శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

నగదు రహితం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు, జనవరి 8: దేశ వ్యాప్తంగా అన్ని రంగాల్లో డిజిటల్ లావాదేవీల దిశగా ముందుకు వెళుతున్నాయి. ప్రజలకు అన్నం పెట్టే రైతులను నగదు రహిత లావాదేవీల నిర్వహణలో భాగస్వాములుగా చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. రైతులకు నగదు రహిత లావాదేవీలపై పూర్తిస్థాయి అవగాహన కల్పించడంతోపాటు భవిష్యత్‌లో వారు దాన్ని అనుసరించేలా చూడాలని వ్యవసాయ శాఖకు ఆదేశాలు అందాయి. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం అన్ని జిల్లాల వ్యవసాయ శాఖలకు ఈ కార్యక్రమం అమలుచేయాలని ఉత్తర్వులు ఇచ్చింది. డిజిధన్ మేళాలను మండలానికి కనీసం రెండు గ్రామాల్లో నిర్వహించి అక్కడ రైతులను సమీకరించాలని నిర్ణయించారు. వీటి నిర్వహణ బాధ్యతను ఎరువులు, పురుగు మందుల తయారీ కంపెనీలకు అప్పగించారు. రాష్ట్ర వ్యాప్తంగా నాగార్జున ఫెర్టిలైజర్స్ కంపెనీ లీడ్ ఏజన్సీగా వ్యవహరించనున్నది. డిజిధన్ యోజనను సిఎం చంద్రబాబునాయుడు శుక్రవారం ప్రారంభించారు. ఇప్పటి నుంచి ఏప్రిల్ 14వ తేదీ వరకు గ్రామాలవారీగా కార్యక్రమాలు నిర్వహించేందుకు జిల్లా స్థాయిలో ప్రణాళికలు రూపొందించుకోవాలని సూచించారు. జిల్లా పాలనాధికారిని నోడల్ అధికారిగా నియమించారు. ఎరువుల తయారీదారులు మేళాలు నిర్వహించిన గ్రామాల్లో స్టాల్స్ ఏర్పాటు చేయనున్నారు. కొనుగోలులో నగదు రహిత లావాదేవీల గురించి అవగాహన కల్పించనున్నారు. జిల్లాకు సంబంధించిన ఇఫ్కో తదితర కంపెనీలు కార్యక్రమాలు నిర్వహించడానికి ముందుకువచ్చాయి. సదస్సుకు బ్యాంకర్లు, ఎరువులు, పురుగుల మందుల డీలర్లు హాజరుకానున్నారు.
వంద రోజుల ప్రణాళిక
నగదు రహిత లావాదేవీలపై వంద రోజుల ప్రణాళికలతో వ్యవసాయ శాఖ శ్రీకారం చుట్టనున్నది. ఇందులో ప్రధాన మంత్రి ప్రకటించిన లక్కీ గ్రాహక్ యోజనను రైతులకు వివరిస్తారు. ఈ పథకంలో దేశ వ్యాప్తంగా రోజుకు 1,500 బహుమతులు అందజేయనున్నారు. ఏరోజుకారోజు లక్కీ డ్రా నిర్వహిస్తారు. రూపే కార్డు, యుపిఐ, ఎఇపిఎస్ తదితర పద్ధతుల్లో నగదు రహిత లావాదేవీలు జరిపిన రైతు ఖాతా నెంబర్లను లక్కీ డ్రాలో ఉంచి ఎంపికైన రైతులకు వెయ్యి రూపాయలు చొప్పున బహుమతులు అందజేస్తారు. ప్రథమ, ద్వితీయ బహుమతులుగా పది వేలు, ఐదు వేలు చొప్పున పంపిణీ చేయనున్నారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా ఏప్రిల్ 14న మెగా బహుమతులను రైతులకు ఎంపిక చేస్తారు. దేశ వ్యాప్తంగా మూడు మెగా బహుమతులు అందించనున్నారు. మొదటి బహుమతి కింద కోటీ, రెండో బహుమతి కింద 50 లక్షలు, మూడో బహుమతి కింద 25 లక్షలు అందజేస్తారు. నగదు రహిత లావాదేవీల్లోని కేటగిరిల మేరకు ప్రతి కేటగిరికి ఒక విజేతను ఎంపిక చేస్తారు. ఈ విషయాలను వ్యవసాయ శాఖ నిర్వహించే డిజిధన్ మేళాలో రైతులకు వివరిస్తారు. రాష్ట్ర స్థాయి కార్యక్రమం పూర్తయిన తరువాత జిల్లాలో మేళాలు ప్రారంభించేందుకు జిల్లా వ్యవసాయ శాఖ సన్నాహాలు చేస్తుంది.
