శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

పొన్న వాహనంలో వేణుగోపాలుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు కల్చరల్, ఏప్రిల్ 15: మూలాపేటలోని రుక్మిణీ సత్యభామ సమేత శ్రీ వేణుగోపాలస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం పొన్న వాహనంలో వేణుగోపాలస్వామి విహరించారు. తొలుత తీర్థసేవ (ముసుగుల సేవ), స్నపనతిరుమంజనం కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు సంపత్‌కుమార్ స్వామి ఆధ్వర్యలో అర్చకుల బృందం రమాకాంత్ స్వామి, శ్రీనివాస అయ్యంగార్, నరసింహాచార్యులు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. నగరోత్సవంలో స్వామివారు విహరించే సమయంలో, స్వామిని దర్శించేందుకు భక్తులు పోటీ పడ్డారు. కనులారా స్వామివారిని దర్శించి భక్తులు మొక్కులు తీర్చుకున్నారు. ఆలయ మేనేజింగ్ ట్రస్టీ చైర్మన్ ఆనం చంద్రశేఖర్‌రెడ్డి, మేనేజర్ వి.గిరికృష్ణ కార్యక్రమాలను పర్యవేక్షించి భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. ధర్మకర్తలుగా వాసుదేవ్, చాట్ల రమణమ్మ, చాట్ల వెంకటస్వామి, నరసింహారావు, శ్రీనివాసులు, రామారావు వ్యవహరించారు.

వైభవంగా పుష్పయాగం
ముగిసిన శబరి శ్రీరామక్షేత్ర బ్రహ్మోత్సవాలు
నెల్లూరు కల్చరల్, ఏప్రిల్ 15: శబరి శ్రీరామక్షేత్రం బ్రహ్మోత్సవాలు శనివారం పుష్పయాగంతో ముగిశాయి. 12 రకాల పుష్పాలతో శ్రీ హనుమత్ సీతాలక్ష్మణ సహిత కోదండరామస్వామికి పుష్పయాగం వైభవంగా నిర్వహించారు. ఉదయం హోమంతో కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. అనంతరం పల్లకిసేవను కన్నుల పండువగా నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు రొంపిచర్ల భావనాచార్యులు ఆధ్వర్యంలో అర్చకుల బృందం శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించింది. ఉభయకర్తలుగా వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, ప్రశాంతి వ్యవహరించారు.