శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

గూడూరు ఎఎంసి చైర్మన్‌గా బొల్లినేని బాధ్యతల స్వీకరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిల్లకూరు, మార్చి 25: గూడూరు వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ చైర్మన్‌గా గూడూరు రూరల్ మండల అధ్యక్షుడు బొల్లినేని కోటేశ్వరరావు శనివారం చిల్లకూరు పంచాయతీలో గల ఎఫ్‌సిఐ గోడౌన్ వద్ద ఉన్న వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ కార్యాలయంలో బాధ్యతలు చేపట్టారు. వైస్‌చైర్మన్‌గా సోమిశెట్టి చెంచురామయ్య, డైరెక్టర్లుగా పి రామచంద్రయ్య, వెంకయ్య, రామచంద్రారెడ్డి, వెంకటకృష్ణయ్య, బాలకృష్ణారెడ్డి, సుధాకర్‌రెడ్డి, గోపాల్‌నాయుడు, ఖలీల్, వి వెంకటసుధాకర్, రఘుప్రసాద్‌రెడ్డి, పి శ్రీనివాసులు, పట్ట్భారెడ్డి ఎంపికయ్యారు. ఈ కార్యక్రమానికి గూడూరు టిడిపి పట్టణాధ్యక్షులు పి శ్రీనివాసులు అధ్యక్షత వహించగా, వ్యవసాయ మార్కెటింగ్ సెక్రటరీ శ్రీనివాసులు, ప్రసాద్ దగ్గరుండి ప్రమాణస్వీకారం చేయించారు.

చదువుతో పాటు కళారంగంలోనూ రాణించాలి
నెల్లూరు కల్చరల్, మార్చి 25: విద్యార్థులు చదువుతో పాటు కళారంగంలో కూడా రాణించాలని 25 కళాసంఘాల అధ్యక్షుడు అమరావతి కృష్ణారెడ్డి అన్నారు. స్థానిక డికెడబ్ల్యూ కళాశాలోని కాన్ఫరెన్స్ హాలులో శనివారం నెల్లూరు జిల్లా రచయితల సంఘం ఆధ్వర్యంలో నృత్య కళాకారిణి నదియాను సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు అన్ని రంగాల్లో ముందుండాలన్నారు. ముఖ్యంగా కళారంగంలో నదియా దేశానికే పేరు ప్రతిష్టలు తెస్తున్నారని అన్నారు. తాను సైకిల్ తొక్కే స్థాయి నుంచి తాను ఎంచుకొన్న రంగంలో పైకి వచ్చానని అన్నారు. నదియా బిటెక్ చదివినప్పటికి తాను ఎంచుకొన్న కళారంగంలో దేశ, విదేశాల్లో ఎన్నో ప్రదర్శనలు ఇచ్చి నెల్లూరు జిల్లా పేరును చాటుతున్నారని ప్రశంసించారు. విద్యార్థులు ఆమెను స్ఫూర్తిగా తీసుకొని కళారంగంలో కూడా రాణించాలని కోరారు. నదియా మాట్లాడుతూ తన తండ్రి తనకు తొలి గురువని అన్నారు. తాను తొలుత యోగా, స్కేటింగ్ చేస్తూ అనంతరం నృత్య కళాకారిణిగా రాణించానని తెలిపారు. తాను ఇప్పటివరకు దేశ విదేశాల్లో 800 ప్రదర్శనలు ఇచ్చానని అన్నారు. ఇటీవల ఢిల్లీలో కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు ఇంట్లో తాను నృత్య ప్రదర్శన చేశానని తెలిపారు. తైవాన్, బ్యాంకాంగ్, మలేషియా, అమెరికా వంటి వివిధ దేశాల్లో ప్రదర్శనలు ఇచ్చానన్నారు. ప్రస్తుతం తెలుగు వెలుగు జర్మనీ అసోసియేషన్ ఆధ్వర్యంలో తాను జర్మనీ దేశంలో నృత్య ప్రదర్శన ఇచ్చేందుకు వెళుతున్నానని తెలిపారు. విద్యార్థులు ఎంచుకొన్న కళల్లో రాణించాలని కోరారు. అనతంరం విద్యార్థులకు సాంస్కృతిక కార్యక్రమాలు, సంప్రదాయాలపై ఆమె అవగాహన కల్పించారు. ఈ సన్మాన కార్యక్రమంలో రచయితల సంఘం జిల్లా అధ్యక్షుడు ఎ.జయప్రకాష్, ప్రిన్సిపాల్ శైలజ, సురభి రాజశేఖర్‌శాస్ర్తీ తదితరులు పాల్గొన్నారు.