శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

బిసిలను మోసం చేస్తున్న ప్రభుత్వాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వెంకటాచలం, ఫిబ్రవరి 14 : ప్రభుత్వాలు బీసిలను అణవేసేందుకే బీసిలకు వ్యతిరేకంగా మంజునాథ కమిషన్ వేశాయని బీసి సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేసన శంకర్‌రావు విమర్శించాచారు. వెంకటాచలంలో మంగళవారం ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ మంజునాథ కమిషన్‌ను అన్నిచోట్ల వ్యతిరేకిస్తామని హెచ్చరించారు. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో బీసి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సభలు నిర్వహించి బీసిల ఐక్యతను చాటుతామన్నారు. ఎన్నికల సమయంలో బీసిల ఓట్లు వేయించుకుని అధికారాన్ని దక్కించుకుని తరువాత బీసిలను అన్యాయం చేయాలని చూస్తే భవిషత్తులో తీవ్ర పరిణామాలు ఉంటాయని ఆయన హెచ్చరించారు. అవసరమైతే 2019 ఎన్నికల్లో బీసిలోని అన్ని కులాలను కలుపుకుని పార్టీ పెట్టేందుకు కూడా తాము సిద్ధమన్నారు. తమకు ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు సైతం మద్దతు తెలుపుతున్నారని తమ సత్తా అప్పుడు చూపుతామని ఆయన హెచ్చరించారు. ఎన్నికల ముందు బీసిలకు ఇచ్చిన హామీలను ఇప్పటివరకు నెరవేర్చలేదని, దీంతో బీసిలు తీవ్ర అన్యాయానికి గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బీసిలను అణచివేసేందుకు అనేక కుట్రలు చేస్తున్నాయని విమర్శించారు. బీసి జనాభా గణనకు ఉద్యమిస్తామని ఆయన పేర్కొన్నారు. దేశంలో ఉన్న 125 కోట్ల జనాభాను కులాలవారిగా జన గణనకు ప్రభుత్వాలు ప్రత్యేక చొరవ తీసుకోవాలన్నారు. 1931లో చివరిసారిగా జరిగిందని, అప్పటి నుంచి ఎన్నిసార్లు డిమాండ్ చేసినా ప్రభుత్వాలు పట్టించుకోవటం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కాపులను బీసిల్లో చేర్చేందుకు చంద్రబాబునాయుడు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడంపై ఆయన మండిపడ్డారు. 50 శాతం ఉన్న బీసిలను విస్మరించి 6 శాతం ఉన్న కాపులను బీసిల్లో కలిపేందుకు చంద్రబాబు ఉత్సాహం చూపడం బీసిలకు అన్యాయం చేయడమేనన్నారు. స్వాతంత్య్రం రాకముందు నుంచి బీసిలలో వెనుకబడిన కులాల జీవనశైలిలో ఇప్పటి వరకు ఎలాంటి మార్పు రాలేదన్నారు. ఇప్పటికే బీసిలలో వెనుకబడిన కులాలు ఎస్టీల్లో చేర్చాలనే డిమాండ్‌ను పక్కనపెట్టి కాపులను బీసిలలో చేర్చితే ప్రభుత్వాలు బీసి కులాల ఆగ్రహానికి గురికావడం ఖాయమని ఆయన హెచ్చరించారు. బీసిలను చంద్రబాబునాయుడు అణచి వేసేందుకు కుట్రలు పన్నుతున్నారని ఆయన ఆరోపించారు. బీసిలపై ప్రభుత్వాలు అనుసరిస్తున్న నిరంకుశ వైఖరి మారకుంటే చంద్రబాబునాయుడుకు చరమగీతం పాడటం ఖాయమన్నారు. విజయవాడలో జరిగే మంజునాథ కమిషన్ ఎదుట తమ నిరసన తెలుపుతామన్నారు. తక్షణం బీసిల గణన చేపట్టి బీసి జనాభా తేల్చాలని ఆయన కోరారు. విలేఖర్ల సమావేశంలో ఆయన వెంట బీసి సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధానకార్యదర్శి అందిరేకుల అదిశేషు పాల్గొన్నారు.