శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

చేజర్లలో స్వల్ప భూకంపం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చేజర్ల, ఫిబ్రవరి 4: మండలంలోని పలు గ్రామాల్లో శనివారం ఉదయం 11 గంటల సమయంలో స్వల్పంగా భూమి కంపించింది. మండలంలోని చిత్తలూరు, ఆదురుపల్లి, చీర్లవారికండ్రిగ గ్రామాల్లో ఉదయం 11.21, మధ్యాహ్నం 3.23 గంటలకు భూమి కంపించినట్లు ఆయా గ్రామాల ప్రజలు పేర్కొన్నారు. పెద్ద శబ్దాలతో సహా భూమి కుదుపునిచ్చినట్లు చెప్పారు. దీంతో ఆగి ఉన్న ఫ్యాన్లు వాటికవే అటూ ఇటుగా ఊగడంతో సహా అల్మర్లాలోని వస్తువులు కింద పడినట్లు ఆయా గ్రామాల ప్రజలు తెలిపారు.

చెంగాళమ్మ ఆలయంలో 7 నుండి కోటి కుంకుమార్చన
ఏర్పాట్లను పరిశీలించిన చైర్మన్
సూళ్లూరుపేట, ఫిబ్రవరి 4: తెలుగు, తమిళ భక్తుల ఆరాధ్య దైవమైన చెంగాళమ్మ ఆలయంలో ఈనెల 7వ తేదీ నుండి మహాకుంభాభిషేక వేడుకలు, కోటి కుంకుమార్చన కార్యక్రమాలు వైభవంగా జరుగుతాయని ఆలయ ట్రస్టుబోర్డు చైర్మన్ ముప్పాళ్ల వెంకటేశ్వరరెడ్డి, ఈవో ఆళ్ల శ్రీనివాసులురెడ్డి తెలిపారు. ఆలయం ఎదురుగా ఉన్న ఖాళీ స్థలంలో ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి. ఈ పనులను శనివారం పాలకమండలి వారు పరిశీలించి ఏర్పాట్లు తదితర వాటిని అడిగి తెలుసుకొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 7 నుండి 15వ తేదీ వరకు ఎంతో వైభవంగా ఈ వేడుకలు జరుగుతాయన్నారు. రాష్ట్రం నలుమూలల నుండి 150 మంది వేదపండితులను తీసుకొచ్చి ప్రత్యేక యాగాలు చేస్తామన్నారు. భక్తులందరూ విచ్చేసి కార్యక్రమాలను విజయవంతం చేయాలన్నారు. కోటి కుంకుమార్చనలో పాల్గొనే దంపతులు ముందుగా తమ పేర్లను ఆలయం వద్ద నమోదు చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో పాలకమండలి సభ్యులు చిట్టేటి పెరుమాల్, శ్రీనివాసులురెడ్డి తదితరులు పాల్గొన్నారు.

వైఎస్‌ఆర్ నగర్‌ను నివాసయోగ్యంగా తీర్చిదిద్దుతాం
మంత్రి నారాయణ వెల్లడి
నెల్లూరు రూరల్, ఫిబ్రవరి 4: నగర పరిధిలోని వైఎస్‌ఆర్ నగర్, రాజీవ్ స్వగృహ ప్రాంతాలను నివాసయోగ్యంగా తీర్చిదిద్దుతామని పురపాలక శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. శనివారం కొత్తూరులోని వైఎస్‌ఆర్‌నగర్, రాజీవ్ స్వగృహ ప్రాంతాల్లో మంత్రి పర్యటించారు. ఈ సందర్భంగా స్థానికులు తమ సమస్యలను తెలియజేశారు. అనంతరం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ, వందల కోట్ల రూపాయలతో వైఎస్‌ఆర్‌నగర్‌లో ఆరువేల పైచిలుకు ఇళ్లు నిర్మించారని, వాటిలో చాలావరకు నాశిరకంగా ఉన్నాయని, ఒక్కో లబ్ధిదారుడికి రెండేసి ఇళ్లు కూడా ఇచ్చారని తెలిపారు. సుమారు 15 వందల ఇళ్లల్లో కాపురాలు ఉంటున్నారని, 11 వందల ఇళ్లు కూలడానికి సిద్ధంగా ఉన్నాయని కమిటీ నివేదిక ఇచ్చినట్లు ఆయన తెలిపారు. నెల రోజుల్లో వైఎస్‌ఆర్ కాలనీ, రాజీవ్ స్వగృహ ప్రాంతాల్లో వౌలిక వసతులు కల్పించడానికి అధికారులకు ఇప్పటికే ఆదేశాలు ఇచ్చామని ఆయన పేర్కొన్నారు. రెండేసి ఇళ్లు పొందినవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని, అదేవిధంగా అర్హులైన పేదవారికి ఈ ప్రాంతంలో ఇళ్లు ఇస్తామని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి ఆదాల ప్రభాకర్‌రెడ్డి, నగర మేయర్ అబ్దుల్ అజీజ్, పలువురు కార్పొరేటర్లు, నాయకులు, అధికారులు పాల్గొన్నారు.