శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

రికార్డు ప్రయోగానికి ఇస్రో సిద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూళ్లూరుపేట, ఫిబ్రవరి 4: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో రికార్డు ప్రయోగానికి సన్నద్ధమయ్యింది. ఇప్పటికే వరుస విజయయాలతో దూసుకుపోతూ సాంకేతికపరంగా ముందున్న దేశాలు చేయని ప్రయత్నాన్ని మన శాస్తవ్రేత్తలు చేస్తున్నారు. ఈనెల 15న పిఎస్‌ఎల్‌వి-సి 37 వాహక నౌక ద్వారా ఒకేసారి 104 ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపనున్నారు. ఈ రాకెట్‌లో పంపించే ఐఎన్‌ఎస్-1ఎ, ఐఎన్‌ఎస్-1బి రెండు నానో ఉపగ్రహాలు బెంగుళూరులోని ఉపగ్రహ తయారీ కేంద్రం నుండి శనివారం తెల్లవారుజామున అత్యంత భారీ భద్రత నడుమ రోడ్డు మార్గాన షార్‌కు చేరాయి. ఇప్పటికే విదేశీ ఉపగ్రహాలతోపాటు మన దేశానికి చెందిన ప్రధాన ఉపగ్రహం కార్టోశాట్-2డి ఉపగ్రహం షార్‌కు చేరాయి. ఈ ఉపగ్రహాలను క్లీన్‌రూమ్‌లో పెట్టి శాస్తవ్రేత్తలు తుది పరీక్షలు కూడా నిర్వహించారు. షార్‌లోని మొదటి ప్రయోగ వేదికపై రాకెట్ నాలుగు దశల అనుసంధాన పనులను శనివారానికి శాస్తవ్రేత్తలు పూర్తిచేశారు. ఇకపై ఉపగ్రహాలకు గ్లోబల్ పరీక్షలు అనంతరం రాకెట్ చివరి భాగంలో అమర్చి ప్రయోగానికి సిద్ధం చేస్తారు. ప్రయోగానికి సంబంధించిన మిషన్ రెడీనెష్ రివ్యూ సమావేశం ఈనెల 12న షార్‌లో జరగనుంది. ఈ సమావేశంలో చర్చించినంతరం ఇస్రో అధికారికంగా ప్రయోగ వివరాలు వెల్లడించనుంది. ప్రయోగం దృష్ట్యా షార్‌కు మన శాస్తవ్రేత్తలతో పాటు విదేశీ శాస్తవ్రేత్తలు చేరుకోవడంతో సందడి వాతావరణం నెలకొనింది.
ఉపగ్రహాల వివరాలు
ఈ రాకెట్ ద్వారా 101 విదేశీ ఉపగ్రహాలతోపాటు మన దేశానికి చెందిన 730 కిలోల బరువుగల కార్టోశాట్-2డి ప్రధాన ఉపగ్రహం, 20 కిలోల బరువు ఐఎన్‌ఎస్-1ఎ, ఐఎన్ ఎస్-1బి నానో ఉపగ్రహాలు కక్ష్యలోకి ప్రవేశపెట్టనున్నారు. ఇందులో అమెరికా, ఇజ్రాయిల్, కజికిస్తాన్, నెదర్లాండ్, స్విట్జర్లాండ్ దేశాలతోపాటు మరో దేశం ముందుకు రావడంతో మొత్తం ఆరు దేశాలకు చెందిన 101 ఉపగ్రహాలను పంపేందుకు ఇస్రో ఒప్పందం కుదుర్చుకుంది.
90 నిమిషాలు ప్రయోగం
మునుపెన్నడు లేని విధంగా ఇస్రో ఈ ప్రయోగాన్ని 1:30 గంటపాటు అనగా 90 నిమిషాలు జరపనుంది. 104 ఉపగ్రహాలు ఉన్నందున ఇస్రో ఈ నిర్ణయం తీసుకొంది. ఇంతకుముందు మామ్ ప్రయోగంలో ఇదే విధంగా 2 గంటలు రాకెట్ ప్రయాణం సాగింది. రాకెట్ భూమి నుండి నింగిలోకి ఎగిరినంతరం భూమికి 500 కిమీ దూరంలో ప్రధాన ఉపగ్రహం కార్టోశాట్‌ను విడవనుంది. అనంతరం అక్కడ నుండి 630 కిమీ దూరం పోయేసరికి మిగిలిన 101 ఉపగ్రహాలను నిర్ణీత కక్ష్యలోకి చేరే విధంగా శాస్తవ్రేత్తలు రూపొందించారు. ఎక్కువ ఉపగ్రహాలు ఉన్నందున శాస్తవ్రేత్తలు ఒక్కొక్క బాక్స్‌లో 25 ఉపగ్రహాలు పెట్టి మొత్తం నాలుగు పెట్టెల్లో అమర్చి ఒకదాని తరువాత ఒకటి విడిపోయే విధంగా జాగ్రత్తలు తీసుకొన్నారు. ఇది మొత్తం జరగడానికి 90 నిమిషాలు సమయం పడుతుంది. ఎంతో ప్రతిష్టాత్మంగా తీసుకొని ప్రయోగిస్తున్న ఈ ప్రయోగాన్ని ప్రపంచ దేశాలు సైతం షార్ వైపు చూస్తున్నాయి. అన్నీ సజావుగా సాగి వాతావరణం అనుకూలిస్తే ఈనెల 15న షార్‌లోని మొదటి ప్రయోగ వేదిక నుండి 104 ఉపగ్రహాల ప్రయోగం జరగనుంది. ప్రయోగానికి సంబంధించిన కౌంట్‌డౌన్ 48 గంటలు ముందు ప్రారంభించేందుకు సన్నాహం చేస్తున్నారు.