శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

నేడు పల్స్‌పోలియో

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు సిటీ, ఏప్రిల్ 1: నెల్లూరు జిల్లాను పోలియో రహితంగా మార్చేందుకు పుట్టిన బిడ్డకు రెండు చుక్కలు నినాదంతో సాగాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ వరసుందరం తెలిపారు. శనివారం తన చాంబర్‌లో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఏప్రిల్ 2వ తేదీన 0.5 సంవత్సరాలోపు పిల్లకు పోలియో చుక్కలు తప్పకుండా వేయించాలన్నారు. పోలియో రహిత సమాజం కోసం ప్రతిఒక్కరు సంఘటితంగా కృషి చేయాలన్నారు. జిల్లాలో పోలియో వ్యాధిన పడకుండా ప్రతిఒక్కరు రెండు చుక్కలు వేయించాలన్నారు. గతంలో వేసి ఉన్న పిల్లలకు కూడా తప్పకుండా పోలియో చుక్కలు వేయాలని తెలిపారు. దేశంలో పోలియో కేసులు నమోదు కాకుండా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వం, డబ్ల్యుహెచ్‌ఓ కృషి చేస్తుందన్నారు. అదేవిధంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చే పిల్లల కోసం రైల్వేస్టేషన్, బస్టాండ్‌ల వద్ద ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. పోలియో చుక్కల మందు మూడు రోజుల పాటు జరుగుతుందన్నారు. తొలి రోజున కేంద్రాల వద్ద, రెండవ రోజున ఇంటింటికి వెళ్లి పోలియో కేంద్రాలకు రాని పిల్లలకు గుర్తించి వారికి వేయడం జరుగుతుందన్నారు. మూడో రోజున హైరిస్క్ ప్రాంతాల్లో పర్యటించి ఆ ప్రాంతాలలో ఉన్న పిల్లలకు పోలియో చుక్కలు వేస్తామని తెలిపాన్నారు.
పల్స్‌పోలియోపై అవగాహన ర్యాలీ
పల్స్‌పోలియోపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు గాంధీబొమ్మ నుండి విఆర్సీ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జోనల్ మలేరియా అధికారి డాక్టర్ ఉమామహేశ్వరి, ఇమ్యూనైజేషన్ అధికారి జయసింహ, డిటిసిఓ సురేష్‌కుమార్, సుధీర్‌నాయక్, వివిఎస్ నాయుడు, డాక్టర్ సుబ్బరాజు, సుధామణి, రఫీ, శుభావతి, సునీత, సుగుణమ్మ తదితరులు పాల్గొన్నారు.

ఆత్మకూరులో నీటి వృథా!
రోడ్లపై పొంగి పొర్లుతున్న వైనం
ఆత్మకూరు, ఏప్రిల్ 1: ఆత్మకూరు పట్టణ పరిధిలో ఎంతో విలువైన జీవజలం వృథాగా రోడ్లపై పొంగి పొర్లుతోంది. గడచిన రెండు రోజులుగా ఇలా భారీగా తాగునీరు వృథా అవుతున్నా ఆత్మకూరు పురపాలక సంఘం తరపున సమర్ధవంతమైన చర్యలు కరవు. పట్టణ పరిధిలోని 12వ వార్డు అరుంధతీయపాళెం వద్ద ఓవర్‌హెడ్ ట్యాంక్ వద్ద పైపులైన్ల నుంచి భారీగా నీరంతా వృథా అవుతోంది. సాంకేతిక మరమ్మతులో లేక ఇతర కారణాలో తెలియదుగాని రెండు రోజులుగా ఇలా రోడ్లంతా వరదలా పొంగి పొర్లుతూ అంతా చిందరవందరగా మారుతున్న వైనంతో జనం నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇక్కడ నీటి వృథా ఇలా ఉంటే ఇదే పట్టణ పరిధిలోని 23వ వార్డు నెల్లూరుపాళెం ప్రాంతంలో గత ఐదారు రోజులుగా నీటి సరఫరా నిలిచిపోయింది. ఓచోట వృథా మరోప్రాంతంలో వ్యధగా మారుతున్న ఆత్మకూరు నీటి సరఫరా వ్యవహారాన్ని కొలిక్కి తీసుకురావాల్సిన ఆవశ్యకత ఉంది. వాస్తవంగా ప్రస్తుతం తీవ్ర దుర్భిక్ష పరిస్థితులతో చాలా గ్రామాల్లో ఇప్పటికే తాగునీటి ఎద్దడి నెలకొంది. అయితే సోమశిల జలాశయపు డెడ్ స్టోరేజి నీటి నుంచైన ఆత్మకూరుకు పైపులైన్ల ద్వారా తీసుకొచ్చే అవకాశం ఉండటం వలనే స్థానికంగా తాగునీరు అందుబాటులో ఉంటోంది. అయితే నీరు భారీగా వృథా అవుతుండటాన్ని మాత్రం సర్వత్రా తప్పుబడుతున్నారు.

