శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

వాకాటి పేరు ఖరారు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు, ఫిబ్రవరి 18: త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ప్రస్తుత ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డి పేరు ఖరారైనట్లు విశ్వసనీయ సమాచారం. శుక్రవారం విజయవాడలో జరిగిన పార్టీ వర్క్‌షాప్‌లో ఈ మేరకు పార్టీ అధినేత చంద్రబాబునాయుడు సూచనప్రాయంగా వెల్లడించినట్లు తెలిసింది. దీంతో ఈ స్థానంపై కొందరు నేతలు పెట్టుకున్న ఆశలపై నీళ్లు చల్లినట్లయింది. టిడిపి కచ్చితంగా గెలిచే అవకాశం ఉన్న ఈ స్థానం నుంచి ఎమ్మెల్సీగా పోటీ చేసేందుకు పలువురు నేతలు చంద్రబాబుకు విన్నవించుకోవడం జరిగింది. వారిలో ప్రముఖంగా ‘ఆనం’ సోదరులు వివేకానందరెడ్డి, రామనారాయణరెడ్డిలతో పాటు మాజీ మంత్రి ఆదాల ప్రభాకర్‌రెడ్డి కూడా ఉన్నారు. అయితే ఎన్నికల తర్వాత కాంగ్రెస్ నుంచి టిడిపిలో చేరిన తొలి ఎమ్మెల్సీగా వాకాటికి చంద్రబాబునాయుడి వద్ద మంచి పేరే ఉంది. ఇదే సమయంలో చంద్రబాబుతోపాటు ఆయన కుమారుడు పార్టీ జాతీయ ప్రధానకార్యదర్శి నారా లోకేష్‌తోనూ వాకాటి సత్సంబంధాలు నెరపుతూ, పార్టీ మారే సమయంలో అధినేత తనకిచ్చిన హామీని తరచూ గుర్తు చేస్తూ వచ్చారు. జిల్లాలో బలమైన వర్గానికి చెందిన వ్యక్తులు కూడా ఇదే ఎమ్మెల్సీ స్థానాన్ని కోరుతుండడంతో వాకాటికి గట్టి పోటీ ఎదురైంది. అయితే పార్టీ కార్యక్రమాల్లో తప్పనిసరిగా పాల్గొంటూ వ్యాపారాల కంటే పార్టీ పనులకే ఎక్కువ సమయం కేటాయిస్తూ పార్టీ అధిష్టానం దృష్టిలో పడేందుకు వాకాటి చేయని ప్రయత్నమంటూ లేదు. చివరకు పార్టీలో అతి తక్కువ సమయంలో చురుకైన నేతగా ఎదగగలిగి ఎమ్మెల్సీ స్థానం నుంచి పోటీ చేసే అవకాశం రెండోసారి అందిపుచ్చుకోగలిగారు.
నేడో, రేపో ప్రకటన
జిల్లాలోని స్థానిక సంస్థల టిడిపి ఎమ్మెల్సీ అభ్యర్థిగా వాకాటి నారాయణరెడ్డి పేరు నేడో, రేపో పార్టీ అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. జిల్లాకు చెందిన ఓ నేత ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. వాకాటికే అవకాశమని తేలడంతో ఇక పార్టీ నుంచి అధికారిక ప్రకటన వెలువడమే తరువాయిగా మారిందని సదరు నేత వ్యాఖ్యానించారు. టిడిపి కచ్చితంగా గెలిచే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే జిల్లాలో పార్టీల్లోకి వలసలు పూర్తయిన తర్వాత రెండు ప్రధాన పార్టీల మధ్య స్పష్టమైన తేడా కనిపిస్తోంది. టిడిపికి 151 ఓట్ల మెజార్టీ ప్రస్తుతం ఉంది. ఇదిలావుండగా ఈ ఎన్నికల్లో పోటీ చేయాలని వైకాపా అధినేత జగన్ నిర్ణయించడంతో వాకాటిపై పోటీ అభ్యర్థిగా ప్రముఖ పారిశ్రామికవేత్త, జగన్ సన్నిహితుడు చేవూరు బాలకృష్ణారెడ్డి, పెళ్లకూరు ఎంపిపి కామిరెడ్డి సత్యనారాయణరెడ్డిని రంగంలోకి దించాలని ఆ పార్టీ భావిస్తోంది. వామపక్ష, కాంగ్రెస్, స్వతంత్రుల ఓట్లు పొందడం ద్వారా గెలుపొందాలనే ఆలోచనలో వైకాపా ఉంది.

అక్షరాస్యత 99 శాతానికి చేరేలా ప్రణాళిక
* కలెక్టర్ ఆర్.ముత్యాలరాజు వెల్లడి
నెల్లూరు, ఫిబ్రవరి 18: జిల్లాలో అక్షరాస్యత 2018లోగా 99 శాతానికి చేరుకునేలా పక్కా ప్రణాళికలు సిద్ధం చేసుకొని లక్ష్యాన్ని సాధించాలని జిల్లా కలెక్టర్ ఆర్.ముత్యాలరాజు అధికారులకు సూచించారు. శనివారం స్థానిక గోల్డెన్‌జూబ్లీ హాల్లో వయోజన విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన మండల కో ఆర్డినేటర్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ 7వ సాక్షరతా భారత్ కార్యక్రమం ద్వారా అందరికి విద్యనందించాలన్నది ముఖ్య ఉద్దేశ్యమని చెప్పారు. ప్రతి మండల కో ఆర్డినేటర్ అన్ని శాఖలను సమన్వయపరచుకొని సమావేశాలు, అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి సంబంధిత మినిట్స్‌ను అందించాలని ఆదేశించారు. దత్తత తీసుకున్న గ్రామాల్లో విధిగా ప్రతి కో ఆర్డినేటర్ రాత్రి బస చేయాలని సూచించారు. మార్చి 31నాటికి ఆత్మగౌరవం కార్యక్రమం పూర్తవుతుందని, ఏప్రిల్ 1 నుండి అక్షరాస్యత కార్యక్రమంపై మరింత దృష్టి సారించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వయోజన విద్య ఉప సంచాలకులు నారాయణమ్మ, డిఆర్‌డిఏ పీడి లావణ్యవేణి, డ్వామా పీడి హరిత, ఆర్‌విఎం పీడి కనకనరసారెడ్డి, డిఇఓ మువ్వా రామలింగం, సెట్నెల్ సిఇఓ సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా సుదర్శన మహాయజ్ఞం
సూళ్లూరుపేట, ఫిబ్రవరి 18: సూళ్లూరుపేటలోని మున్సిపాలిటీ కార్యాలయం వెనుకనున్న బాలాంజనేయస్వామి ఆలయంలో శనివారం సుదర్శన మహాయజ్ఞం వైభవంగా నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలోని స్వామివారి ఉత్సవ విగ్రహాలను ఆలయం చుట్టు ప్రదర్శనగా యాగశాల మండపానికి తీసుకొచ్చి వేదపండితులు మంత్రోచ్ఛరణల నడుమ యాగాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ నిర్వాహకులు అయితా శ్రీ్ధర్, అర్చకులు దీవి లక్ష్మీనారాయణ తదిరతులు పాల్గొన్నారు.