శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

పట్ట్భద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు నేడే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు, మార్చి 8: తూర్పు రాయలసీమ (చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం) నియోజకవర్గ ఉపాధ్యాయ, పట్ట్భద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు నిర్వహించనున్నారు. ఎన్నికలకు సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. జిల్లావ్యాప్తంగా 133 పోలింగ్ కేంద్రాల్లో ఈ ఎన్నికలు నిర్వహించనున్నారు. వీటిలో పట్ట్భద్రుల కోసం 85 పోలింగ్ కేంద్రాలు, ఉపాధ్యాయుల కోసం 48 కేంద్రాలు ఏర్పాటు చేశారు. సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తారు. ఒకవేళ స్లిప్‌లు కలిగి క్యూలో ఓటర్లు నిల్చొని ఉంటే వారి సంఖ్య పూర్తయ్యేవరకు పోలింగ్ నిర్వహించాలని అధికారులకు ఆదేశాలు అందాయి. ఈ ఎన్నికలను పర్యవేక్షించేందుకు 159 మంది కేంద్ర ప్రభుత్వ రంగ ఉద్యోగులను ఎన్నికల పరిశీలకులుగా ఎన్నికల కమిషన్ నియమించింది. పోలింగ్ సరళిని క్షుణ్ణంగా పరిశీలించేందుకు ప్రతి కేంద్రంలోనూ వెబ్ కెమెరాలు ఏర్పాటు చేయనున్నారు. ప్రతి పోలింగ్ కేంద్రానికి ముగ్గురు అధికారులను, అవసరమైనచోట మరొక సిబ్బందిని అదనంగా నియమించారు. జిల్లావ్యాప్తంగా సుమారు 1200 మంది పోలీసులను ఈ ఎన్నికలకు బందోబస్తుగా నియమించినట్లు జిల్లా కలెక్టర్ తెలియచేశారు. పోలింగ్‌ను పర్యవేక్షించేందుకు జిల్లాలో 22 రూట్లను విభజించి జోన్ అధికారులను నియమించారు. ఎన్నికల సందర్భంగా జిల్లాలో ఓటుహక్కు ఉండే ప్రభుత్వ ఉద్యోగులకు ప్రత్యేక సాధారణ సెలవును జిల్లా కలెక్టర్ ప్రకటించారు. ప్రైవేటు ఉద్యోగులకు ఓటుహక్కు ఉంటే వినియోగించుకునే విధంగా యాజమాన్యాలు సెలవు ప్రకటించాలని, వీలుకాని పక్షంలో ఓటు వేసే వరకు ప్రత్యేక అనుమతినివ్వాలని ఆయన సూచించారు. ఎన్నికలకు సంబంధించి ఫిర్యాదులు స్వీకరించేందుకు, పలు సందేహాలను నివృత్తి చేసేందుకు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రత్యేక సెల్ ఏర్పాటు చేశారు.
బరిలో పలువురు
ఉపాధ్యాయ, పట్ట్భద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో పదుల సంఖ్యలో అభ్యర్థులు బరిలో నిలిచారు. పట్ట్భద్రుల నియోజకవర్గానికి సంబంధించి 14 మంది అభ్యర్థులు పోటీలో ఉండగా, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి 10 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. వారిలో చదలవాడ సుచరిత తాను పోటీ నుండి విరమించుకుంటున్నట్లు ప్రకటించడంతో ప్రస్తుతం 9 మంది పోటీలో నిలిచినట్లయింది. జిల్లాలో పట్ట్భద్రుల నియోజకవర్గ ఓటర్లు 67,547 మంది ఉండగా, ఉపాధ్యాయ నియోజకవర్గానికి సంబంధించి 5,923 మంది ఓటర్లు ఉన్నారు. ఓటు హక్కు వినియోగించుకునేందుకు వెళ్లే సమయంలో ఓటరు తమ వెంట కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించిన ఏదైనా గుర్తింపుకార్డును ఒకదాన్ని తీసుకెళ్లాల్సి ఉంటుంది. పోలింగ్ అనంతరం బ్యాలెట్ బాక్సులను తొలుత నెల్లూరు నగరంలోని డికెడబ్ల్యు కళాశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్‌రూంకు తరలించి, తదనంతరం అక్కడ్నుంచి చిత్తూరుకు తరలిస్తారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల అనంతరం ఈ ఓట్ల లెక్కింపు ఉంటుంది. అభ్యర్థులతో పాటు నోటాకు కూడా బ్యాలెట్ పత్రంలో చోటు కల్పించారు. అభ్యర్థులపై అయిష్టత కలిగినవారు తమ ఓటును నోటా కింద ప్రాధాన్యత క్రమంలో వేయవచ్చు. బూత్‌ల వద్ద పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేస్తుండడంతో అందరూ ప్రశాంతంగా ఓటుహక్కును వినియోగించుకునే అవకాశం ఉంది.
