శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

నా బిడ్డల నుంచి రక్షించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆత్మకూరు, ఏప్రిల్ 28: ‘‘దాంపత్యం నుంచి విడిపోతే భార్యకు చట్టప్రకారం భర్త ఎలా భరణం చెల్లిస్తారో... వృద్ధాప్యానికి చేరిన తల్లిదండ్రులను కూడా అలాగే భరణంగా చెల్లించి వారిని పోషించాల్సిందేనని వివిధ సంస్కరణల అనంతరం భారత న్యాయశాస్త్రం చెపుతోంది. కుమారులు ఇద్దరు, ఆపై ఉండటంతో సహా వారి వ్యక్తిగత ఆర్థిక పరిస్థితుల్లో వ్యత్యాసాలున్నా ఒకరిపై మరొకరు చెప్పుకుంటూ జీవిత చరమాంకానికి చేరిన తల్లిదండ్రుల పోషణ నుంచి తప్పించుకోవడం తగదనేది కూడా న్యాయశాస్త్రం సవివరణ. అయితే వయస్సు మీరిన తల్లిదండ్రులను పోషించడం లేదు సరికదా వారి జరుగుబాటుకు ఆసరాగా ఉంచుకున్న సొమ్మును కూడా పదేపదే దాడులకు పాల్పడుతూ గుంజుకుంటున్న కొడుకుల వైనమిది. కంటికి రెప్పలా పెంచి పోషించి మంచి జీవితాలు ఇచ్చినా కడకు వృద్ధాప్యంలో చేరిన తనను చిత్రహింసలకు గురి చేస్తున్నారంటూ ఆ బాధిత తండ్రి ఆత్మకూరు పోలీస్ స్టేషన్‌లో గోడు వెళ్లబోసుకున్నారు. ప్రాణానికి ప్రాణంగా బిడ్డల్ని పెంచి పెద్దవారిని చేయడంతో సహా మంచి జీవనగమనం కల్పించినా కడకు తన జీవితమే అంతం చేయాలని నిత్యం దౌర్జన్యం చేస్తున్నారని వాపోయారు. బిడ్డల వల్ల కలిగే ప్రాణ హాని నుంచి కాపాడాలని వేడుకున్నాడు. బావురుమంటూ వచ్చిన బాధిత తండ్రి కథనాన్ని విని చలించిన ఆత్మకూరు సబ్ ఇన్‌స్పెక్టర్ ఎం పూర్ణచంద్రరావు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు నిర్వహిస్తున్నారు.’’
ఆత్మకూరు మండలం దేపూరు గ్రామానికి చెందిన కుక్కపల్లి ఆదెయ్య అనే రైతుకు ఇరువురు కుమారులు, నలుగురు కుమార్తెలు సంతానం. అందరికీ పెళ్లిళ్లు చేసి మంచి పరిస్థితే కల్పించాడు. తనకున్న 15.24 ఎకరాల పొలాన్ని కుమారులిద్దరికీ చెరో ఏడు ఎకరాల వంతున అందచేశాడు. అయితే కుమారులిద్దరూ అయోగ్యులుగా మారి తండ్రి నుంచి వచ్చిన భూమిని దుర్వ్యసనాలతో మొత్తం కరిగిపోయేలా చేసుకున్నారు. ఈక్రమంలో తల్లిదండ్రుల పోషణ చూసే వారు సైతం కరువయ్యారు. దీంతో ఆదెయ్య తన వద్ద మిగిలిన 1.24 ఎకరాల పొలాన్ని నాలుగున్నర లక్షల రూపాయలకు ఆరు మాసాల క్రితం విక్రయించుకుని దానిపై ప్రతి నెలా వచ్చే వడ్డీ సొమ్ముతో భార్యతో కలసి జీవిస్తున్నాడు. ఆయన భార్య కొన్నాళ్ల క్రితం నుంచి దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తురాలు కావడంతో అవసాన దశకు చేరుకుంది. భర్త ఆదెయ్య ఎలాగో తనకు వచ్చే వడ్డీ మొత్తానే్న ఆసరా చేసుకుని జీవిస్తున్నా కుమారులు దౌర్జన్యాలు మాత్రం వీడటం లేదు. తండ్రి వడ్డీగా డిపాజిట్ చేసిన సొమ్మును కూడా తమకే కావాలంటూ పదే పదే దాడులకు పాల్పడుతున్నారు. దీనస్థితికి చేరుకున్న ఆదెయ్యను కొడుకులతోపాటు కోడళ్లు కూడా హింసిస్తున్నారు. నాలుగురోజుల క్రితం ఆదెయ్య ఇంటిలోకి నీరు