శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

తెలుగుదేశంపార్టీ సెంట్రల్‌కమిటీలో మళ్లీ జిల్లా నేతలకు స్థానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు,సెప్టెంబర్ 23: జిల్లాకు చెందిన రాష్ట్ర అటవీశాఖమంత్రి శిద్దా రాఘవరావు, శాసనమండలి సభ్యులు మాగుంట శ్రీనివాసులరెడ్డికి మళ్లీ తెలుగుదేశంపార్టీ జాతీయకమిటీలో సముచిత స్థానం దక్కింది. గతంలో ఉన్న తెలుగుదేశంపార్టీ జాతీయ కోశాధికారిగా మంత్రి శిద్దా రాఘవరావు, ఉపాధ్యక్షుడిగా మాగుంట శ్రీనివాసులరెడ్డిలు పనిచేశారు. మళ్ళీవీరికే తెలుగుదేశంపార్టీ జాతీయ అధ్యక్షుడు ఎన్ చంద్రబాబునాయుడు పట్టం కట్టారు. దీంతో జిల్లాకు జాతీయ, రాష్టస్ధ్రాయిలో చంద్రబాబు మంచి గుర్తింపు ఇచ్చినట్లైంది. ప్రధానంగా తెలుగుదేశంపార్టీ జాతీయ కోశాధికారిగా మంత్రి శిద్దా రాఘవరావుఎనలేని సేవ చేశారు. పార్టీపురోభివృద్దికి తనవంతు జిల్లా, రాష్ట్ర స్ధాయిలో కృషిచేస్తూనే ఉన్నారు. మంత్రి శిద్దా పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబుకు అపారమైన నమ్మకం ఉండటంతో జాతీయ స్ధాయిలో అత్యంతకీలకమైన కోశాధికారి పదవీని మళ్లీ కట్టబెట్టారంటే ఆయనపై ఎంతో నమ్మకం ఉందో ఇట్టే అర్ధంచేసుకోవచ్చు. 2014 ఎన్నికల్లో దర్శి నియోజకవర్గం నుండి పోటీచేసిన శిద్దా రాఘవరావు గెలుపొందిన వెంటనే అత్యంత కీలకమైన రాష్ట్ర రోడ్లు,్భవనాలు, రవాణాశాఖ పదవులను ముఖ్యమంత్రి కట్టబెట్టారు. రెండుశాఖలకు మంత్రిగా శిద్దా పనిచేస్తూ ఆశాఖల్లో ఏలాంటి అవినీతి జరగకుండా జవాబుదారితనంగా వ్యవహరించారు. దర్శి నియోజకవర్గంలో కోట్లాది రూపాయల నిధులను తీసుకువచ్చి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్దిచేయటం జరిగింది.అదేవిధంగా ఇటీవల జరిగిన మంత్రివర్గవిస్తరణలోను శిద్దాకు సముచిత స్థానాన్ని కల్పిస్తూ అటవీ, పర్యావరణ శాఖల మంత్రిగా నియమించారు. దీంతో రెండుసార్లు ముఖ్యమంత్రి విస్తరించిన మంత్రివర్గంలో శిద్దాకు సముచిత స్థానానే్న కల్పించారు.
ఇదిలా ఉండగా శిద్దా రాఘవరావు తెలుగుదేశంపార్టీ నుండి అంచెలంచెలుగా ఎదిగా జాతీయస్థాయి నాయకుడిగా పేరు గడిస్తున్నారు. గతంలో ఒంగోలు నియోజకవర్గం నుండి తెలుగుదేశంపార్టీ తరపున పోటీచేసి ఓటమి పాలైనప్పటికీ ఎలాంటి ఆందోళన చెందకుండా దర్శి నియోజకవర్గం నుండి గెలుపొందారు. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో శాసనమండలి సభ్యునిగానూ పనిచేశారు. శ్రీశైలం ట్రస్టుబోర్డు చైర్మన్‌గా శిద్దా రాఘవరావు పనిచేసి శ్రీశైలం అభివృద్ధికి ఎనలేని కృషిచేశారు. ఏది ఏమైనప్పటికి మంత్రి శిద్దా రాఘవరావుకు తెలుగుదేశంపార్టీ జాతీయ కోశాధికారి పదవీ మళ్ళీ వరించటం పట్ల పార్టీశ్రేణుల్లో సర్వత్రా హర్షం వ్యక్తవౌతుంది. ఇదిలా ఉండగా తనకు మళ్ళీ జాతీయ కోశాధికారి పదవీని కట్టబెట్టినందుకు మంత్రి శిద్దా రాఘవరావు తెలుగుదేశంపార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడుకు కృతజ్ఞతలు తెలిపారు. రానున్న 2019ఎన్నికల్లోను తెలుగుదేశంపార్టీ అధికారంలోకి వచ్చేందుకు తీవ్రంగా కృషిచేస్తానని ఆయన ఆంధ్రభూమి ప్రతినిధికి తెలియచేశారు.
అదేవిధంగా తెలుగుదేశంపార్టీ జాతీయ ఉపాధ్యక్షుడిగా మాగుంట శ్రీనివాసరెడ్డిని మళ్లీ వరించింది. గతంలో ఒంగోలు పార్లమెంటుసభ్యునిగా మాగుంట శ్రీనివాసులరెడ్డి తెలుగుదేశంపార్టీనుండి పోటీచేసి ఓటమిపాలైనప్పటికీ ఎంఎల్‌సిగా ముఖ్యమంత్రి అవకాశం కల్పించారు. దీంతో జిల్లాలో తెలుగుదేశంపార్టీని మరింత బలోపేతం చేసే దిశగా ఆయన కృషిచేస్తున్నారనే చెప్పవచ్చు. మళ్లీ తనకు ఆపదవీని కట్టబెట్టినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు మాగుంట కృతజ్ఞతలు తెలిపారు.