శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

సోమిరెడ్డికి మళ్లీ మంత్రి పదవి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు, ఏప్రిల్ 2: ఎట్టకేలకు పార్టీ విధేయుడికి మళ్లీ అమాత్య పదవి లభించింది. అధికారపక్షంలో ఉంటే ప్రజాదక్షత, ప్రతిపక్షంలో ఉంటే ప్రభుత్వ విధానాలపై అలుపెరగని పోరాటం చేస్తూ జిల్లా తెలుగుదేశం పార్టీలో రెండు దశాబ్దాలుగా కీలక భూమిక పోషిస్తున్న ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ఆదివారం జరిగిన మంత్రివర్గ ప్రమాణ స్వీకారంలో మంత్రిగా ప్రమాణం చేశారు. దీంతో ఆయన సొంత నియోజకవర్గం సర్వేపల్లితో పాటు జిల్లా వ్యాప్తంగా ఆయన అభిమానులు, అనుచరులు, టిడిపి కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు. జిల్లా పార్టీ కార్యాలయంలో జిల్లా, నగర టిడిపి నాయకుల ఆధ్వర్యంలో సంతోష వేడుక నిర్వహించారు. సోమిరెడ్డికి మంత్రి పదవి రావడంపై హర్షం వ్యక్తం చేస్తూ బాణసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. సింగిల్ విండో చైర్మన్‌గా మొదలైన ఆయన రాజకీయ జీవితంలో ముచ్చటగా మూడోసారి మంత్రి పదవి అందుకోవడం విశేషం. 1996లో తొలిసారి మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన ఆయన 1999 ఎన్నికల్లో రెండోసారి సర్వేపల్లి ఎమ్మెల్యేగా గెలిచినప్పటికి అప్పటి రాజకీయ సమీకరణల్లో మంత్రి కాలేకపోయారు. అయితే ఎటువంటి నిరుత్సాహానికి గురి కాకుండా పార్టీనే పరమావధిగా భావిస్తూ నియోజకవర్గంతో పాటు జిల్లాలోనూ టిడిపి బలపడేందుకు తన వంతు ప్రయత్నాలు చేశారు. ఆయన విధేయతకు మెచ్చిన చంద్రబాబునాయుడు 2001లో జరిగిన మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణలో మళ్లీ మంత్రిగా అవకాశమిచ్చారు. 2004 నుండి టిడిపి ప్రతిపక్షంలో ఉన్నపుడు జిల్లా పార్టీ అధ్యక్షుడిగా దాదాపు పదేళ్లపాటు ఆయన పనిచేశారు. ఆ సమయంలో అధికార కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపైన తీవ్ర పోరాటం చేశారు. ముఖ్యంగా సోమశిల జలాలను ఇడుపులపాయకు మళ్లించడాన్ని నిరసిస్తూ ఆమరణ నిరాహారదీక్షకు దిగారు. ఇలా పలు సందర్భాల్లో పార్టీ ఉనికిని ప్రజల్లో కాపాడుకుంటూ వచ్చిన ఆయనకు 2014 ఎన్నికల్లో ఓటమి ఎదురైంది. గెలిచి ఉంటే తప్పక మంత్రి పదవి వచ్చే నేతల్లో ఒకరిగా సోమిరెడ్డి పేరొందారు. అనూహ్య ఓటమితో మరో రెండేళ్ల పాటు ఎమ్మెల్సీ అవకాశం వచ్చేదాకా ఆయన ఎదురుచూడాల్సి వచ్చింది.
జిల్లా మంత్రులిద్దరూ ఎమ్మెల్సీలే..
రాష్ట్ర మంత్రివర్గంలో జిల్లాకు ప్రాతినిధ్యం వహిస్తున్న పొంగూరు నారాయణ, సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డిలు ఇద్దరూ శాసనమండలి సభ్యులు కావడం విశేషం. రాష్ట్రంలో ఏ ఇతర జిల్లాలో ఈ పరిస్థితి లేదు. ఇద్దరు అంతకంటే ఎక్కువ మంది మంత్రులుగా ప్రాతినిధ్యం వహిస్తున్న అనంతపురం, చిత్తూరు, కర్నూలు, గుంటూరు, కృష్ణా, విశాఖపట్టణం తదితర జిల్లాలోనూ ఇలా ఇద్దరు ఎమ్మెల్సీలకు మంత్రి పదవి దక్కలేదు. ఈ విషయంలో నెల్లూరు జిల్లా రాజకీయంగా తన ప్రత్యేకతను చాటుకొంది. ప్రజా బ్యాలెట్‌లో ఎన్నికైన వారికి కాకుండా పరోక్షంగా చట్టసభలకు ఎన్నికైన ఇద్దరు వ్యక్తులకు మంత్రి పదవి చంద్రబాబునాయుడు ఇవ్వడం వెనుక వారి సమర్థతే కారణమనే అభిప్రాయం జిల్లా పార్టీ నాయకుల్లో వ్యక్తమవుతోంది.