ప్రజా సంక్షేమమే సిఎం లక్ష్యం
కావలి టౌన్, జనవరి 8: జన సంక్షేమమే సిఎం చంద్రబాబు లక్ష్యమని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి, జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి శిద్దా రాఘవరావు స్పష్టం చేశారు. ఆదివారం పట్టణంలో 27, 28 వార్డులకు సంబంధించి క్రిస్టియన్‌పేటలో జరిగిన జన్మభూమి - మావూరు కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. టిడిపి జిల్లా అధ్యక్షులు, ఎంఎల్‌సి బీద రవిచంద్ర, రాష్ట్ర టూరిజం అభివృద్ధి సంస్థ ఎండి ప్రొఫెసర్ జయరామిరెడ్డి తదితరులతో కలిసి ఆయన జన్మభూమి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రం 19 వేల కోట్ల రూపాయల లోటు ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి చంద్రబాబు డ్వాక్రా, రైతురుణమాఫీ పథకాలు, పింఛన్‌ల పెంపు, ఎన్టీఆర్ ఆరోగ్యసేవ లాంటి ఎన్నో పథకాలు అమలు చేశారన్నారు. రాజధాని నిర్మాణం, రోడ్ల నిర్మాణం పెద్ద ఎత్తున చేస్తుండగా ప్రజల ఆర్థిక స్థితిని మార్చే అనేక పథకాలు అమలవుతున్నాయన్నారు. ఎమ్మెల్సీ రవిచంద్ర మాట్లాడుతూ రాష్ట్రంలో 10వేల రేషన్ కార్డులు కొత్తగా ఇస్తున్నామన్నారు. ఇ-పాస్ యంత్రాల ద్వారా దొంగ కార్డులను గుర్తించి జిల్లాలోనే 4 వేల కార్డులను తొలగించామన్నారు. దీనిని విపక్ష వైకాపా బూతద్దంలో చూపి దుష్ప్రచారం చేస్తోందన్నారు. పట్టిసీమ, పెన్నా - గోదావరి నదుల అనుసంధానం, ఓడరేవుల నిర్మాణం, కోస్టల్ కారిడార్ ఏర్పాటు, అమరావతి - అనంతపురం హైవే తదితర విషయాలను ప్రస్తావించారు. కావలి నియోజకవర్గంలో రోడ్ల అభివృద్ధికి రూ.90 కోట్లు మంజూరయ్యాయని చెప్పారు. తమ 27వ వార్డును ప్రభుత్వం స్మార్ట్ వార్డుగా ప్రకటించగా తామే దత్తత తీసుకొని అభివృద్ధి చేస్తున్నట్లు మరింత అభివృద్ధి కోసం ప్రభుత్వం, అధికారులు సహకరించాలని 27వ వార్డు కౌన్సిలర్ గుంటుపల్లి శ్రీదేవి చౌదరి విజ్ఞప్తి చేసారు. సభలో ఆమె మాట్లాడుతూ తమ స్వంత నిధులు ఖర్చుపెట్టి పాఠశాలను అభివృద్ధిచేసామని, కొన్ని డ్రైయిన్‌లను నిర్మించామని తెలిపారు. తమ వార్డులో గల సాగర్ కాలనీలో కొంతమంది మత్య్సకారులు ప్రభుత్వ స్థలాల్లో దశాబ్దాలుగా నివశిస్తున్నారని, ఇటీవల క్రమబద్ధీకరణ చట్టం అనుసరించి స్థలాలను రెగ్యులర్ చేసారని, మిగిలిన స్థలాలను కూడా చేయాలని కోరారు. పలు సమస్యలను మంత్రి ముందు ఉంచిన వారు సహకరిస్తే రాష్ట్రంలోనే మొట్టమొదటిగా అభివృద్ధి చెందిన స్మార్ట్‌వార్డుగా తయారు చేస్తామన్నారు. 28వ వార్డు కౌన్సిలర్ నున్న మృదుల, కో ఆప్షన్ సభ్యులు నున్నా వెంకటరావు మాట్లాడుతూ వార్డుకు సంబంధించిన సమస్యలను మంత్రికి తెలిపి పరిష్కరించాలని కోరారు. ఇప్పటికే తాను రాజధాని కమిటీ సభ్యులు బీద మస్తాన్‌రావు, ఎంఎల్‌సి బీద రవిచంద్రకు సమస్యలు వివరించామని, పరిశీలిస్తామని హామీ ఇచ్చారని స్పష్టం చేసారు. అంతకుముందు ఎఎంసి చైర్మన్ దేవరాల సుబ్రమణ్యం, మున్సిపల్ చైర్‌పర్సన్ పోతుగంటి అలేఖ్య ప్రసంగించారు. మంత్రి శిద్దా, ఎమ్మెల్సీ రవిచంద్ర, స్థానిక నేతలు అంతాకలిసి లబ్ధిదారులకు చంద్రన్న సంచులు, రేషన్ కార్డులు, కొత్త పింఛన్‌లు అందజేశారు. పట్టణంలోని 26, 29 వార్డుల జన్మభూమి సభలు ఆదివారం ప్రశాంతంగా జరిగాయి. 29 వవార్డు కౌన్సిలర్ సురే మోహన్‌రెడ్డి నేతృత్వంలో స్థానిక విశ్వోదయా బాలికల ఉన్నతపాఠశాలలో జరగగా చైర్‌పర్సన్ అలేఖ్య, నేతలు, అధికారులు హాజరయ్యారు. వార్డుసమస్యలను వివరించిన కౌన్సిలర్ మోహన్‌రెడ్డి మున్సిపల్ ఫ్లాట్స్‌లో ఎక్కడా రోడ్లు లేవని, డ్రైన్‌లు నిర్మించలేదని, ఎస్సీ, ఎస్టీలు నివసిస్తున్నా సబ్ ప్లాన్ నిధులు ఇవ్వలేదన్నారు. పలు సమస్యలను తెలియజేశారు. 26వ వార్డులో కౌన్సిలర్ గంగినేని పద్మావతి నేతృత్వంలో స్థానిక సంక్షేమ వసతి గృహాల సమీపంలో సభ నిర్వహించగా చైర్‌పర్సన్ అలేఖ్య, టిడిపి అధ్యక్షులు మలిశెట్టి వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి అమరావేదగిరి గుప్తా, గంగినేని వెంకటేశ్వర్లు నాయుడు, దామా మాల్యాద్రి నాయుడు, వడ్లమూడి వెంకటేశ్వర్లుతో పాటు పలువురు పాల్గొని లబ్ధిదారులకు ప్రభుత్వ ఫలాలను అందజేశారు.