శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

నగదు రహిత ‘రేషన్’కు రూ .లక్ష బహుమతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు, ఏప్రిల్ 2: నగదు రహిత విధానంలో ప్రజాపంపిణీ సరుకులకు చౌకధరల దుకాణం ద్వారా మార్చినెలలో సరుకులు తీసుకున్న వారికి ప్రభుత్వం అందించే ప్రోత్సాహక బహుమతి జిల్లాలోని వింజమూరు గ్రామానికి చెందిన పైడాల శోభ అనే మహిళను వరించింది. మార్చి నెలలో నగదు రహితంగా చౌకధరల దుకాణం నుంచి సరుకులు తీసుకున్న వారికి సంబంధించిన డ్రాను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదివారం తీయగా జిల్లాకు చెందిన శోభకు రూ.లక్ష బహుమతి లభించినట్లు జిల్లా కలెక్టర్ ఆర్.ముత్యాలరాజు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇంకా 5వేల వరకు మొబైల్‌ఫోన్లను కూడా బహుమతి రూపంలో అందిస్తారన్నారు. ఈ డ్రా ప్రతి నెల జరుగుతుందని, బహుమతులు అందించడం జరుగుతుందని, ప్రతి ఒక్కరూ నగదు రహిత విధానంలో సరుకులు తీసుకోవాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఇంతియాజ్ అహ్మద్ కోరారు.

అంబరాన్ని అంటిన సంబరాలు
నెల్లూరు టౌన్, ఏప్రిల్ 2: రాష్ట్ర పొలిట్ బ్యూరో సభ్యులు ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డికి మంత్రి పదవి వచ్చినందుకు నగరంలోని టిడిపి కార్యాలయంలో టిఎన్‌ఎస్‌ఎఫ్ నాయకులు కాకర్ల తిరుమల నాయుడు ఆధ్వర్యంలో ఆదివారం భారీగా బాణసంచా పేల్చి సంబరాలు చేసుకున్నారు. ముందుగా దివంగత ముఖ్యమంత్రి ఎన్‌టిఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం విలేఖర్లతో మాట్లాడుతూ, పార్టీలో కష్టపడి పనిచేసేవారికి ఎప్పుడు గుర్తింపు ఉంటుందనేందుకు నిదర్శనమే సోమిరెడ్డికి మంత్రి పదవి రావడమని చెప్పార. ఈ సందర్భంలో సంబరాలు జరుపుకుంటున్నామన్నారు. ఈ కార్యక్రమంలో టిఎన్‌ఎస్‌ఎఫ్ నాయకులు, విద్యార్థులు, మహిళలు పాల్గొన్నారు.
నర్తకి సెంటరులో..
టిడిపి సీనియర్ నాయకులు మండవ రామయ్య ఆధ్వర్యంలో ఆదివారం నగరంలోని నర్తకీ సెంటర్‌లోగల ఎన్‌టిఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డికి మంత్రి పదవి వచ్చిన సందర్భంగా నగరంలో అధిక సంఖ్యలో మహిళలతో భారీ ర్యాలీ, బాణసంచాతో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మండవ రామయ్య మాట్లాడుతూ, పార్టీలో అలుపుఎరుగని నేత, కార్యకర్తలను వెన్నంటి ఉండే మహామనిషి సోమిరెడ్డికి మంత్రి పదవి రావడం సంతోషకరమన్నారు. అందుకే ఈ సంబరాలు జరుపుకుంటున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ధర్మవరపు సుబ్బారావు, కినె్నర ప్రసాద్, కార్యకర్తలు మహిళా కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.