శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

స్వామీ రంగనాథ..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు, జనవరి 8: జిల్లావ్యాప్తంగా ముక్కోటి ఏకాదశి వేడుకలు కన్నులపండువగా నిర్వహించారు. నెల్లూరు రంగనాయకులపేటలోని తల్పగిరి శ్రీరంగనాథస్వామి ఆలయంలో ఆదివారం ముక్కోటి పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కోటి ఏకాదశిల పుణ్యం లభించే ముక్కోటి పర్వదినాన వైష్ణవాలయాల్లో వైకుంఠ ( ఉత్తర) ద్వార దర్శనం చేసుకునేందుకు భక్తులు బారులు తీరారు. శ్రీరంగనాథస్వామి ఆలయంలో శనివారం రాత్రి నుంచే క్యూలైన్లలో భక్తులు వేచి ఉన్నారు. వేకువజామున దేవేరుల సమేతుడైన స్వామివారు ఉత్తరద్వారం గుండా భక్తులకు దర్శనమిచ్చారు. ఉత్తరద్వారాలు తెరిచే సమయం కోసం భక్తులు ఎంతో ఆతృతతో ఎదురుచూశారు. చివరకు అలంకార భూషితుడైన స్వామివారు తన దేవేరులతో కలసి పల్లకిరూఢుడై భక్తులకు దర్శనమివ్వడంతో వారు తన్మయం చెందారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆనం కుటుంబీకులు ముక్కోటి కార్యక్రమ ఉభయకర్తలుగా వ్యవహరించారు. క్యూలైన్లలో వేచి ఉన్న భక్తులకు బాదంపాలు, మజ్జిగ, తాగునీరు తదితర పానీయాలను అందించారు. నగర డిఎస్పీ నేతృత్వంలో నగరంలోని పలు స్టేషన్ల సిఐలు, ఎస్సైలు, పోలీస్ సిబ్బంది బందోబస్తు ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, నగర మేయర్ అబ్దుల్ అజీజ్, ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ మంచికంటి సుధాకర్, ఆనం రంగమయూర్‌రెడ్డి, విజయా డెయిరీ చైర్మన్ కొండ్రెడ్డి రంగారెడ్డి, వేమిరెడ్డి పట్ట్భారామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఆలయం తలుపుల మూసివేత
ముక్కోటి పర్వదినాన శ్రీ రంగనాథస్వామి ఆలయ సమీప ప్రాంతానికి చెందిన స్థానికుడొకరు అనారోగ్యంతో మృతి చెందాడు. దీంతో మధ్యాహ్నం 3 గంటల నుండి ఆలయ తలుపులను అర్చకులు మూసివేశారు. ఉదయం సంప్రోక్షణ అనంతరం తిరిగి ఆలయ ద్వారాలు తెరుస్తామని చైర్మన్ సుధాకర్ తెలిపారు. ఉదయం నుంచి రంనాథుని చూచి తరించేందుకు క్యూలైన్లలో ఉన్న భక్తులకు ఈ సంఘటనతో నిరాశ చెందారు.
ఆలయాల్లో ముక్కోటి పూజలు
ముక్కోటి పర్వదినాన్ని పురస్కరించుకొని నగరంలోని పలు వైష్ణవాలయాల్లో వైకుంఠద్వార దర్శనాలను భక్తులకోసం ఏర్పాటు చేశారు. నగరంలోని శ్రీవేణుగోపాలస్వామి దేవస్థానంలో భక్తులు శ్రీవేణుగోపాలస్వామిని దర్శనం చేసుకునేందుకు భారీ సంఖ్యలో విచ్చేశారు. మూలస్థానేశ్వరస్వామి దేవస్థానంలోనూ ముక్కోటి ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించారు. ఆలయ చైర్మన్ అల్తూరి గిరీష్‌రెడ్డి, ఇ ఓ పోరెడ్డి కార్యక్రమాలను పర్యవేక్షించారు. మాగుంట లేఅవుట్‌లోని శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయం, శబరి శ్రీరామక్షేత్రం, అయ్యప్పగుడిలోని శ్రీ గురువాయూర్ మహావిష్ణు ఆలయంలోను ఉత్తర ద్వారదర్శనం ద్వారా భక్తులు స్వామివార్లను దర్శించుకున్నారు.
