శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

అదే ఉత్కంఠ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు, ఫిబ్రవరి 26: స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికలో రెండు ప్రధాన రాజకీయ పార్టీలు పాటిస్తున్న గోప్యత జిల్లావాసుల్లో ఉత్కంఠ పెంచుతోంది. అమావాస్యపోయినా అభ్యర్థి పేరు మాత్రం ఖరారు కాలేదు. అభ్యర్థి పేరు ప్రకటించేందుకు అమావాస్యకు ఉన్న లింకేంటనే సందేహం ఉండొచ్చు. తెలుగువారు అమావాస్య ఘడియల్లో ఏదైనా ముఖ్యకార్యక్రమాన్ని చేపట్టాల్సి వస్తే కచ్చితంగా వాయిదా వేస్తుంటారు. అభ్యర్థిని ఎపుడో ఖరారు చేసిన వైకాపా.. ఇంతవరకు అధికారిక ప్రకటన మాత్రం చేయలేదు. టిడిపి అభ్యర్థి ప్రకటనతో వారికి సంబంధం లేకున్నా, ఎందుకనో జిల్లా నేతలు వౌనముద్రలో ఉన్నారు. టిడిపిలో అభ్యర్థి ఎవరైనప్పటికి వైకాపా అభ్యర్థి ఆనం విజయకుమార్‌రెడ్డేనని వైకాపా నేతలే చెబుతున్నప్పటికి టిడిపి అభ్యర్థి ప్రకటన కోసం వారెందుకు ఎదురుచూస్తున్నారో అర్ధం కాలేదు. తీరా ఆలోచిస్తే.. ఆదివారం అమావాస్య ఉన్నందున, అమావాస్య ఘడియలు వెళ్లాక అభ్యర్థిని ప్రకటిస్తారనే వార్తలు నగరంలో గుప్పుమన్నాయి. సోమవారం పార్టీ కార్యాలయంలో అభ్యర్థిని ప్రకటించి, అదేరోజు నామినేషన్ వేసేందుకు ఆ పార్టీ నేతలు నిశ్చయించుకున్నట్లు తెలిసింది.
ముందు వరుసలోకి వచ్చిన ఆదాల
ఇక టిడిపి విషయానికొస్తే ఈ ఎమ్మెల్సీ ఎన్నికలనే ఒక ఉత్కంఠ కలిగించే కార్యక్రమంగా మార్చేసింది. నాలుగు రోజుల కిందట వాకాటి నారాయణరెడ్డి పేరును జిల్లా నేతల వద్ద ప్రస్తావించి, అన్ని ఏర్పాట్లు చేసుకోమన్న టిడిపి అధినేత చంద్రబాబునాయుడు ప్రస్తుతం మరో ఆలోచన చేస్తున్నట్లు తెలిసింది. వైకాపా అభ్యర్థిగా ఆనం కుటుంబీకులను నిలబెట్టడమే ఈ పునరాలోచనకు కారణంగా తెలుస్తోంది. ఆదాల ప్రభాకర్‌రెడ్డి ఆదివారమే నెల్లూరు చేరుకున్నారు. పార్టీ నిర్ణయమే తనకు శిరోధార్యమని, ఎంఎల్‌సి టిక్కెట్ ఇచ్చినా, ఇవ్వకపోయినా తానేమి చింతించేది లేదని ఆయన స్పష్టం చేస్తున్నారు. మరోవైపు తన పేరును పునరాలోచన చేస్తున్నారనే వార్తల నేపథ్యంలో వాకాటి హుటాహుటిన శనివారం హైదరాబాద్‌కు చేరుకున్నారు. అనంతరం పార్టీ జాతీయ ప్రధానకార్యదర్శి నారా లోకేష్‌ను కలిసి తన అభ్యిర్థిత్వాన్ని ఖరారు చేయించాలని కోరినట్లు సమాచారం. వైకాపా తరహాలోనే అమావాస్య ఘడియలు పూర్తయిన తర్వాత ఆదివారం అర్ధరాత్రి కానీ, సోమవారం ఉదయం కాని అభ్యిర్థిని ఖరారు చేసే ఆలోచనలో టిడిపి నేత ఉన్నారు. మంగళవారంతో నామినేషన్ల గడువు ముగియనుండడం, సోమవారం మంచి రోజు కావడం తదితర అంశాలను పరిగణనలోకి తీసుకొని త్వరగా అభ్యిర్థి పేరు ఖరారు చేయాలనే జిల్లా నేతలు సైతం చంద్రబాబునాయుడ్ని కోరుతున్నారు.