నెల్లూరులో ఎసిబి దాడులు
నెల్లూరు, ఏప్రిల్ 1: రహదారులు, భవనాల శాఖ రాష్ట్ర ముఖ్య ఇంజనీర్ గంగాధర్ ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టిన కేసులో నెల్లూరులోని ఆయన సమీప బంధువు ఇంట్లో శనివారం ఏసిబి అధికారులు దాడులు నిర్వహించారు. నగరంలోని శివగిరి కాలనీలో నివాసముంటున్న మాజీ ఎంపిటిసి సభ్యుడు రాధాకృష్ణయ్యతో గంగాధర్‌కు సమీప బంధుత్వం ఉంది. ఈక్రమంలో రాష్టవ్య్రాప్తంగా 20 చోట్ల గంగాధరం బంధువులు, స్నేహితులకు చెందిన ఇళ్లపై ఏసిబి అధికారులు ఏకకాలంలో దాడులు నిర్వహించారు. అందులో భాగంగా రాధాకృష్ణయ్య ఇంట్లో ఏసిబి ఇన్స్‌పెక్టర్ శివకుమార్‌రెడ్డి నేతృత్వంలో ఏసిబి సిబ్బంది సోదాలు నిర్వహించారు. అయితే ఈ సోదాల్లో గంగాధరానికి చెందిన ఎటువంటి ఆస్తి తాలూకూ వివరాలు అధికారులకు లభ్యం కాలేదు. ఇదే విషయాన్ని ఇన్స్‌పెక్టర్ శివకుమార్‌రెడ్డి ధ్రువీకరిస్తూ సోదాలు నిర్వహించిన మాట వాస్తవమేనని, అయితే రాధాకృష్ణయ్య ఇంట్లో ఎటువంటి అనధికారిక ఆస్తుల సమాచారం తమకు లభించలేదని ఆయన స్పష్టం చేశారు. ఈ సోదాల్లో ఏసిబి ఎస్సై శ్రీహరిరావు, ఎ ఎస్సై కరీముల్లా, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

