శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు, అక్టోబర్ 15: ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమించే వాహనదారులపై కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ పిహెచ్‌డి రామకృష్ణ స్పష్టం చేశారు. ఆదివారం నగరంలోని కెవిఆర్ కూడలి వద్ద గల స్వర్ణవేదిక కల్యాణ మండపంలో ట్రాఫిక్ నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై నిర్వహించిన ట్రాఫిక్ సలహా సంఘ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలో రోడ్డు ప్రమాదాలను గణనీయంగా తగ్గించడంతో పాటు నెల్లూరు నగరంలో ట్రాఫిక్‌ను నియంత్రించేందుకు కఠిన చర్యలు తప్పవన్నారు. జిల్లావ్యాప్తంగా పోలీస్, రవాణా, ఆర్టీసీ శాఖలు కలిసి నిర్వహిస్తున్న ప్రత్యేక డ్రైవ్‌ల వల్ల గత రెండు నెలల కాలంలో రోడ్డు ప్రమాదాల సంఖ్య గణనీయంగా తగ్గిందని తెలిపారు. ఇప్పటిదాకా ఈ ప్రత్యేక డ్రైవ్‌ల ద్వారా 2,500 వరకు కేసులు వాహనదారులపై నమోదు చేశామని వివరించారు. డ్రైవింగ్ లైసెన్స్ లేని వారి మీద, మద్యం సేవించి వాహనం నడిపే వారిపైనా ఇప్పటిదాకా దృష్టి పెట్టామని, ఇకపై నిర్వహించే ప్రత్యేక డ్రైవ్‌లలో ఓవర్‌లోడ్ ఆటోలతో పాటు, మితిమీరిన వేగంతో నడిపే వారిపైన దృష్టి పెట్టనున్నట్లు వెల్లడించారు. అలాగే స్కూల్ ఆటోల్లో 5 మంది కంటే ఎక్కువగా విద్యార్థులను ఎక్కించుకుంటే చర్యలు తప్పవని, ఈ విషయంలో పాఠశాలలకు కూడా ముందస్తు నోటీసులు అందిస్తామని స్పష్టం చేశారు. సరైన పత్రాలు లేకపోయినా, మద్యం సేవించి వాహనం నడుపుతున్నా ఇకపై వాహనాలను సీజ్ చేయడం జరుగుతుందని ఎస్పీ హెచ్చరించారు. ప్రతి ఆటోకు ఒక ప్రత్యేక పోలీస్ నెంబర్ కేటాయించినట్లు తెలిపారు. రూరల్ ప్రాంతాల ఆటోలకు బ్లూ సర్కిల్‌లో వైట్ కలర్‌తో నెంబర్ వేయించాలని, నగరానికి చెందిన ఆటోలకు ఎరుపు రంగు సర్కిల్‌లో నలుపురంగుతో కేటాయించిన నెంబర్ స్పష్టంగా కనిపించేలా వేసుకోవాలని సూచించారు. వీటివల్ల నగరంలో తిరిగే, రూరల్ ప్రాంతాల్లో తిరిగే ఆటోలపై అవగాహన కలుగుతుందని చెప్పారు. పోలీస్, రవాణా శాఖలు జిల్లాను ప్రమాద రహిత జిల్లాగా మార్చేందుకు చేస్తున్న ప్రయత్నానికి ప్రతిఒక్కరూ సహకరించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఉప రవాణ కమిషనర్ ఎన్.శివరాంప్రసాద్, నగర డిఎస్పీ మురళీకృష్ణ, ట్రాఫిక్ డిఎస్పీ రామారావు, నగర, రూరల్ ప్రాంతాల్లోని ఆటోడ్రైవర్లు, వివిధ ట్రాన్స్‌పోర్ట్ యజమానులు పాల్గొన్నారు.