హరహర మహాదేవ..
* ఘనంగా ఆదిదేవుని రథోత్సవం
నెల్లూరు, ఫిబ్రవరి 26: ‘హరహర మహాదేవ, శంభో శంకరా..’ అనే భక్తఘోష నడుమ శ్రీ మూలస్థానేశ్వరస్వామి రథోత్సవం ఆదివారం అంగరంగ వైభవంగా సాగింది. తేరుపై ఆశీనులైన ఆదిదంపతుల తీరును చూస్తూ ఆధ్యాత్మిక తన్మయత్వంతో భక్తులు రథాన్ని లాగేందుకు ఉత్సాహం ప్రదర్శించారు. నెల్లూరు నగర ఎమ్మెల్యే, మూలాస్థానేశ్వరస్వామి దేవస్థాన ధర్మకర్తల మండలి చైర్మన్ ఆల్తూరు గిరీష్‌రెడ్డిలు ప్రత్యేక పూజలు నిర్వహించి, గుమ్మడికాయ కొట్టి రథోత్సవాన్ని ప్రారంభించారు. మూలాపేట వీధుల గుండా సాగిన ఈ రథోత్సవం ఆద్యంతం అశేష భక్తజన సందోహం నడుమ పాటు (యథాస్థానం)కు చేరుకొంది. మొక్కులు కోరుకునేవారు రథం కింద ఉప్పును వేస్తూ స్వామివారికి తమ మొక్కులను నివేదించుకోగా, గత ఏడాది కోరుకున్న మొక్కులు తీరిన భక్తులు ఉప్పుతోపాటు మిరియాలు వేసి స్వామివారికి భక్తిపూర్వక కృతజ్ఞతలు తెలియచేసుకున్నారు. ఈ కార్యక్రమానికి ఆల్తూరు ఆదినారాయణరెడ్డి, సులోచనమ్మ దంపతులు ఉభయకర్తలుగా వ్యవహరించారు.
పక్కాగా ముందస్తు ఏర్పాట్లు
స్వామివారి రథోత్సవ కార్యక్రమానికి మున్సిపల్, ట్రాన్స్‌కో అధికారులు ముందస్తు ఏర్పాట్లు పక్కాగా చేశారు. రథం తిరిగే ప్రధాన వీధుల్లో ఎటువంటి చెత్తచెదారం లేకుండా మున్సిపల్ అధికారులు ఏర్పాట్లు చేయగా, ట్రాన్స్‌కో సిబ్బంది రథానికి మార్గంలో అడ్డుగా ఉండే విద్యుత్ తీగలను తాత్కాలికంగా తొలగించి, రథోత్సవానంతరం తిరిగి పునరుద్ధరించారు. నగర డిఎస్పీ జివి రాముడు పర్యవేక్షణలో 1వ నగర సిఐ అబ్దుల్ కరీం నేతృత్వంలో పోలీస్ సిబ్బంది భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించారు. రథోత్సవానికి హాజరయ్యే భక్తుల కోసం మజ్జిగ, సుగంధవాటర్ చలివేంద్రాలను కొందరు భక్తులు ఏర్పాటు చేశారు. సాయంత్రం ఆలయ ప్రాంగణంలో సి.వినయ ఆధ్వర్యంలో నిర్వహించిన భక్తిపాటల కచ్చేరి భక్తులకు ఆనందాన్ని కలిగించింది. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి పోరెడ్డి శ్రీనివాసులరెడ్డి, ధర్మకర్తల మండలి సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

కాంగ్రెస్ పార్టీ తల్లిలాంటిది
ప్రజల కష్టాలను తీర్చేవాడే నిజమైన కార్యకర్త
మాజీ ఎంపి కనుమూరి బాపిరాజు స్పష్టం
