శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

నటులకు రంగస్థలమే వేదిక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బుచ్చిరెడ్డిపాళెం, ఏప్రిల్ 21: ప్రసిద్ధిగాంచిన ప్రతి నటునికి రంగస్థలమే వేదికని ప్రముఖ తెలుగు సినీ హాస్యనటుడు వేణుమాధవ్ పేర్కొన్నారు. మండల కేంద్రమైన బుచ్చిరెడ్డిపాళెంలో కళాసాగర్ ఆధ్వర్యంలో జరుగుతున్న జాతీయస్థాయి నాటక పోటీల ప్రారంభ సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నటులకు రంగస్థలం నుండే నటన ప్రారంభమవుతుందని అన్నారు. రంగస్థలం వేదికగా వచ్చిన ప్రతి నటుడు జాతీయస్థాయి అవార్డులు అందుకున్నారని తెలిపారు. రోజురోజుకు రంగస్థల ప్రాముఖ్యం అడుగంటుతున్న ఈ రోజుల్లో సైతం నాటక పోటీలు నడుపుతున్న కళాసాగర్ నిర్వాహకులకు ఆయన అభినందలు తెలిపారు. తాను కూడా రంగస్థల నటుడుగానే తన నటనా జీవితాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. అనంతరం ఆయన పలు సినిమాల్లోని హాస్యానికి చెందిన డైలాగులు చెప్పి ప్రేక్షకులను అలరించారు. వైకాపా రాష్ట్ర ప్రధానకార్యదర్శి నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్రంలోని కళాకారులను కళాసాగర్ నిర్వాహకులను అభినందించారు. జిల్లా పరిషత్ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి మాట్లాడుతూ, ప్రతిఏటా ఎంతో శ్రమకోర్చి నాటక పోటీలు నిర్వహించడం బుచ్చిరెడ్డిపాళెం కళాసాగర్‌కే చెందిందని అన్నారు. ఇండోర్ స్టేడియం నిర్మాణానికి తనవంతు సహాయం చేస్తానని హామీ ఇచ్చారు. ఆత్మకూరు శాసనసభ్యులు మేకపాటి గౌతమ్‌రెడ్డి మాట్లాడుతూ, జాతీయ స్థాయి నాటికలు నిర్వహించి ప్రజలకు ఉత్సాహాన్ని ఆనందాన్ని పంచుతున్న కళాసాగర్‌ని ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో కళాసాగర్ వ్యవస్థాపక అధ్యక్షులు దొడ్ల రమణయ్య యాదవ్, వవ్వేరు రూరల్ బ్యాంకు అధ్యక్షులు సూరా శ్రీనివాసులరెడ్డి, వైకాపా మండల కన్వీనర్ టి మల్లికార్జున్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.