తల్పగిరి రంగనాథస్వామిని దర్శించుకున్న మంత్రి
నెల్లూరుసిటీ: ముక్కోటి సందర్భంగా తల్పగిరి రంగనాథస్వామి ఆలయంలో రాష్ట్ర మునిసిపల్ శాఖ మంత్రి నారాయణ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా వైకుంఠ ఏకాదశి సందర్భంగా రంగనాయకుల స్వామి ఆలయానికి వెళ్లి మంత్రి నారాయణ పారిశుద్ధ్యం సరిగా లేకపోవడం పట్ల అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆలయంలో భక్తులకు కనీస ఏర్పాట్లను కూడా చేయకపోవడంతో అధికారులను మందలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఈ ఆలయానికి భక్తులు వివిధ ప్రాంతాల నుంచి వస్తారని, వారికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు ముందుస్తు జాగ్రత్తలు తీసుకోకుండా నిర్లక్ష్యం వహించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. భక్తులకు అవసరమైన అన్ని ఏర్పాట్లను అధికారులు యుద్ద ప్రాతిపదికన ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

గిరిజనులమని చిన్నచూపు
నెల్లూరు, జనవరి 8: ‘గిరిజనులమని, యానాదులమని చిన్నచూపు పనికిరాదు, 14 మంది నిరుపేద యానాదులు మరణిస్తే కనీసం పరామర్శకు కూడా నోచుకోలేని వారమా? మరో కులంలో ఇదే సంఘటన జరిగి ఉంటే ప్రభుత్వం ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించగలదా?’ అంటూ యానాది సమాఖ్య నాయకులు నిరసన వ్యక్తం చేస్తూ నగరంలోని విఆర్ కళాశాల కూడలిలో ఆదివారం రాస్తారోకో చేపట్టారు. బాణసంచా పేలుడు ఘటనలో శనివారం అర్ధరాత్రి మరణించిన తిరువీథి చెంచయ్య మృతదేహాన్ని నడిరోడ్డుపై ఉంచి ప్రభుత్వానికి, పాలకులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా రాష్ట్ర యానాది సమాఖ్య నాయకులు మాట్లాడుతూ డిసెంబర్ 31న జరిగిన దుర్ఘటనలో 14 మంది గిరిజనులు మృతి చెందారని, మరో ఇద్దరు ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సంఘటనలో చనిపోయిన వారికి చట్టప్రకారం ఇచ్చే పరిహారంతో పాటు మరో రూ.10 లక్షలు అదనంగా ఇవ్వాలని, కుటుంబ సభ్యుల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. గత ఎన్నో ఏళ్లుగా బాణసంచా తయారీ వంటి ప్రమాదకర వృత్తిలో జీవిస్తున్న యానాదులకు ఎస్టీ సబ్‌ప్లాన్ ద్వారా జీవనోపాధి మార్గాలను చూపాలని కోరారు. నిందితులపై మరింత కఠిన చర్యలు తీసుకొని ఎస్సీ, ఎస్టీ చట్టం కింద కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. పొన్నూరు భాస్కర్ చేత తానే యజమానినని తప్పుడు సాక్ష్యం చెప్పించిన యజమానిపై చర్యలు తీసుకోవాలన్నారు. ఇంత ఘోరం సంభవించినా ప్రభుత్వం నుంచి ఎస్సీ, ఎస్టీ, సాంఘిక సంక్షేమ మంత్రి రావెల కిషోర్‌బాబు బాధిత కుటుంబాలను ఎందుకు పరామర్శించడానికి రాలేదో చెప్పాలని నిలదీశారు. కేంద్ర ప్రభుత్వం యానాదులను అత్యంత వెనుకబడిన ప్రత్యేక గిరిజన తెగగా గుర్తించాలని డిమాండ్ చేశారు. తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ సంఘటన జరిగిన పొర్లుకట్ట ప్రాంతంలో నిరవధిక దీక్షలకు దిగుతున్నట్లు వారు తెలిపారు. ప్రభుత్వం నుంచి స్పందన రానిపక్షంలో నిరవధిక దీక్షలు ఆమరణ నిరాహారదీక్షలుగా మారతాయని వారు హెచ్చరించారు. నడిరోడ్డుపై వారు ధర్నాకు దిగడంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దాదాపు కిలోమీటర్ మేర వాహనాలు నిలిచిపోయాయి. నగర డిఎస్పీ జివి రాముడు సంఘటనా స్థలానికి చేరుకొని యానాది సమాఖ్య నాయకులకు నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. దుర్ఘటన కారకులపై ఇప్పటికే తగిన చర్యలు తీసుకోవడం జరిగిందని, బాధితుల డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళతామని హామీనివ్వడంతో వారు శాంతించారు.