నెల్లూరుసిటీ, ఫిబ్రవరి 26: కాంగ్రెస్ పార్టీ కష్టాల్లో ఎప్పుడూ లేదని నాయకులు, కార్యకర్తలకు తల్లిలాంటిదని మాజీ ఎంపి కనుమూరి బాపిరాజు అన్నారు. ఆదివారం నగరంలోని ఇందిరాభవన్‌లో జరిగిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజావ్యతిరేక విధానాలపై జరిగిన జన ఆవేదన సమ్మేళనంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీని ఇష్టపడేవారే ప్రస్తుతం ఉన్నారని అన్నారు. కాంగ్రెస్ పార్టీలో కార్యకర్తలకు కొదవలేదని, పాత నీరు పోతే కొత్త నీరు వస్తున్నట్లుగా పార్టీలోకి కార్యకర్తలు వస్తారని అన్నారు. సామాన్య కుటుంబంలో జన్మించిన నేదురుమల్లి జనార్దన్‌రెడ్డిని ముఖ్యమంత్రిని చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనని పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజావ్యతిరేక విధానాల వల్ల ప్రజలు పడుతున్న ఆవేదనను ప్రభుత్వం వద్దకు తీసుకెళ్లేందుకు ప్రతి కార్యకర్త కృషి చేయాలన్నారు. ప్రత్యేక హోదా విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలను మోసం చేశాయని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీలో ఇష్టపడే కార్యకర్తలు, నాయకులు ఉన్నారని అన్నారు. డిసిసి అధ్యక్షుడు పనబాక కృష్ణయ్య మాట్లాడుతూ పార్లమెంటు సాక్షిగా ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కల్పిస్తున్నట్లు అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్ ప్రకటించారని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక హోదా ఒక హక్కుగా ప్రతిపాదించిందన్నారు. ఎన్నికల్లో ప్రత్యేక హోదాను అమలు చేస్తామని అధికారంలోకి వచ్చిన బిజెపి, టిడిపిలు ప్రజలను మోసం చేస్తున్నాయని మండిపడ్డారు. అధికారంలోకి వచ్చి రెండున్నర సంవత్సరాలు అయినా ఇప్పటి వరకు ప్రత్యేక హోదా అమలు చేయలేదన్నారు. విదేశాలలో ఉన్న నల్లధనాన్ని భారతదేశానికి తీసుకుని వచ్చి ప్రతి పౌరుడు ఖాతాలో 15 లక్షల రూపాయలను జమ చేస్తానని చెప్పిన మోదీ అధికారంలోకి వచ్చి రెండున్నర సంవత్సరాలు అయినా దాని ఊసే ఎత్తడం లేదన్నారు. 500, 1000 రూపాయలను రద్దు చేసి బడాబాబుల రుణాలను డిమోనిటేషన్‌తో రద్దు చేశారని అన్నారు. ఒక్క కాంగ్రెస్ ప్రభుత్వంలో మంజూరు చేసిన ప్రాజెక్టుల పనులు తప్ప బిజెపి, టిడిపి హయంలో ఒక్క ప్రాజెక్టు కూడా మంజూరు చేయలేదన్నారు. నెల్లూరు జిల్లా పిసిసి ఇన్‌చార్జ్ మోపిదేవి శ్రీనివాస్ మాట్లాడుతూ చంద్రబాబునాయుడు జేబులను నింపుకునేందుకే ప్రత్యేక ప్యాకేజి కోసం ఆరాటపడుతున్నారని విమర్శించారు. 5 కోట్ల మంది ప్రజల ఆవేదనను అర్థం చేసుకోకుండా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ప్రాజెక్ట్‌కు చంద్రబాబునాయుడు అమ్ముడుపోయారని ఆరోపించారు. టిడిపి ప్రభుత్వం పోలీసులను తన సొంత కార్యకర్తల్లా వాడుకుని అవినీతి, అక్రమాలు, దౌర్జన్యాలకు పాల్పడుతోందని ధ్వజమెత్తారు. పిసిసి ఉపాధ్యక్షుడు చేవూరు దేవకుమార్‌రెడ్డి మాట్లాడుతూ నగదు రహిత లావాదేవీల వల్ల మూడవ వ్యక్తి లబ్ధి పొందుతున్నారని చెప్పారు. డిమోనిటేషన్ పేరుతో 16 లక్షల మందికి ఐటి శాఖ అధికారులు నోటీసులు పంపి ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని అన్నారు. అనంతరం ప్రత్యేక హోదాపై ప్రజాబ్యాలెట్ ఓటును కనుమూరి బాపిరాజు, పనబాక కృష్ణయ్య స్వయంగా స్వీకరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు సివి శేషారెడ్డి, బాలసుధాకర్, పత్తి సీతారాంబాబు, కనకట్ల రఘురామ్ ముదిరాజ్, చెంచలబాబు యాదవ్, భవానీ నాగేంద్రప్రసాద్, ఆసిఫ్, చేవూరు శ్రీ్ధర్‌రెడ్డి, లలారెడ్డి, అనూరాధరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

రూ. 5 లక్షల ఎర్రచందనం దుంగలు స్వాధీనం
రాపూరు, ఫిబ్రవరి 26: రాపూరు అటవీ రేంజ్ పరిధిలోని ఓబులాపల్లి గ్రామ సమీపంలో 565 జాతీయ రహదారి వద్ద ఓ ట్రాక్టర్‌లో అక్రమంగా తరలిస్తున్న ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నట్లు అటవీ శాఖ అధికారులు తెలిపారు. రాపూరు అటవీ సెక్షన్ అధికారి ప్రకాశరావు తెలిపిన వివరాల ప్రకారం రాపూరు రేంజర్ అధికారి శ్రీకాంత్ తమకు ముందస్తు సమాచారంగా ప్రకారం ప్రత్యేక నిఘా ఉంచమని ఆదేశించడంతో తాము నిఘా ఉంచామని చెప్పారు. ఈక్రమంలో అనుమానస్పదంగా వస్తున్న ఓ ట్రాక్టర్‌ను ఆపి పరిశీలించగా అందులో సిమెంట్ రాళ్లు కింద భాగాన పది ఎర్రచందనం దుంగలను ఉండటాన్ని గుర్తించి స్వాధీనం చేసుకొన్నట్లు చెప్పారు. డ్రైవర్ అప్రమత్తమై పరారయ్యాడని, స్వాధీనం చేసుకొన్న ఎర్రచందనం దుంగల విలువ ట్రాక్టర్‌తో సహా ఐదు లక్షల వరకు ఉంటుందని తెలిపారు. ఈ దాడుల్లో రాపూరు అటవీ బీట్ అధికారి వరప్రసాద్, సిబ్బంది రాంబాబు, నాగులు, కొండయ్య తదితరులు ఉన్నారు.

