శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

క్రీడలకు ప్రభుత్వ ప్రోత్సాహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోట, జనవరి 20: రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు ప్రత్యేక స్థానం కల్పించి క్రీడాకారులకు మంచి ప్రోత్సాహన్ని ఇస్తుందని రాష్ట్ర బిసి సంక్షేమశాఖ మంత్రి కొల్లు రవీంద్ర వెల్లడించారు. స్థానిక బిసి గురుకుల పాఠశాలలో మూడు రోజులపాటు జరిగిన రాష్టస్థ్రాయి క్రీడాపోటీలు శుక్రవారంతో ముగిసాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ముగింపు సభకు మంత్రి ముఖ్యఅతిధిగా పాల్గొన్నారు. సభలో మంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు క్రీడల పట్ల ఆసక్తి చూపుతున్నారన్నారు. రాష్ట్రంలో క్రీడా అకాడమీలు, శిక్షణా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. యువత క్రీడలపట్ల ఆసక్తి చూపినట్లయితే సృజనాత్మకత, శారీరక దారుడ్యం, మానసిక ప్రశాంతత ఏర్పడుతుందన్నారు. కోట బిసి గురుకుల పాఠశాలను కళాశాలగా మార్చాలని గూడూరు శాసనసభ్యులు పాశం సునీల్‌కుమార్ మంత్రిని కోరడంతో పాఠశాలను కళాశాలగా మార్చేందుకు కృషిచేస్తానని, దీనికి సంబంధించిన ప్రతిపాదనను ప్రభుత్వానికి పంపుతానని మంత్రి సభలో హామీ ఇచ్చారు. అనంతరం క్రీడాపోటీల్లో గెలుపొందిన క్రీడాకారులకు మంత్రి బహుమతులు అందజేశారు. ముగింపు సభలో ఎమ్మెల్సీ, టిడిపి జిల్లా అధ్యక్షులు బీదా రవిచంద్రా, గూడూరు శాసనసభ్యులు పాశం సునీల్‌కుమార్, పెంచలకోన నరసింహస్వామి ఆలయ ట్రస్టుబోర్డు చైర్మన్ తానంకి నానాజీ, డిసిసిబి ఉపాధ్యక్షులు నల్లపరెడ్డి జగన్మోహన్‌రెడ్డి, మాజీ మంత్రి పరసారత్నం, కోట, చిట్టమూరు జట్‌పిటిసిలు ఉప్పల ప్రసాద్‌గౌడ్, భారతిరెడ్డి, ఎంపిపి నల్లపరెడ్డి వినోద్‌రెడ్డి, సర్పంచ్ కె రాఘవయ్య, తెలుగురైతు జిల్లా ఉపాధ్యక్షులు మోహన్‌రెడ్డి, టిడిపి జిల్లా ఉపాధ్యక్షులు కె రమేష్, గూడూరు ఏరియా వైద్యశాల కమిటి చైర్మన్ డాక్టర్ బి జోత్స్నలత, టిడిపి మండల అధ్యక్షులు పాదర్తి కోటేశ్వరరెడ్డి, పలగాటి భాస్కర్‌రెడ్డి, మనోజ్‌రెడ్డి, పురుషోత్తమ్‌రెడ్డి, మర్రి పోలయ్య, యం గున్నయ్య, బిసి గురుకులాల రాష్ట్ర కార్యదర్శి రామక్రిష్ణ, బిసి గురుకులాల జిల్లా కన్వీనర్ ఎస్ మహబూబ్‌బాషా తదితరులు పాల్గొన్నారు.
మంత్రికి ఘన స్వాగతం
కోట బిసి గురుకుల పాఠశాలలో మూడురోజుల పాటు జరిగిన రాష్టస్థ్రాయి క్రీడా పోటీల ముగింపు కార్యక్రమానికి హాజరైన రాష్ట్ర బిసి సంక్షేమశాఖ మంత్రి కొల్లు రవీంద్రకు ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రిని గజపూలమాలలతో సత్కరించారు. శాలువాలు కప్పి సన్మానించారు.
అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు
బిసి గురుకుల పాఠశాలలో రాష్ట్ర స్థాయి క్రీడల ముగింపు సందర్భంగా పలు పాఠశాలల విద్యార్థినులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఇందులో భాగంగా దేశభక్తి గేయాలకు చేసిన నృత్య ప్రదర్శనలు చూపరులకు కనువిందు చేశాయి.

సాగునీటి కోసం రైతుల మధ్య విభేదాలు
పెళ్లకూరు, జనవరి 20: మండల పరిధిలోని రావులపాడు, పునబాక గ్రామాల మధ్య శుక్రవారం సాగునీటి సరఫరా విషయమై ఘర్షణ చోటుచేసుకొంది. శ్రీకాళహస్తి ఇరిగేషన్ అధికారులు అక్కడి స్వర్ణముఖి నది నుండి సాగునీటిని స్వర్ణముఖి సిస్టమ్ ద్వారా ఈ ప్రాంత చెరువులకు వంతుల వారీగా సరఫరా చేస్తున్నారు. దీంతో రైతులు చెరువు ఆధారిత నీటి ద్వారా పంటలను సాగుచేస్తున్నారు. ఇరిగేషన్ అధికారుల నిర్లక్ష్య వైఖరి కారణంగా ఇక్కడ రైతుల మధ్య ఘర్షణలు జరుగుతున్నాయి. శుక్రవారం నుండి రావులపాడు చెరువుకు సాగునీరు వదలాల్సి ఉండగా పునబాక గ్రామ రైతులు దౌర్జన్యంగా తమ చెరువుకు సాగునీటిని మళ్లించారు. విషయం తెలుసుకొన్న రావులపాడు గ్రామ రైతులు నెలబల్లి వద్దనున్న సాగునీటి కాలువ వద్దకు వెళ్లి సాగునీటి సరఫరాను అడ్డుకున్నారు. దీంతో ఇరుగ్రామాల రైతుల మధ్య వాదోపవాదాలు చోటు చేసుకొని ఘర్షణ వాతావరణం నెలకొంది. అనంతరం ఇరు గ్రామాల పెద్దలు జోక్యం చేసుకొని పరిస్థితిని చక్కదిద్దారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు కెవి నాయుడు, బాలరాజు నాయుడు, మాతయ్య, పురంధర్ రెడ్డి, హరినాయుడు పాల్గొన్నారు.