శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

సిఎం హామీలు నీటి మూటలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గూడూరు, సెప్టెంబర్ 21: స్వచ్ఛ్భారత్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మూడేళ్లు దాటిపోతున్న తరుణంలో గత మూడేళ్ల నుంచి పారిశుద్ధ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నట్లు చెప్పుకుంటున్న ప్రభుత్వం తాజాగా స్వచ్ఛతే సేవ అనే కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకొచ్చింది. ఈ నేపథ్యంలో గూడూరులో పారిశుద్ధ్యం మెరుగుకు తీసుకున్నది కంటి తుడుపు చర్యలేనని విమర్శలు ఉన్నాయి. ఏ వార్డులో చూసినా ఏమున్నది గర్వకారణం, పట్టణమంతా మురికిమయం అన్నట్లుగా గుడ్ ఊరు కాస్తా బ్యాడ్ ఊరుగా రూపాంతరం చెందుతున్నా ఇక్కడి పాలకుల్లో చలనం లేకపోవడంతో పట్టణమంతా విష జ్వరాలతో ప్రజలు అల్లాడిపోతున్నారు. కనీసం గూడూరు పురపాలక సంఘంలో 33 వార్డులు ఉండగా అందులో 27 మురికివాడలు ఉన్నాయి. ఇందులో నిత్యం పారిశుద్ధ్యం పనులు చేయాల్సిన సిబ్బంది అధికారుల పర్యవేక్షణ లేక నామమాత్రంగా నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవలే మున్సిపల్ కాంట్రాక్టు కార్మికుడు అనారోగ్యంతో బాధపడి మృతి చెందిన విషయం విదితమే. ప్రస్తుతం పట్టణంలో మలేరియా, డెంగ్యూ, టైఫాయిడ్ వంటి వ్యాధులు ప్రబలుతున్నాయి. డెంగ్యూతో సమీప ప్రాంతాల్లో ఇద్దరు ముగ్గురు మృత్యువాత పడి ఉన్నా ఇక్కడి పాలకవర్గంలో పారిశుద్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్న ఆలోచన లేకుండా కేవలం మాటలకు, ప్రచార ఆర్భాటాలతో సరిపెడుతున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. 2015వ సంవత్సరం వరదల సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అర్ధరాత్రి గూడూరు పర్యటన నామమాత్రంగా చేసిన సమయంలో ప్రజలు తమ గోడు వెళ్లబోసుకున్న సమయంలో పారిశుద్ధ్యానికి పెద్దపీట వేస్తామన్న హామీ నెరవేరకపోగా ఆయన హామీలు నీటి మూటలయ్యాయని వైకాపా నేతలు విమర్శిస్తున్నారు. ప్రతి ఇంట్లో పగలు, రాత్రి తేడాలేకుండా దోమలు స్వైరవిహారం చేస్తూ ప్రజలను కంటి మీద కునుకు లేకుండా చేస్తూ రోగాల పాల్జేస్తున్నాయి. పట్టణంలో అభివృద్ధి మాట దేవుడెరుగు కనీసం తమకు ఓట్లేసి గెలిపించిన ప్రజల ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని వైకాపా కౌన్సిలర్లు అంటున్నారు. కనీసం మురుగునీటి కాలువల్లో మురుగు తీయలేని దుస్థితిలో గూడూరు పురపాలక సంఘం ఉందా అని వారు ప్రశ్నిస్తున్నారు. ఇదిలాఉంటే గూడూరు పురపాలక సంఘానికి చెల్లిస్తున్న పన్నులే కాకుండా స్వచ్ఛ్భారత్ పన్నుల పేరుతో వసూలు, ప్రచార ఆర్భాటాలతో మొత్తం స్వచ్ఛమైపోతుందని ప్రజలను భ్రమలో పడేయటం ఎంతవరకు సమంజసమని వైకాపా కౌన్సిలర్లు నాసిన నాగులు, చోళవరం గిరిబాబు ప్రశ్నించారు. ముందు ప్రజల నుంచి మనం వసూలు చేస్తున్న డబ్బుతో కనీసం కాలువల్లో మురుగు తీసి ప్రజలపై దోమల దండయాత్ర జరగకుండా చేయండని, పైపై మెరుగులు దిద్దే మేకప్ పనులు కాకుండా మురికివాడలపై దృష్టి సారించి ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని వారు ఈ సందర్భంగా కమిషనర్‌ను కోరారు.