నెల్లూరు

ఇసుక తరలింపులో అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు:ఎస్పీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోట, మార్చి 22: ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత ఇసుక రవాణాలో ఎలాంటి అక్రమాలకు పాల్పడినా కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ విశాల్ గున్ని హెచ్చరించారు. కోట మండలం పుచ్చలపల్లి గ్రామం వద్ద ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇసుకరీచ్‌ను మంగళవారం ఎస్పీ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల అవసరాల దృష్ట్యా ప్రభుత్వం ఉచిత ఇసుక కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు. అవసరమైన ప్రతిఒక్కరు వారి అవసరాలకు ఇసుకను తరలించుకోవచ్చన్నారు. అయితే ఉచిత ఇసుక రవాణాలో ఎలాంటి అక్రమాలు పాల్పడకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ఇసుక అక్రమ రవాణాను అరికట్టేందుకు జిల్లా సరిహద్దు ప్రాంతమైన తడ వద్ద చెక్‌పోస్టు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇసుకను అక్రమంగా తరలించేందుకు సాహసం చేయవద్దన్నారు. ఇసుకను అక్రమంగా తరలించేవారు ఎంతటివారైనా వదిలిపెట్టే ప్రసక్తేలేదని, అలాంటి వారికి భారీ జరిమానాతో పాటు, జైలుశిక్ష కూడా ఉంటుందని ఆయన హెచ్చరించారు. ఎస్పీ వెంట గూడూరు డిఎస్పీ బి శ్రీనివాస్, వాకాడు సిఐ పి అక్కేశ్వరరావు, తహశీల్దార్ బి లీలారాణి, కోట, వాకాడు ఎస్సైలు అజయ్‌కుమార్, సుధాకర్ ఉన్నారు.