శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

అప్రజాస్వామిక పాలనను అంతమొందించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కావలి, అక్టోబర్ 15: రాష్ట్రంలో చంద్రబాబు సాగిస్తున్న అప్రజాస్వామిక పాలనను అంతమొందించాలని నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. కావలి పట్టణంలోని వైకుఠపురంలో పలు అభివృద్ధి పనుల శంకుస్థాపన కార్యక్రమం కోసం ఆయన ఆదివారం విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయనకు స్థానిక కౌన్సిలర్లు గుడ్లూరు మాల్యాద్రి, ఏగూరి పుల్లయ్య ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. వైకుంఠపురం ప్రధాన కూడలి నుంచి పెంకుల ఫ్యాక్టరీ వరకు యువ కార్యకర్తలు బైక్ ర్యాలీ నిర్వహించగా మేకపాటితో పాటు స్థానిక ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డికి స్థానిక మహిళలు మంగళహారతులతో స్వాగతించారు. ఈ సందర్భంగా మేకపాటి 35, 36 వార్డులలో పార్టీ జెండాలను ఆవిష్కరించి పెంకుల ఫ్యాక్టరీ రోడ్డు, శాలివాహన వీధులలో నిర్మించిన సైడ్‌డ్రైన్లకు సంబంధించిన శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అనంతరం స్థానికంగా ఉన్న పోలేరమ్మ గుడిలో పూజలు నిర్వహించి మసీదులో ప్రార్ధనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో చంద్రబాబునాయుడు నియంతృత్వ పోకడలతో పాలన సాగిస్తున్నారని, అభూత కల్పనల ద్వారా ప్రజలను మభ్యపెడుతున్నారన్నారు. రానున్న ఎన్నికల్లో కావలి నుంచి రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డిని గెలిపించడం ద్వారా జగన్‌మోహన్‌రెడ్డిని ఆశీర్వదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఫ్లోర్‌లీడర్ కనుమర్లపూడి వెంకటనారాయణ, బిసి సెల్ అధ్యక్షడు కలగుంట మోహన్, జిల్లా కార్యవర్గ సభ్యులు ఏటూరి పిచ్చిరెడ్డి, కామరాజు, గంధం ప్రసన్నాంజనేయులు, పలువురు కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు.