శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

ప్రజలకు చేరువయ్యేందుకే ఎస్పీ క్రికెట్ కప్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు, మార్చి 11: ప్రజలకు ముఖ్యంగా యువతకు మరింత చేరువయ్యేందుకే క్రీడాపోటీలు నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎస్పీ విశాల్‌గున్ని తెలిపారు. ఎస్పీ క్రికెట్ కప్ నెల్లూరు సబ్ డివిజన్ స్థాయి పోటీలను ఆయన శనివారం స్థానిక ఏసి సుబ్బారెడ్డి స్టేడియంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ చెడు మార్గాల వైపు యువత ఆకర్షితులు కాకుండా క్రీడల పట్ల ఆసక్తి పెంచుకోవాలని సూచించారు. చదువుతోపాటు ఆటల్లోనూ ప్రతిభ కనబరచాలని యువతకు పిలుపునిచ్చారు. ప్రజలతో మమేకం కావడం ద్వారా సమర్థవంతమైన పోలిసింగ్ సాధ్యమన్నారు. శాంతి భద్రతల పరిరక్షణలో యువత పోలీసులకు సహకరించాలని కోరారు. పోటీల్లో పాల్గొంటున్న క్రీడాకారులకు ఎస్పీ శుభాకాంక్షలు తెలియచేశారు. ఈ సందర్భంగా బెలూన్లను ఎగరేయడం ద్వారా ఎస్పీ క్రికెట్ పోటీలను ప్రారంభించారు. అనంతరం కాసేపు బ్యాటింగ్ చేసిన ఎస్పీ ఎదుర్కొన్న బంతుల్ని సిక్స్ కొట్టడం విశేషం.
హోరాహోరీగా పోటీలు
నెల్లూరు నగర సబ్ డివిజన్ పరిధిలో శనివారం మూడు మ్యాచ్‌లు జరిగాయి. తొలి మ్యాచ్‌లో నెల్లూరు 1వ పట్టణ జట్టు, 5వ పట్టణ జట్టుపై గెలుపొందింది. అదేవిధంగా మరో మ్యాచ్‌లో 4వ పట్టణ జట్టు, 2వ పట్టణంపై, సాయంత్రం జరిగిన మ్యాచ్‌లో బాలాజీనగర్ జట్టుపై 3వ నగర జట్టు విజయం సాధించింది. గెలుపొందిన జట్లకు ఆదివారం పోటీలు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ బి.శరత్‌బాబు, నగర డిఎస్పీ జివి రాముడు తదితరులు పాల్గొన్నారు.

సిఎఎం హైస్కూల్ ఆస్తుల పరిరక్షణపై కదిలిన యంత్రాగం
ఎమ్మెల్యే శ్రీ్ధర్‌రెడ్డికి క్రైస్తవ సంఘాల కృతజ్ఞతలు
నెల్లూరుసిటీ, మార్చి 11: నగరంలోని నడిబొడ్డున ఉన్న వందేళ్ల చరిత్ర గల సిఎఎం హైస్కూల్ ఆస్తులు అన్యాక్రాంతం కాకుండా కాపాడాలని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీ్ధర్‌రెడ్డి చేసిన కృషి ఫలించింది. ఈనెల 19వ తేదీన అసెంబ్లీలో సిఎఎం హైస్కూల్ ఆస్తుల అన్యాక్రాంతంపై ప్రశ్న రావడంతో అధికార యంత్రాగం శనివారం ఎట్టకేలకు కదిలింది. అసెంబ్లీలో సిఎఎం హైస్కూల్ ఆస్తుల అన్యాక్రాంతంపై ప్రశ్న రావడంతో ప్రభుత్వం స్పందించి అందుకు ఆధారాలను సేకరించేందుకు సిద్ధమైంది. సుమారు 300 కోట్ల రూపాయలు విలువ చేసే సిఎఎం హైస్కూల్ ఆస్తులను తెలంగాణ రాష్ట్రానికి చెందిన పరివార్ గ్రూప్స్‌కు చెందినవారు ఆక్రమించుకునేందుకు ప్రయత్నం చేయగా క్రైస్తవ సంఘాల నాయకులు బర్నాబాస్, సురేంద్ర, టిడిపి కార్పొరేటర్ దాసరి రాజేష్ పోరాటం చేస్తున్నారు. అదేవిధంగా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీ్ధర్‌రెడ్డి సిఎఎం హైస్కూల్ ఆస్తుల పరిరక్షణపై క్రైస్తవ సంఘాలు చేస్తున్న పోరాటానికి మద్దతు ఇవ్వడంతో పాటు జిల్లా కలెక్టర్ ముత్యాలరాజు, మైనార్టీశాఖ మంత్రి పల్లె రఘునాధ్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ప్రభుత్వం ఎట్టకేలకు స్పందించి సిఎఎం హైస్కూల్ ఆస్తుల పరిరక్షణకు చర్యలు చేపట్టింది.
ఎమ్మెల్యేకి క్రైస్తవ సంఘాలు కృతజ్ఞతలు
నగరంలోని నడిబొడ్డున ఉన్న సిఎఎం హైస్కూల్ ఆస్తుల అన్యాక్రాంతంపై ప్రభుత్వ దృష్టికి వచ్చిందా, ఒకవేళ వస్తే దానిపై ఏమి చర్యలు తీసుకున్నారో చెప్పాలని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీ్ధర్‌రెడ్డి వేసిన ప్రశ్న ఈనెల 19వ తేదీన అసెంబ్లీకి రావడంతో దీనిపై రెవిన్యూ యంత్రాగం, మైనార్టీ కార్పొరేషన్ అధికారులలో కదలిక వచ్చింది. అందులో భాగంగా శనివారం సిఎఎం హైస్కూల్‌కు సంబధించిన ఆస్తుల వివరాలను అధికారులు సేకరించారు. సిఎఎం హైస్కూల్ ఆస్తులు, దాని చరిత్రను క్రైస్తవ సంఘ నాయకుల దగ్గర నుంచి అధికారులు సేకరించే పనిలో పడ్డారు. ఇదిలావుంటే గత కొన్ని సంవత్సరాల నుంచి సిఎఎం హైస్కూల్ ఆస్తులు అన్యాక్రాంతం కాకుండా తాము చేస్తున్న పోరాటానికి ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీ్ధర్‌రెడ్డి మద్దతుతో విజయం సాధించబోతున్నామని క్రైస్తవ సంఘాల నాయకులు బర్నాబాస్, సురేంద్ర తెలిపారు.