నోట్ల రద్దుకు ప్రజల సహకారం మరువలేనిది
* కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు
ఆంధ్రభూమి బ్యూరో
నెల్లూరు, ఏప్రిల్ 1: కేంద్ర ప్రభుత్వం తీసుకున్న పెద్ద నోట్ల రద్దుపై సామాన్య ప్రజలు ప్రభుత్వానికి ఎంతో సహకరించారని, వారందించిన సహకారం మరువలేనిదని కేంద్ర మంత్రి ఎం.వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. నగరంలోని ఏసి సుబ్బారెడ్డి స్టేడియంలో శనివారం ఏర్పాటు చేసిన డిజిధన్ అవగాహనా కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రస్తుత కాల పరిస్థితుల్లో నగదు రహిత లావాదేవీలే మనిషికి, మనసుకి శాంతినిస్తాయన్నారు. ప్రభుత్వం తీసుకున్న పెద్ద కరెన్సీ నోట్ల రద్దుతో అనేక కోట్లు బ్యాంకుల్లో జమ అయ్యాయని అన్నారు. నగదు రహిత లావాదేవీల వల్ల సమాజంలో లంచగొండితనం తగ్గి పారదర్శకంగా ఆర్థిక లావాదేవీలు జరుగుతాయన్నారు. ప్రతిఒక్కరూ దేశంలో తమ బ్యాంక్ ఖాతాలను ఆధార్‌కార్డులతో అనుసంధానం చేసుకోవడం వల్ల ఆర్థిక లావాదేవీలు సులభతరం అవుతాయన్నారు. ఈ డిజిధన్‌లో అనేక మంది స్టాల్స్ పెట్టారని, వాటిని ప్రజలు సందర్శించి, నగదు రహిత లావాదేవీలపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. నెల్లూరు ఎంపి మేకపాటి రాజమోహన్‌రెడ్డి మాట్లాడుతూ ఇటీవల కేంద్రం పెద్ద కరెన్సీ నోట్లను రద్దు చేయడంతో నకిలీ కరెన్సీ టెర్రరిజం నల్లధనంపై వ్యతిరేకంగా గట్టి చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. జిల్లా కలెక్టర్ రేవు ముత్యాలరాజు మాట్లాడుతూ జిల్లాలో నగదు రహిత లావాదేవీలపై అవగాహనా కార్యక్రమాలు ముమ్మరంగా చేపట్టినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి కామినేని శ్రీనివాస్, తిరుపతి ఎంపి డాక్టర్ వరప్రసాద్, నీతి ఆయోగ్ డైరెక్టర్ శ్రీవాత్సవ, జడ్పీ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీ్ధర్‌రెడ్డి, జిల్లా జాయింట్ కలెక్టర్ ఎఎండి ఇంతియాజ్, వివిధ కళాశాలలకు చెందిన అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. వివిధ శాఖల బ్యాంకులు, కంపెనీలు తమకు సంబంధించిన ప్రదర్శన శాలలను ఏర్పాటు చేశాయి. శనివారం సాయంత్రం వరకూ సందర్శకులతో ఈ కౌంటర్లన్ని రద్దీగా దర్శనమిచ్చాయి.

ఆగి ఉన్న లారీని ఢీకొన్న ఓల్వో బస్సు
* 23 మందికి గాయాలు
* ముగ్గురి పరిస్థితి విషమం
ఓజిలి, ఏప్రిల్ 1: ఓజిలి సమీపంలోని 5వ నంబర్ జాతీయ రహదారిపై శనివారం తెల్లవారుఝామున రాజుపాలెం గ్రామ సమీపంలో ఆగివున్న లారీని నాగూరు నాగపట్నం నుండి తూర్పుగోదావరి జిల్లా సామర్లకోటకు వెళుతున్న ఓల్వో బస్సు ఢీకొంది. ఈ సంఘటనలో 23 మందికి గాయాలయ్యాయి. వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. పోలీసుల కథనం మేరకు తూర్పుగోదావరి జిల్లాలోని సామర్లకోట, బ్రహ్మదేవం, ద్రాక్షారామం ప్రాంతాలకు చెందిన 48 మంది చెన్నైలోని నాగూరు నాగపట్నంలో ఉన్న మరియమ్మ దేవతను దర్శించుకొని తిరిగి వస్తున్న నేపథ్యంలో ఓజిలి సమీపంలో ఈ సంఘటన చోటుచేసుకొంది. రాజుపాలెం గ్రామ సమీపంలో రోడ్డుసైడు మార్జిన్‌లో ఆగివున్న లారీ వెనుక భాగంలో నిద్రమత్తులో బస్సు డ్రైవర్ ఢీకొన్నాడు. ఈ సంఘటనలో బస్సులో ప్రయాణిస్తున్న 23 మందికి గాయాలయ్యాయి. వీరిని చికిత్స నిమిత్తం హైవే మొబైల్ సిబ్బంది గూడూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అందులో సామర్లకోటకు చెందిన అప్పారావు, క్లీనర్ సురేష్, డాన్ బాస్కోల పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో వీరిని మెరుగైన చికిత్స కోసం నెల్లూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. బస్సు డ్రైవర్ నిద్రమత్తు వల్లే ఈ సంఘటన చోటుచేసుకొందని బస్సులోని ప్రయాణికులు తెలిపారు. ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ధన దాహానికి ప్రజలు బలవుతున్నా ప్రభుత్వం స్పందించక పోవడం పట్ల ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల జెసి ట్రావెల్ బస్సు సంఘటనలో పలువురు మృతి చెందగా తాజాగా నెల్లూరు జిల్లా ఓజిలి సమీపంలో వరపుత్రా ట్రావెల్ బస్సు ప్రమాదానికి గురికావడం సర్వత్రా చర్చనీయాంశమైంది. ఈ బస్సు గత నెల 27న సామర్లకోట నుండి నాగూరు నాగపట్నంకు బయలుదేరి తిరుగు ప్రయాణంలో డ్రైవర్‌కు నిద్రలోకి జారుకోవడంతో ఆగివున్న లారీని ఢీకొంది. బస్సుకు డ్రైవర్ ఒకడే కావడం, మరో డ్రైవర్ లేకపోవడం వల్ల ఈ సంఘటన చోటు చేసుకొందని బస్సులోని ప్రయాణికులు చెప్పారు. డ్రైవర్‌కు విశ్రాంతి లేకుండా 5 రోజులు బస్సును నడపడం వల్ల ఈ సంఘటన చోటుచేసుకొందని దేవుని దయవల్ల గాయాలతో బయటపడినా చాలామందికి తీవ్ర గాయాలు కావడం తమను కలచి వేసిందని తోటి ప్రయాణికులు వాపోయారు. ఈ సమాచారం అందుకున్న ఓజిలి ఎస్సై సాంబశివరావు సంఘటన స్థలికి చేరుకొని గాయపడ్డ వారిని హైవే అంబులెన్స్ ద్వారా గూడూరు ప్రభుత్వ ఆసుపత్రికి చేర్పించి చికిత్స చేయించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