బెజవాడ గోపాల్‌రెడ్డి పురస్కారం అందుకోవడం గర్వకారణం
సినీ పాటల రచయత వెనె్నలకంటి
నెల్లూరు టౌన్, ఫిబ్రవరి 26: నగరంలోని పురమందిరంలో ఆదివారం డాక్టర్ బెజవాడ గోపాల్‌రెడ్డి అవార్డును ప్రముఖ సినీపాటల రచయిత వెనె్నలకంటికి ప్రదానం చేశారు. ఈ కార్యక్రమాన్ని సభా సింహం బివి నరసింహం ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఈ అవార్డు పురస్కారాన్ని ప్రముఖ సినీ గేయ రచయిత వెనె్నలకంటికి అందజేశారు. ముఖ్యఅతిథులుగా మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత సిఆర్‌డిఎ సభ్యులు బీద మస్తాన్‌రావు, ప్రముఖ సినీ రచయిత భువనచంద్ర, సంగీత దర్శకులు సింగీతం శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీద మస్తాన్‌రావు మాట్లాడుతూ, వెనె్నలకంటి నెల్లూరువాసి అని, ఆయనకు నెల్లూరుతో ఉన్న అనుబంధం ఎంతో గొప్పదని అన్నారు. తాను ఒక రాజకీయ నాయకుడిగా కాకుండా, ఒక సంగీత సాహిత్య అభిమానిగా, తమ తండ్రి పేరు మీద సాహితీ అవార్డును వెనె్నలకంటికి అందజేయడం జరిగిందన్నారు. ఆయన మూడు వేల పాటలు రచించి, మూడు వందల రచనలు ఇతర భాషాల్లోకి అనువాదించిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు. ఆయనకు ఈరోజు ఈ పురస్కారం లభించడం సంతోషకరమని, అందుకు అయనను అభినందిస్తున్నానని అన్నారు. అనంతరం సభకు అధ్యక్షత వహించిన పద్మభూషణ్ శాంతాబయోటిక్ అధినేత, ప్రస్తుత బెజవాడ గోపాల్‌రెడ్డి అవార్డు కమిటీ సభ్యుడు ఐవి ప్రసాద్ మాట్లాడుతూ, వెనె్నలకంటి తనకు మంచి మిత్రుడని, ఆయనకు చిత్రపరిశ్రమలో ఎంతో గొప్ప పేరుందని అన్నారు. ఆయనతో తనకున్న సంబంధం ఈరోజుది కాదన్నారు. పరిశ్రమలో అందరిచేత మెప్పు పొందుతూ ఎదుగుతున్న గొప్ప వ్యక్తి అని కొనియాడారు. డాక్టర్ బెజవాడ గోపాల్‌రెడ్డి 16వ పురస్కారాన్ని వెనె్నలకంటి అందుకోవడం సంతోషకరమని అన్నారు. వచ్చే ఏడాది 17వ పురస్కారాన్ని బొల్లినేని సూపర్ స్పెషాలిటీ వైద్యశాల ప్రముఖ గుండె వైద్యులు డాక్టర్ శ్రీనివాసరాజుకు అందివ్వనున్నామని తెలిపారు. అనంతరం సింగీతం శ్రీనివాసరావు మాట్లాడుతూ, బెజవాడ గోపాల్‌రెడ్డితో తనకు ఎంతో అవినాభావ సంబంధం ఉందని, ఆయన ఆర్థిక మంత్రిగా కొనసాగుతున్న సమయంలో మద్రాసులో ఒక నాటకం వేసే సందర్భంలో పరిచయం అయ్యారని తెలిపారు. ఆనాటి నుండి ఆయన తుదిశ్వాస వరకు తమ అనుబంధం కొనసాగిందని, అలాంటి మహోన్నతమైన వ్యక్తి పేరు మీద ఈ పురస్కారాన్ని వెనె్నలకంటి అందుకోవడం అభినందనీయమని అన్నారు. అనంతరం భువనచంద్ర మాట్లాడుతూ, వెనె్నలకంటిని బుల్లెబ్బాయి అని పిలిచే చనువు ఉందన్నారు. ఈరోజు ఆయన ఈ అవార్డు అందుకోవడం ఎంతో గర్వకారణమని పేర్కొన్నారు. ఏదైనా ఒక రచన చేసిన సందర్భంలో వెనె్నలకంటితో చర్చించిన తరువాతనే దానిని ఆచరణలో పెట్టడం జరుగుతుందని అన్నారు. అనంతరం అవార్డు గ్రహీత వెనె్నలకంటి మాట్లాడుతూ, ఈ సంతోషకరమైన సమయంలో మాట్లాడేందుకు మాటలు రావడం లేదన్నారు. నెల్లూరులో తాను ఈ అవార్డును అందుకోవడం ఎంతో గర్వకారణంగా ఉందన్నారు. ఈ సందర్భంగా కొంతమంది ప్రముఖులను తలచుకోవడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు. నా దైవంతో సమానులైన ఎస్‌పి బాలసుబ్రహ్మణ్యం తల్లిదండ్రులకన్నా ఎక్కువేనని అన్నారు. అదేవిధంగా మీ అందరి ఆదరాభిమానాలే తనను ఈ స్థాయికి తీసుకొచ్చాయని అన్నారు. బెజవాడ గోపాల్‌రెడ్డితో సాహిత్యపరంగా ఎంతో అనుబంధం ఉందని, ఆయన 23 గ్రంథాలు స్వతహాగా రచించారని, ఎన్నో గ్రంథాలను అనువాదం చేశారని అన్నారు. సాహిత్యం మీద ఆయనకు ఎనలేని అభిమానం ఉందని, జాతీయ స్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయికి ఎదిగి, ఎన్నో సేవలను ప్రజలకు అందించి ఎనలేని కీర్తిని గడించారని పేర్కొన్నారు. అలాంటి వ్యక్తి పురస్కారాన్ని తనకు అందివ్వడం ఎంతో గర్వకారణంగా ఉందని వివరించారు. తాను కళాశాలలో చదువుకొనే రోజుల్లో ఉద్యోగానికి వెళ్లే ముందు డాక్టర్ బెజవాడ గోపాల్‌రెడ్డి ఆయన స్వయంగా రిఫరెన్స్ కోసం స్వయాన సంతకం పెట్టి ఇచ్చారని అన్నారు. ఆయనతో ఉన్న అనుంబంధం మరువలేనిదన్నారు. అనంతరం భార్గవి ఆటోమొబైల్స్ అధినేత కొండా బలరామిరెడ్డి, కావలి మార్కెటింగ్ చైర్మన్ దేవరాల సుబ్రహ్మణ్యం, పల్లవా గ్రానైట్స్ అధినేత కొడవలూరు సుబ్బారెడ్డి తదితరులు ప్రసంగించారు. అనంతరం ఆయనను, ఆయన సతీమణి ప్రమీలను దుశ్శాలువలతో, పూలమాలలతో ఘనంగా సత్కరించి, అవార్డు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో భారీసంఖ్యలో అభిమానులు, రచయితలు తదితరులు పాల్గొన్నారు.

గ్రూప్-2 ప్రశ్నల్లో గుండ్రా సతీష్
ఆత్మకూరు, ఫిబ్రవరి 26: ఆత్మకూరు మండలం మహిమలూరు గ్రామానికి చెందిన, భారత రక్షణ శాఖ శాస్ర్తియ సలహాదారుడైన గుండ్రా సతీష్‌రెడ్డి పేరు జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్ అంశాల్లో ప్రముఖునిగా గుర్తింపు పొందడం విశేషం. ఆదివారం నిర్వహించిన ఏపిపిఎస్‌సి (ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్) గ్రూప్-2 పోటీ పరీక్షల పత్రంలో గుండ్రాకు సంబంధించిన ప్రశ్న కూడా రావడాన్ని ప్రత్యేకంగా పేర్కొనాలి. రక్షణ మంత్రికి శాస్ర్తియ సలహాదారు ఎవరంటూ గ్రూప్-2 స్క్రీనింగ్ టెస్ట్‌లో భాగంగా ఓ ప్రశ్న వచ్చింది.