శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

జిల్లాకు తెలుగుగంగ వరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వెంకటగిరి, ఏప్రిల్ 15: తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు పాలనలో నిర్మించిన తెలుగుగంగ ప్రాజెక్టు నెల్లూరు జిల్లాకు ఒక వరంలాంటిదని వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి అన్నారు. శనివారం వెంకటగిరి విచ్చేసిన ఆయన స్థానిక ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణను మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలుగుగంగను తమిళనాడు వాసుల కోసం ఏర్పాటు చేసినా అది నెల్లూరు జిల్లా రైతులకు ఒక వరం అనుకోవడంలో అతిశయోక్తి లేదన్నారు. వేలాది మంది రైతులు తెలుగుగంగ నీటి ద్వారా పంటలు పండించుకుంటున్నారని అన్నారు. రెండు, మూడు నెలలల్లో నెల్లూరు జిల్లాలో గూడూరు, వెంకటగిరి, సూళ్లూరుపేట ప్రాంతాల్లో మొత్తం రెండు లక్షల 30 వేల ఎకరాలకు తెలుగుగంగ నీటిని ఇవ్వబోతున్నట్లు చెప్పారు. సోమశిల స్వర్ణముఖి కాలువ పరిస్థితిపై సమీక్ష నిర్వహించినట్లు చెప్పారు. టిడిపి పాలనలో చంద్రన్న బీమా, అర్హులైన వారికి పింఛన్లు, గ్రామాల్లో సిమెంట్ రోడ్లు, కొత్త పింఛన్ల ఏర్పాటు, నీరు-చెట్టు ద్వారా అభివృద్ధి పనులు తాను ఊహించలేదని అన్నారు. ఈ పథకాలను అన్నింటిని మనందరం ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. అందరి ఆశీర్వాదంతో మళ్లీ 13 సంవత్సరాల తరువాత మంత్రిగా వచ్చానని, అందరికీ రుణపడి ఉంటానని అన్నారు. అనంతరం స్థానిక రాజా ప్యాలెస్‌కు వెళ్లి సాయికృష్ణ యాచేంద్ర, రాంప్రసాద్ యాచేంద్రను మంత్రి కలిశారు. ఈ సందర్బంగా మంత్రిని రాజాలు సన్మానించారు. అక్కడ నుంచి వెంకటగిరి గ్రామశక్తి పోలేరమ్మ ఆలయానికి చేరుకుని అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అక్కడ నుంచి జిల్లా పార్టీ ఉపాధ్యక్షులు, ఆర్టీసీ మాజీ చైర్మన్ చెలికం శంకరరెడ్డి నివాసానికి చేరుకున్నారు. అక్కడ 10 నిమిషాలు అందరితో మాట్లాడారు. అక్కడ నుంచి రేణిగుంట విమానాశ్రయానికి బయలుదేరి వెళ్లారు. ఆయన వెంట ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ, ఆత్మకూరు టిడిపి నేత కన్నబాబు, వెంకటగిరి మున్సిపల్ చైర్మన్ దొంతు శారద, వైస్ చైర్మన్ బీరం రాజేశ్వరరావు, జిల్లా కార్యదర్శి పులుకొల్లు రాజేశ్వరరావు, ఉపాధ్యక్షులు చెలికం శంకరరెడ్డి, పట్టణ తెలుగు యువత అద్యక్షులు కెవికె ప్రసాద్‌నాయుడు, పట్టణ పార్టీ నాయకులు కౌన్సిలర్లు, డక్కిలి మండలం ఎంపిపి వెంకటరెడ్డి, నాయకులు ఆదిరెడ్డి మల్లికార్జున్‌రెడ్డి, బాలాయపల్లి మండల నాయకులు రామచంద్రనాయుడు, మస్తాన్‌నాయుడు, సిసి నాయుడు తదితరులు ఉన్నారు.