శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

వాడావాడలా పల్స్‌పోలియో

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరుసిటీ, ఏప్రిల్ 2: పోలియో రహిత జిల్లాగా మార్చేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని డిఎంహెచ్‌ఓ వరసుందరం పిలుపునిచ్చారు. ఆదివారం జిల్లాలో జరిగిన పల్స్‌పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. నెల్లూరు నగరంలోని అన్ని ప్రాంతాల్లో పోలియో కేంద్రాలను ఏర్పాటు చేశారు. 0-5 సంవత్సరాల్లోపు ఉన్న పిల్లలను గుర్తించి పోలియో చుక్కలు వేశారు. పోలియో కేంద్రాలకు రాని వారిని గుర్తించి ఇంటింటికి తిరిగి చుక్కలు వేశారు. ముఖ్యంగా ఆర్టీసీ, రైల్వే స్టేషన్, బస్టాండ్ తదితర ప్రాంతాల్లో కూడా పోలియో కేంద్రాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు.
సహకారం... సమ్మె పాక్షికం
* సరిహద్దు జిల్లాలో యధావిధిగా తిరుగుతున్న లారీలు
నెల్లూరు, ఏప్రిల్ 2: గత నాలుగు రోజులుగా దక్షిణ భారతదేశ వ్యాప్తంగా జరుగుతున్న లారీల సమ్మె ప్రభావం నెల్లూరు జిల్లాలో పాక్షికంగా ఉంది. థర్డ్ పార్టీ ప్రీమియం రద్దు చేయడం, డీజిల్‌పై విధించిన వ్యాట్‌ను ఉపసంహరించుకోవడం, పెట్టుబడి వసూళ్లు పూర్తయిన టోల్‌గేట్లను ఎత్తివేయడం వంటి పలు న్యాయబద్ధమైన సమస్యల పరిష్కారం కోరుతూ గత నెల 31 నుండి దక్షిణాది రాష్ట్రాల్లో లారీ ట్రాన్స్‌పోర్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ పిలుపు మేరకు జిల్లాలో కూడా ఈ సమ్మె సాగుతోంది. అయితే ఇతర జిల్లాలతో పోలిస్తే నెల్లూరు జిల్లాలో ఈ లారీల సమ్మె పాక్షికంగానే కొనసాగుతుండడం గమనార్హం. జిల్లా విషయానికొస్తే జిల్లా లారీ యజమానుల సంఘం జిల్లాలో చేపట్టిన లారీల సమ్మెకు నేతృత్వం వహిస్తోంది. సిఐటియు, లారీ డ్రైవర్స్, క్లీనర్స్ అసోసియేషన్ తదితర యూనియన్లు ఈ సమ్మెకు మద్దతు ప్రకటించి లారీల యజమానులతో కలిసి జిల్లాలో లారీల నిరవధిక సమ్మెకు పిలుపునిచ్చాయి. జిల్లాలో సుమారు 5వేల వరకు లారీలు ఈ సమ్మె వలన నిలిచిపోయే అవకాశం ఉందని గ్రహించిన అధికార యంత్రాంగం ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ముందస్తు జాగ్రత్త చర్యలకు దిగింది. అయితే జిల్లాలో లారీల సమ్మె ప్రభావం అంతంతమాత్రంగానే ఉండటంతో అధికారులు ఊపిరి పీల్చుకుంటున్నారు. లారీల సమ్మె జిల్లాలో విజయవంతం కాకపోవడం వెనుక కొందరు లారీల యజమానులే కారణమనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. యూనియన్‌లో ఎటువంటి పదవి ఉన్నా లేకపోయినా కీలక పాత్ర పోషిస్తూ వచ్చే కొందరు లారీల యజమానులు ఈ సమ్మెకు తూట్లు పొడుస్తున్నారని, తమను మాత్రం సమ్మెలో భాగం చేస్తూ వారు మాత్రం అర్ధరాత్రి తమ వాహనాలను చెన్నైకు తిప్పుకుంటున్నారని ఒకటి, రెండు లారీలతో జీవనాధారంగా ఉన్న యజమానులు వాపోతున్నారు. నెల్లూరు సరిహద్దు జిల్లా కావడంతో ఇక్కడ్నుంచి చెన్నై, కేరళ తదితర ప్రాంతాలకు ధాన్యం స్మగ్లింగ్ ప్రతిరోజూ ఎటువంటి అంతరాయం లేకుండా సాగిపోతూ వస్తోంది. ఓ వైపు లారీల సమ్మె జరుగుతున్నప్పటికీ అర్ధరాత్రి లారీల ద్వారా జరిగే స్మగ్లింగ్ ఆగడం లేదు. ఏదో పగటి పూట యూనియన్ పేరుతో రోడ్లపైకి వచ్చి నాలుగు లారీలను నిలిపివేసి ఓ గంట ధర్నా చేసి చేతులు దులుపుకుని వెళ్లిపోతున్నారంటూ యూనియన్ నేతలపై కొందరు లారీల యజమానులు మండిపడుతున్నారు. ఆదివారం జాతీయ రహదారిపై కనుపర్తిపాడు కూడలి సమీపంలో లారీ యజమానుల సంఘం, సిఐటియు తదితర ట్రేడ్ యూనియన్లు కలిసి రహదారిపై ప్రయాణించే లారీలను నిలిపివేసి నిరసన వ్యక్తం చేశారు. ఓ గంటపాటు సాగిన ఈ తతంగం తర్వాత యధావిధిగా లారీలు తమ దారిన వెళ్లిపోవడం గమనార్హం. ఇలా లారీ యజమానుల్లో ఉన్న అనైక్యత వలన త్వరగా ప్రభుత్వం దిగివచ్చి తమ నిరసనకు సమాధానం చెప్పి తమ సమస్యలు పరిష్కరిస్తుందని భావించే పరిస్థితి కనిపించడం లేదని సమ్మెలో నిజాయితీగా పాల్గొంటున్న కొందరు యజమానులు వాపోతున్నారు. ఇటువంటి అంశాల నేపథ్యంలో జిల్లాలో లారీల సమ్మెకు బడా వ్యాపారుల నుంచి సహకారం కొరవడటంతో సమ్మె ప్రభావం పాక్షికంగా ఉంటోంది.