శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

అంబరాన క్రీడా సంబరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు, జనవరి 20: భాషలు వేరైనా భావం మాత్రం ఒకటే.. క్రీడాకారులు ఎక్కడివారైనా క్రీడాస్ఫూర్తి మాత్రం ఒకటే.. ఆట, అలసట, ఆరాటం అన్నీ గెలుపు కోసమే.. ఇదే భావనతో దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన చిన్నారి క్రీడాకారులు తమ క్రీడా ప్రతిభను నగరంలోని ఏసి సుబ్బారెడ్డి స్టేడియంలో జరుగుతున్న ‘ఖేలో ఇండియా’ క్రీడాపోటీల్లో ప్రదర్శిస్తున్నారు. నగరవాసులు సైతం ఆడేది ఇతర ప్రాంతాల వారైనా ఆటని ఆస్వాదిస్తూ బాగా ఆడుతున్న క్రీడాకారులను ఈలలు, కేకలతో ప్రోత్సహిస్తూ నెల్లూరీయుల ఆతిథ్యంతో ఇతర రాష్ట్రాలకు చెందిన క్రీడాకారులను మైమరపిస్తుండడం విశేషం. 15 రాష్ట్రాలకు చెందిన సుమారు 750 మంది క్రీడాకారులు ఈ పోటీలకు హాజరయ్యారు. అండర్-14 విభాగంలో జరుగుతున్న కబడ్డీ, ఖోఖో, ఉషు క్రీడల్లో బాలుర, బాలికల వ్యత్యాసం లేకుండా అన్ని పోటీలను తిలకించేందుకు ప్రజలు ఆసక్తి కనబరుస్తున్నారు. అయితే సొంత రాష్టమ్రైన ఆంధ్రప్రదేశ్ జట్లు పోటీలో ఉన్న మ్యాచ్‌ల వద్ద జనసమూహం కాస్త ఎక్కువగా కనిపిస్తోంది. తమ రాష్ట్రాలకు చెందిన జట్లు పోటీలో ఉన్న సమయంలో అదే రాష్ట్రానికి చెందిన ఇతర జట్ల క్రీడాకారులు అక్కడ ఉండి తమ వారిని ప్రోత్సహిస్తున్నారు.
నెల్లూరుకు పరిచయమైన ‘ఉషు’
క్రీడలతో పరిచయమున్న వారిలోనూ చాలా మందికి తెలియని క్రీడ ఇది. ముఖ్యంగా నెల్లూరు జిల్లాలో ఏ కొద్ది మంది వ్యాయామ ఉపాధ్యాయులు, శిక్షకులకు కూడా ఈ క్రీడ పరిచయమే తప్ప అందులో నియమ నిబంధనలపై అవగాహన లేదు. ‘ఉషు’ అనే పదం మాండోరిన్ భాష నుంచి వచ్చింది. ఉ అంటే.. రణం (యుద్ధం), షు అంటే.. కళ (విద్య) అని అర్థం. యుద్ధకళల్లో ఒకటిగా దీన్ని భారతదేశానికి చెందిన బోధిసత్తుడు ప్రపంచానికి ముఖ్యంగా గౌతమబుద్ధుని ఆరాధించే ప్రాంతాలకు పరిచయం చేసినట్లు తెలుస్తోంది. శుక్రవారం ఉదయం నుంచి ఏసి సుబ్బారెడ్డి ఇండోర్ స్టేడియంలో ఈ ఉషు క్రీడాపోటీలు ప్రారంభమయ్యాయి. మణిపూర్ జట్లు ఈ క్రీడలో ప్రతిభ కనబరుస్తుండగా, వారికి పోటీగా గుజరాత్, ఆంధ్రప్రదేశ్ జట్లు గట్టిపోటీని ఇస్తుండడం విశేషం.
నేడు సెమీఫైనల్ పోటీలు
‘ఖేలో ఇండియా’ క్రీడాపోటీలు శనివారం సాయంత్రానికి చివరి అంకానికి చేరువవుతాయి. శనివారం జట్ల మధ్య సెమీఫైనల్ పోటీలు పూర్తి చేసి గెలుపొందిన జట్లు ఆదివారం ఉదయం జరిగే ఫైనల్ ఫోటీలో తలపడనున్నట్లు పోటీల నిర్వాహక అధికారులు తెలిపారు. శుక్రవారం పోటీలను శాఫ్ సభ్యులు రవీంద్రబాబు, ఇతర శాఫ్, జిల్లా అధికారులు పర్యవేక్షించారు.