ఎమ్మెల్సీ ఎన్నికల సామగ్రి పంపిణీ
జిల్లా జాయింట్ కలెక్టర్ ఎఎండి ఇంతియాజ్ డికెడబ్ల్యూ కళాశాలలో ఉన్న డిస్ట్రిబ్యూషన్ సెంటర్‌ను సందర్శించారు. పోలింగ్ అధికారులకు ఎమ్మెల్సీ ఎన్నికల సామగ్రి పంపిణీ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు.

పిడుగుపాటుకు ఇద్దరు మృతి
వరికుంటపాడు, మార్చి 8: పిడుగుపాటుకు ఇద్దరు వ్యక్తులు మృతి చెందిన సంఘటన మంగళవారం జరిగింది. బాధితుల కుటుంబ సభ్యులు తెలిపిన సమాచారం మేరకు మండల పరిధిలోని గువ్వాడికి చెందిన మైనంపాటి రమేష్ (35) పొలానికి కాపలా వెళ్లాడు. అదే సమయంలో నల్లగొండ జిల్లా నకిరేకల్ మండలం ఓగోడుకు చెందిన కొండా సైదులు (30) కల్లు గీత కార్మికుడుగా ఉంటూ వృత్తిపరమైన పనిపై పొలానికి వెళ్లాడు. అకస్మాత్తుగా ఆకాశం మేఘావృతమై ఒక్కసారిగా మెరుపులు, ఉరుములతో వాతావరణం భీకరంగా మారిపోగా కల్లు చెట్టును ఆసరా చేసుకుని నిలబడి ఉండగా ఆ చెట్టు పైనే పిడుగు పడింది. దీంతో వారి ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. ఎంత సేపటికీ ఇరువురు ఇళ్లకు చేరుకోకపోవడంతో ఇరు కుటుంబాల సభ్యులు గ్రామస్తులతో కలిసి సమీప పంటపొలాల్లో వెతకగా మృతదేహాలు కనిపించాయి. మృతదేహాలను వారివారి ఇళ్లకు బంధువులు చేర్చగా, అధికారులకు, పోలీసులకు సమాచారం ఇచ్చేందుకు సెల్‌ఫోన్‌లు పనిచేయలేదు. దీంతో రాత్రంతా అలాగే గడిపి బుధవారం ఉదయం అధికారులకు వివరాలు తెలియజేశారు. ఒకేసారి గ్రామానికి చెందిన ఇరువురు మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కల్లు కార్మికుడు సైదులు భార్య పొట్టకూటి కోసం వచ్చి తన భర్త ప్రాణాలు కోల్పోయాడని కన్నీరు, మున్నీరుగా విలపించడం చూపరులకు కంటితడిపెట్టించింది. తహశీల్దార్ మునిరాజ, ఎస్సై కె ముత్యాలరాజు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. పోలీసులు కేసు నమోదు చేసి వివరాలు సేకరిస్తున్నట్లు తెలిపారు.