శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

ఆడపిల్లల చదువుకు అందరూ సహకరించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వేదాయపాళెం, ఏప్రిల్ 15: రాష్ట్రంలో బాల్య వివాహాలు అధికంగా జరుగుతున్నాయని, ఆడపిల్లల చదువుకు తల్లిదండ్రులు అందరూ సహకరించాలని జిల్లా విద్యాశాఖాధికారి మువ్వా రామలింగం పిలుపునిచ్చారు. నగరంలోని కస్తూరిదేవి బాలికల పాఠశాల ఆవరణలోని రవీంద్రనాథ్ ఠాగూర్ ఆడిటోరియంలో శనివారం 10వ తరగతి తర్వాత పెళ్లి వద్దు 11వ తరగతి అనే నినాదంతో పాఠశాల విద్యార్థినులకు, వారి తల్లిదండ్రులకు అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా డిఇఓ మువ్వా రామలింగం మాట్లాడుతూ బాల్యవిహహాల విషయంలో రాజస్థాన్ తరువాత మన రాష్ట్రం ఉందన్నారు. 10వ తరగతి పూర్తయిన తరువాత చాలామంది గ్రామీణ ప్రాంతాలలో ఆడపిల్లల తల్లిదండ్రులు వారికి పెళ్లి చేసేందుకు ప్రయత్నిస్తున్నారని, అది మంచి పద్ధతి కాదన్నారు. ఆడపిల్లల చదువుకు అందరూ సహకరించి వారి భవిష్యత్తుకు పునాదులు వేయాలని కోరారు. మార్చి 31వ తేదిన రాష్టవ్య్రాప్తంగా అన్ని కస్తూర్భాగాంధీ బాలికల విద్యాలయాలలో విజయవంతంగా అవగాహన కార్యక్రమం జరిగిందని, అదే స్ఫూర్తితో అన్ని పాఠశాలల్లో ఈ కార్యక్రమం పద్ధతి ప్రకారం నిర్వహించడం జరుగుతుందన్నారు. జిల్లాలో 15 నుంచి 24వ తేది వరకు అన్ని పాఠశాలల్లో ఈ అవగాహన సదస్సులు నిర్వహిస్తామన్నారు. అనాధ పిల్లలు, సంచార జాతుల పిల్లల కోసం సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల కోసం కస్తూర్భాగాంధీ విద్యాలయాల ద్వారా నాణ్యమైన రెసిడెన్షియల్ విద్యను అందించడం జరుగుతుందన్నారు. విద్యార్థినుల తల్లిదండ్రులు పిల్లల భవిష్యత్తును ఆలోచించి వారికి విద్యను అందించే విధంగా కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సర్వశిక్షా అభియాన్ పిఓ కనకనరసారెడ్డి తదితరులు అవగాహన కల్పించారు.