శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

నాసిరకంగా వెంకటాచలం - కసుమూరు రోడ్డు పనులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వెంకటాచలం, ఏప్రిల్ 15: వెంకటాచలం - కసుమూరు మార్గంలో రెండు లైన్ల రోడ్డు నిర్మాణానికి ప్రభుత్వం 5.5 కోట్లు మంజూరు చేసింది. గతంలో ఈ రోడ్డు ఒక రోడ్డుగా ఉండగా కసుమూరు గ్రామం ప్రముఖ పుణ్యక్షేత్రం కావడంతో ఇక్కడకు యాత్రికులు అధిక సంఖ్యలో వస్తుండటంతో రోడ్డు రద్దీగా మారింది. దీంతో కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ప్రత్యేక చొరవ తీసుకుని రెండు లైన్లు రోడ్డు నిర్మాణానికి అనుమతి తీసుకొచ్చారు. ఇందుకు 5.5 కోట్లు నిధులు విడుదల చేశారు. వెంకటాచలం నుంచి కసుమూరు వరకు మొత్తం 8 కిలోమీటర్ల తారురోడ్డు ఏర్పాటు చేయాల్సి ఉంది. అయితే వెంకటాచలం - కసుమూరు గ్రామాల మధ్య ఉన్న కనుపూరు గ్రామం లోపల నుంచి ఈ రోడ్డు వెళ్తుండటంతో కనుపూరు గ్రామం వరకు 800 మీటర్లు సిమెంట్ రోడ్డు నిర్మించాల్సి ఉంది. నిర్మాణ పనుల టెండర్ దక్కించుకున్న గుత్తేదారుడు నెల రోజుల కిందట వెంకటాచలం నుంచి తారురోడ్డు పనులు ప్రారంభించారు. ఈ పనులను కొంతవరకు చేసి ప్రస్తుతం 10 రోజుల నుంచి కనుపూరు గ్రామంలో సిమెంట్ రోడ్డు నిర్మాణ పనులు చేస్తున్నారు. ఇప్పటికే ఒకవైపు రోడ్డు వేయగా, ప్రస్తుతం రెండో లైను రోడ్డు పనులు ప్రారంభించారు. ఈ సిమెంట్ రోడ్డు నిర్మాణ పనులు అత్యంత నాశిరకంగా జరుగుతున్నాయి. కింద నుంచి సిమెంట్ లైనింగ్ వేయాల్సి ఉంది. నిబంధనల ప్రకారం ఇసుక, కంకరతో కలిపితే కొంత అధికంగా సిమెంట్ వేయాల్సి ఉంది. ప్రస్తుతం నిర్మించేది సిమెంట్ రోడ్డు కావటం, అది భారీ వాహనాలు తిరిగే మార్గం కావటంతో గ్రామాల్లో నిర్మించే అంతర్గత రోడ్డు నిర్మాణాల్లో ఉపయోగించే సిమెంట్ కన్నా అధికంగా వేయాల్సి ఉంది. అయితే గుత్తేదారుడు నిబంధనలు తుంగలో తొక్కి కేవలం ఇసుక, కంకర మాత్రమే వేసి నిర్మాణం జరుపుతున్నారు. నిర్మాణ పనులు రాత్రివేళల్లో శరవేగంగా పూర్తిచేస్తున్నారు. రోడ్డు పక్కన ఇళ్లు ఉన్న ప్రాంతంలో మాత్రం ఇసుక, కంకర, మిక్సింగ్‌పై సిమెంట్ పొడి చల్లి సిమెంట్ రోడ్డుగా భ్రమించే విధంగా చేస్తున్నారు. ప్రస్తుతం వేసిన సిమెంట్ రోడ్డును కనుపూరు గ్రామస్థులు చేతులతో ముట్టుకుంటేనే రాలిపోతుందంటే ఏ స్థాయిలో నాణ్యత లోపించిందో అర్థం చేసుకోవచ్చు. కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని వెచ్చించి నిర్మిస్తున్న రోడ్డు పనులను మాత్రం అధికారులు దగ్గరుండి పర్యవేక్షించాల్సి ఉండగా వారి నిర్లక్ష్య వైఖరి కారణంగా రోడ్డు పనులు నాసిరకంగా జరిగాయని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. సిమెంట్ రోడ్డు పనులు జరుగుతున్న సమయంలో అధికారులు పర్యవేక్షణకు సక్రమంగా రాలేదని గ్రామస్థులు తెలుపుతున్నారు. ఇదిలావుండగా రోడ్డు నిర్మాణ నాణ్యతపై కనుపూరు గ్రామస్థులకు అనుమానం రావటంతో శనివారం రోడ్డును పరిశీలించారు. శుక్రవారం రాత్రి సిమెంట్ రోడ్డు నిర్మాణంలో భాగంగా నిర్మించిన రోడ్డును చూసి వారు అవాక్కయ్యారు. సిమెంట్ రోడ్డును కాళ్లతో తొక్కగా ఎక్కడికక్కడ ఇరిగిపడిపోయింది. గ్రామస్థులు రోడ్డు పనులు పరిశీలిస్తున్న సమయంలో గుత్తేదారుడు హుటాహుటిన వచ్చి నాసిరకం రోడ్డును కప్పిపుచ్చేందుకు సిమెంట్, కంకర, ఇసుకతో మిక్సింగ్ చేసిన కాంక్రీట్‌ను ఆ రోడ్డుపై మరోసారి రోడ్డు వేసేందుకు ప్రయత్నించగా కనుపూరు గ్రామస్థులు అడ్డుకున్నారు. ఇంత నాసిరకంగా రోడ్డు నిర్మాణం చేయటం ఏమిటిని గుత్తేదారుడిని గ్రామస్థులు నిలదీశారు. ప్రస్తుతం పూర్తిచేసిన ఒకవైపు రోడ్డు నిర్మాణం కూడా నాసిరకంగానే జరిగిందని, ఇప్పటివరకు వేసిన రోడ్డును పూర్తిగా తొలగించి నిబంధనల మేరకు మళ్లీ రోడ్డు వేయాలని, అప్పటివరకు రోడ్డు నిర్మాణం నిలిపివేయాలని కనుపూరు గ్రామస్థులు ఆందోళనకు దిగారు.
నాసిరకంగానే రోడ్డు నిర్మాణం:డిఇ
రోడ్డు నిర్మాణ పనులను గ్రామస్థులు అడ్డుకుని ఆర్ అండ్ బి అధికారులకు సమాచారం అందించారు. గ్రామస్థులు ఇచ్చిన సమాచారం అందుకున్న ఆర్ అండ్ బి డిఇ మాల్యాద్రి, జెఇ ఖాదర్ బాషా హుటాహుటిన కనుపూరు గ్రామానికి చేరుకుని రోడ్డు పనులను పరిశీలించారు. ప్రస్తుతం జరుగుతున్న రెండో లైన్‌లో వేసింది నాసిరకమేనని తేల్చారు. అనంతరం జెఇ ఖాదర్ బాషా మాట్లాడుతూ నాసిరకంగా ఉన్న లేయర్‌ను పూర్తిస్థాయిలో తొలగించి నిబంధనల మేరకు రోడ్డును ఏర్పాటు చేయిస్తామని తెలిపారు. తాను నిత్యం పనులను పర్యవేక్షిస్తున్నామని, సొంత పనుల వల్ల శుక్రవారం రాలేదని, తాను లేని సమయంలో నాసిరకంగా నిర్మించారని ఆయన పేర్కొన్నారు.