గాయపడిన వారిని పరామర్శించిన ఆర్డీవో
ఓజిలి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడి గూడూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని గూడూరు ఆర్డీవో పి అరుణ్‌బాబు పరామర్శించారు. వారికి ప్రభుత్వం తరుఫున అన్ని రకాల వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకొంటామన్నారు. ఈ ప్రమాదం జరగడం దురదృష్టకరమని, అదృష్టవశాత్తు గాయాలతో బయటపడటం అదృష్టమని అన్నారు. ఈ ప్రమాదంలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారికి గూడూరులోని శ్రీలక్ష్మీ ఛారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో వారికి భోజన సదుపాయాలను ఏర్పాటు చేశారు. ప్రమాదంలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారందరికి శ్రీలక్ష్మీ పిఎంరావు సహకారంతో ఉదయం రొట్టె, పాలు, మధ్యాహ్నం భోజన సదుపాయాలు ఏర్పాటు చేశారు.
1-జిడిఆర్-6రైటప్
ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని పరామర్శిస్తున్న ఆర్డీవో అరుణ్‌బాబు

సాయికృష్ణ యాచేంద్రకు పూర్వ విద్యార్థుల సన్మానం
వెంకటగిరి, ఏప్రిల్ 1: వెంకటగిరి రాజా సాయికృష్ణ యాచేంద్రకు 1964 సంవత్సరం పూర్వవిద్యార్థుల సంఘం శనివారం ఆర్వీఎం ఉన్నత పాఠశాలలో సన్మానం నిర్వహించారు. ఉగాది సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన కళారత్న పురస్కారాల్లో వెంకటగిరి రాజా సాయికృష్ణ యాచేంద్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు చేతులమీదుగా కళారత్న పురస్కారాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో పూర్వ విద్యార్ధులు సాయికృష్ణ యాచేంద్రను సన్మానం చేసి అభినందించారు. ఈ కార్యక్రమంలో పూర్వవిద్యార్ధులు చెంగల్‌రాయులు, సంజీవి, సుబ్బరాయమ్య తదితరులు పాల్గొన్నారు.
1విజి ఆర్ 1: సాయికృష్ణ యాచేంద్రను సన్మానిస్తున్న పూర్వవిద్యార్థులు