తెచ్చుకుందామని బావి వద్దకు వెళ్లిన సమయంలో చిన్న కుమారుడు, కోడలు కర్రతో కొట్టి గాయపరిచారు. ఈ సంగతి తెలుసుకుని ఇతర గ్రామాల్లో ఉన్న ఆదెయ్య కుమార్తెలు కర్ణం సునీత, పువ్వాడి శ్రీదేవి దేపూరుకు చేరుకుని అన్నావదెనల తీరుపై తీవ్రంగా తప్పుబట్టారు. డబ్బుకు లోకం దాసోహం అనేలా పలువురు బంధువులు సైతం రాబంధుల్లా ఆదెయ్యకు వ్యతిరేకంగా, అతని కుమార్తెలు, అల్లుళ్లపై వివాదానికి వచ్చారు. కోడలి తరపున బంధువులు ఇలా వ్యతిరేకంగా వ్యవహరించడంతో ఇదే సందర్భంలో వివాదం పెద్దదిగా మారింది. ఇదే సందర్భంలో అందరి ముందూ ఆదెయ్యను కుమారుడు కృష్ణయ్య రోకలితో గట్టిగా మోదాడు. దీంతో కుమార్తెలు ఆయనను ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించడంతో సహా పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి ఫిర్యాదు చేయించారు. ఏదేమైనా తన కుమారుల వల్ల కలుగుతున్న ప్రాణహాని నుంచి కాపాడాలని బాధిత తండ్రి పోలీస్ స్టేషన్ వద్ద వేడుకోవడం చూపరులను సైతం కంటతడి పెట్టించేలా చేసింది.

లంచం కేసులో సీనియర్ అసిస్టెంట్‌కు రెండేళ్లు జైలు శిక్ష
నెల్లూరు లీగల్, ఏప్రిల్ 28: ఫిర్యాదికి సంబంధించిన జీతాల అరియర్స్ బిల్లును త్వరగా మంజూరు చేయటానికి గాను లంచం డిమాండ్ చేసి తీసుకున్నాడని నమోదైన కేసులో నిందితుడు తిరుపతి సబ్ డివిజనల్ ట్రెజరీ కార్యాలయ సీనియర్ అసిస్టెంట్ కడియాల మునిరత్నంపై ఆరోపణలు సాక్ష్యాధారాలతో రుజువైనందున అతనికి రెండేళ్లు జైలు శిక్ష, పది వేల రూపాయల జరిమానా విధిస్తూ నెల్లూరు ఎసిబి కోర్టు స్పెషల్ జడ్జి శుక్రవారం తీర్పు చెప్పారు. కేసు వివరాలు ఇలా ఉన్నాయి. ఫిర్యాది పి యశోధర ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సూపర్‌వైజర్‌గా పనిచేస్తుండేది. ఈమె తిరుమతి మంగళం సమీపంలోని ముత్యాలరెడ్డిపల్లిలో విధులు నిర్వహించేది. కాగా, ఆమెకు తన జీతానికి సంబంధించి అరియర్స్ పైకం నాలుగు లక్షల 50 వేల రూపాయల బిల్లు తిరుపతి ట్రెజరీ కార్యాలయంలో మంజూరు కావల్సి ఉంది. అందుకుగాను ఫిర్యాది యశోధర సంబంధిత వ్యవహారాలను ట్రెజరీ కార్యాలయంలో నిర్వహించే సీనియర్ అసిస్టెంట్ మునిరత్నంను కలిసింది. ఆ బిల్లు మంజూరు చేయటానికి గాను అతను పది వేల రూపాయలు లంచంగా ఇవ్వమని డిమాండ్ చేశాడు. లంచం పైకంలో అడ్వాన్సుగా ఐదు వేల రూపాయలు మరో నిందితుడు అరవ శ్రీనివాసుల ద్వారా ప్రధాన నిందితుడు మునిరత్నంకు అందజేసింది. ఈనేపథ్యంలో 2011 సెప్టెంబర్ 13న లంచం స్వీకరిస్తున్న నిందితులను సంబంధిత ఎసిబి పోలీసులు చాకచక్యంగా పట్టుకొని అరెస్టు చేసి వారిపై కేసు నమోదు చేసి చార్జిషీటు దాఖలు చేశారు. కేసు విచారణ అనంతరం న్యాయమూర్తి మొదటి నిందితుడు మునిరత్నంకు పైమేర జైలు శిక్ష విధించారు. రెండో నిందితుడు అరవ శ్రీనివాసులపై ఆరోపణలు రుజువు కానందున ఆయనపై కేసు కొట్టివేశారు. ఈ కేసును ప్రాసిక్యూషన్ తరఫున స్పెషల్ పిపి సుబ్బయ్య వాదించారు.