శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

ఇ-పాస్ అమలుతో జిల్లాలో 130 కోట్ల ఆదా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు, ఏప్రిల్ 29: జిల్లాలో ఇ-పాస్ విధానం ద్వారా చౌకదుకాణాల్లో రేషన్ సరుకులు పంపిణీ చయడం వలన ఏప్రిల్ నెలాఖరు నాటికి 130 కోట్ల రూపాయల మేర ఆదా జరిగిందని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎఎండి ఇంతియాజ్ అహ్మద్ తెలిపారు. శనివారం జడ్పీ సమావేశ మందిరంలో పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యలో నిర్వహించిన జిల్లా స్థాయి ఆహార సలహా సంఘ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ జిల్లాలో మొత్తం 8,67,504 రేషన్‌కార్డులు ఉన్నాయని, అందులో అన్నపూర్ణ కింద 724, అంత్యోదయ అన్నయోజన పథకం కింద 58,793, తెల్లకార్డులు 8,07,987 ఉన్నాయని వివరించారు. 2016 నాటికి తొలి విడతగా 54,081 రేషన్‌కార్డులు మంజూరు చేయగా, జనవరిలో జరిగిన జన్మభూమి కార్యక్రమం ద్వారా రెండో విడతగా 43,970 తెల్లరేషన్ కార్డులు అందించామన్నారు.
అదేవిధంగా జిల్లాలో 1896 చౌక దుకాణాలు ఉన్నాయని, అందులో ఎస్సీ- 342, ఎస్టీ- 75, వికలాంగులు- 50, గిరిజన కార్పొరేషన్- 11, సహకార సంఘాలు- 18, డ్వాక్రా- 1, మైనార్టీలు- 72, బిసి- 525, ఓసి- 641 దుకాణాలు నిర్వహిస్తున్నట్లు తెలియచేశారు. జిల్లావ్యాప్తంగా 121 దుకాణాలు ఖాళీగా ఉన్నాయని, వీటిని ఆహార సలహా సంఘ సమావేశంలో నియమించాల్సి ఉందన్నారు. రాష్ట్రాన్ని కిరోసిన్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడంలో భాగంగా దీపం పథకం కింద గ్యాస్ కనెక్షన్లు మంజూరు చేస్తున్నట్లు, లబ్ధిదారులు ముందుకు వచ్చి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. దీపం కనెక్షన్‌కు సంబంధించి ఎటువంటి డిపాజిట్ చెల్లించాల్సిన అవసరం లేదన్నారు. జిల్లాలో మొత్తం 65 గ్యాస్ ఏజెన్సీలు ఉన్నాయన్నారు. రేషన్ కార్డుల ఆధార్ సీడింగ్ ప్రక్రియ 99.75 శాతం పూర్తయిందని, గ్యాస్ కనెక్షన్ల సీడింగ్ 96.01 శాతం సాధించినట్లు తెలిపారు. ధాన్యం కొనుగోలుకు సంబంధించి జిల్లాలో 48 కేంద్రాల ద్వారా కొనుగోలు నిర్వహించడం జరుగుతోందన్నారు. ఈ సమావేశంలో డిఎస్‌ఓ టి ధర్మారెడ్డి, నెల్లూరు, గూడూరు, కావలి, నాయుడుపేట ఆర్డీవోలు వెంకటేశ్వర్లు, అరుణ్‌బాబు, భక్తవత్సలరెడ్డి, శ్రీనానాయక్, ఆహార సలహా సంఘ సభ్యులు పాల్గొన్నారు.
రూ 3 కోట్లతో దర్గా ఆర్చ్ నిర్మాణం
* మేయర్ అబ్దుల్ అజీజ్ వెల్లడి
నెల్లూరుసిటీ, ఏప్రిల్ 29: బారాషాహిద్ దర్గా ప్రధాన ఆర్చ్ నిర్మాణ పనులను 3కోట్ల రూపాయలతో చేస్తున్నట్లు నగర మేయర్ అబ్దుల్ అజీజ్ తెలిపారు. శనివారం బారాషాహిద్ దర్గా ప్రధాన మార్గానికి నిర్మించనున్న ఆర్చ్ నమూనాలను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నగరంలో జరిగే రొట్టెల పండుగకు దేశ వ్యాప్తంగా భక్తులు తరలి వస్తున్నారని చెప్పారు. ఆధ్యాత్మిక భావన, మెరుగైన సౌకర్యాలతో ఏటా భక్తుల సంఖ్య పెరుగుతోందన్నారు. చారిత్రక నేపధ్యం కలిగిన దర్గా విశిష్టతను పెంచేందుకు ప్రధాన మార్గంలో ఆర్చ్ నిర్మిస్తామని చెప్పారు. పురాతన కట్టడాలను పరిరక్షించే జిఆర్టి మెటీరియల్‌ను నిర్మాణంలో ఉపయోగించనున్నట్లు వెల్లడించారు. 70అడుగుల వెడల్పు, 40 అడుగుల ఎత్తుతో నిర్మించనున్న ఆర్చ్‌కు సుమారు 3కోట్ల రూపాయలు వెచ్చించినున్నట్లు తెలిపారు. ఇస్లామిక్ సంప్రదాయ రీతిలో ఆర్చ్ డిజైన్ నిర్మాణ శైలి గురించి స్థానిక మతపెద్దలతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దర్గా అభివృద్ధికి 20కోట్ల రూపాయలను మంజూరు చేశారన్నారు. కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు 30కోట్ల రూపాయలను నెల్లూరు చెరువు అభివృద్ధి, ట్యాంక్‌బండ్ నిర్మాణానికి అందచేశారని పేర్కొన్నారు. దర్గాలో పచ్చదనం పెంచి పార్కులో వసతులు ఏర్పాటు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు ననే్నసాహెబ్, జాకీర్, సుబహాన్ తదితరులు పాల్గొన్నారు.