శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

కామాక్షీదేవి అలంకారంలో అమ్మవారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంగం, సెప్టెంబర్ 21: దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా సంగం మండల కేంద్రంలోని శ్రీ కామాక్షీదేవి సమేత సంగమేశ్వరాలయంలో గురువారం అమ్మవారు కామాక్షీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారిని పరిమళ పుష్పాలతో అలంకరించి, విశేష పూజలు చేశారు. ఇరిగేషన్ ఎఇ శివకుమార్‌రెడ్డి, అరుణకుమారి దంపతులు ఈ కార్యక్రమానికి ఉభయకర్తలుగా వ్యవహరించారు. భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్ధప్రసాదాలు స్వీకరించారు.
వైభవంగా లలితా రుద్ర మహాయజ్ఞం
దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా గురువారం సంగం మండల కేంద్రంలోని తిరుమనకొండపై వెలసిన శ్రీ రాజరాజేశ్వరీదేవి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారిని పరిమళ పుష్పాలతో అలంకరించి, విశేష పూజలు చేశారు. అనంతరం రాజరాజేశ్వరానంద స్వామివారు లోకకళ్యాణం, సమృద్ధి వర్షాల కోసం లలితా రుద్ర మహాయజ్ఞాన్ని నిర్వహించారు. సుగంద ద్రవ్యాలతో వైభవంగా యజ్ఞాన్ని సాగించారు. అనంతరం భక్తులు అమ్మవారిని దర్శించుకుని తీర్ధప్రసాదాలు స్వీకరించారు.

హామీలను విస్మరించిన టిడిపి
వైకాపా జిల్లా అధ్యక్షుడు కాకాణి విమర్శ
మనుబోలు, సెప్టెంబర్ 21: గత ఎన్నికల్లో తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఇచ్చిన హామీలను విస్మరించారని వైకాపా జిల్లా అధ్యక్షుడు, సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి విమర్శించారు. రాష్ట్రంలో చేపట్టిన ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో గత ఎన్నికల మేనిఫెస్టోతో ప్రజలకు వద్దకు వెళ్లే ధైర్యం ఆపార్టీ నాయకులకు ఉందా? అని ప్రశ్నించారు. గురువారం ఆయన స్థానిక పంచాయతీ పరిధిలోని యాచవరం గ్రామంలో ఇంటింటికి వెళ్లి నవరత్నాలపై ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన విలేఖరులతో మాట్లాడుతూ ఎన్నికల సమయంలో నిరుద్యోగ భృతి, రైతు రుణమాఫీ, పొదుపు మహిళల రుణమాఫీ, ప్రతి మహిళకు సెల్‌ఫోన్, పేదలకు పక్కా ఇండ్లు, ఇంటికో ఉద్యోగం వంటి పలు హామీల అమలు గురించి ఇంటింటికి వెళ్లి ప్రజలను అడిగితే ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని చెబుతున్నారన్నారు. దివంగత రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలతో ఆయన ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారన్నారు. జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా వస్తే అటువంటి స్వర్ణయుగం వస్తుందని ప్రజలు విశ్వసిస్తున్న విషయం తమ ప్రచారంలో కనబడుతోందన్నారు. తెలుగుదేశం పార్టీ చేపట్టిన ఇంటింటి ప్రచారంలో మళ్లీ మోసం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఆయన వెంట సర్పంచ్ కంచి పద్మమ్మ, ఎంపిటిసి చల్లా చెంచమ్మ, మండల వైఎస్‌ఆర్‌సిపి నాయకులు పచ్చిపాల జయరామిరెడ్డి, చిట్టమూరు అజయ్‌కుమార్‌రెడ్డి, బొమ్మిరెడ్డి వెంకురెడ్డి, చేవూరు ఓసూరయ్య, గుమ్మడి వెంకటసుబ్బయ్య, దండు చంద్రశేఖర్‌రెడ్డి, చల్లా నవకోటి, ప్రదీప్‌రెడ్డి, మనె్నమాల సుధీర్‌రెడ్డి, రావుల అంకయ్య గౌడు, దాసరి మహేంద్రవర్మ, కడివేటి చంద్రశేఖర్‌రెడ్డి, చల్లా నవకోటి, జిల్లా బిసి సెల్ అధ్యక్షుడు దాసరి భాస్కర్‌గౌడు, రాష్ట్ర వైకాపా విద్యార్థి విభాగం కార్యదర్శి తులసియాదవ్ తదితరులు ఉన్నారు.