస్సుల్లో ఉద్యోగులు తరలివస్తుండటంతో స్థానికంగా భూములు కోల్పోయి, ఉపాధి కరవైన వారంతా రక్తకన్నీరు పెట్టుకునే దుస్థితి నెలకొంటుందన్నారు. ఉపాధ్యాయులకు సామర్ధ్య పరీక్షలు అంటూ ఆగడం చేసిన ఐఏఎస్ అధికార్లకు వ్యతిరేక స్వరం వినిపించి తోకముడిచేలా చేసింది తామేనని గుర్తు చేశారు. మోడల్ ప్రాథమిక స్కూళ్ల మెరుగుకై నిధులివ్వకుండా ఉపాధ్యాయ రేషనలైజేషన్ చేయాలనే ప్రభుత్వ విధానాన్ని కూడా అడ్డుకున్నట్లు తెలిపారు. సిపిఎస్ రద్దు చేసే వరకు యూటిఎఫ్ పోరాటం సాగిస్తుందన్నారు. సుప్రీంకోర్టు 1982లోనే పింఛన్ యాచన కాదని, ఉద్యోగుల హక్కు అంటూ తేల్చి చెప్పినా ప్రభుత్వాలు మాత్రం నిర్లక్ష్య ధోరణితోనే వ్యవహరిస్తున్నాయని ధ్వజమెత్తారు. అందువల్ల అభ్యుదయ భావజాలంతో పనిచేసే పిడిఎఫ్ ఎంఎల్‌సి అభ్యర్థులకే పట్టం గట్టాలని ఆయన పిలుపునిచ్చారు.