శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

రఘువీరా రాకకు ఏర్పాట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆత్మకూరు, మార్చి 11: ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు జన ఆవేదన కార్యక్రమంలో భాగంగా ఈనెల 14వ తేదీన ఆత్మకూరుకు వస్తున్న విషయమై ఇప్పటికే కాంగ్రెస్ నేతలు ప్రకటించడం తెలిసిందే. ఈ సభ నిమిత్తం ఆత్మకూరులోని కాంగ్రెస్ (రాజీవ్) భవన్ సిద్ధం చేయడంలో భాగంగా జెసిబితో కార్యాలయ ప్రాంగణాన్ని చదును చేస్తున్న సందర్భంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. దీనికి సంబంధించి వివరాల్లోకి వెళ్తే.. ఆత్మకూరులో 1965లో అప్పటి ఏఐసిసి అధ్యక్షులు కామరాజ్ నాడర్ (తమిళనాడు మాజీ సిఎం) చేతులమీదుగా కాంగ్రెస్ పార్టీ భవన్ ప్రారంభించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ భవన్ కాంగ్రెస్ పార్టీ స్థానిక నేతల ఆధీనంలోనే కొనసాగుతోంది. అయితే ఈ భవన ప్రాంగణానికి ముంగిట పలు ఆక్రమణలు కోరలు చాస్తూ వచ్చాయి. అయితే గత సుదీర్ఘకాలంగా స్థానిక కాంగ్రెస్ నేత చేవూరు రమణారెడ్డి, ఆయన తనయుడు శ్రీ్ధర్ పర్యవేక్షకులుగా కొనసాగుతున్నారు. ఎంతో విలువైన కాంగ్రెస్ భవన్‌నే కబ్జా చేయాలనే తలంపుతో ఎందరో పెద్దలు సైతం కనే్నసిన దాఖలాలు అనేకం. చాలావరకు చేవూరు శ్రీ్ధర్‌రెడ్డి కుటుంబీకులు అడ్డుకుంటూ వచ్చారు. అయినాసరే ఈ భవన్‌కు ముందువైపు చాలా వరకు చిరు ఆక్రమణలు సాగుతూనే వచ్చాయి. తాజాగా, రఘువీరారెడ్డి పర్యటన నిమిత్తమై డిసిసి అధ్యక్షులు పనబాక కృష్ణయ్య ఆ ప్రాంగణాన్ని పరిశీలించి తగు సూచనలు ఇచ్చి వెళ్లారు. దీంతో పనబాక సూచనల మేరకు జెసిబితో చదును చేయిస్తుండగా ఆ ప్రాంగణానికి ముందు ఆక్రమించుకుని ఉన్న తోట సందీప్ అనే బంగారు వ్యాపారం చేసే యువకుడు దౌర్జన్యానికి పాల్పడ్డాడు. జెసిబిపై రాళ్లు వేసి ఉద్రిక్తత సృష్టించాడు. ఈ సమాచారం ఆత్మకూరు ఎస్సై పూర్ణచంద్రరావుకు తెలియడంతో ఆయన వచ్చి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.

సముద్రంలోకి తాబేళ్ల పిల్లలు విడుదల
వాకాడు, మార్చి 11: మండలంలోని శ్రీనివాసపురం గ్రామ సమీపాన ఉన్న బంగళాఖాతంలో శనివారం 120 తాబేళ్ల పిల్లలను విడుదల చేసినట్టు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ గాయం శ్రీనివాసులు తెలిపారు. పర్యావరణ పరిరక్షణ కోసం ఎంతగానో దోహదపడే తాబేళ్ల పిల్లలను శ్రీనివాసపురం, కొండూరుపాలెం, వైట్‌కుప్పం, పూడికుప్పం, నవాబ్‌పేట, లైట్‌హౌస్ గ్రామాలకు సమీపాన ఉన్న బంగళాఖాతం సముద్రంలో 6 వేల తాబేళ్ల పిల్లలను విడుదల చేసినట్టు తెలిపారు. సముద్రపు ఒడ్డున హేచరీలను ఏర్పాటుచేసి గుడ్ల ద్వారా పిల్లలను సేకరించి సముద్రంలోకి వదిలి పెడుతున్నట్లు చెప్పారు. సముద్ర జలాలు కలుషితం కాకుండా ఇవి సముద్రపు నీటిని పరిరక్షిస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ చార్లెస్ పాల్గొన్నారు.