శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

ఎర్రచందనం స్మగ్లర్లపై ఉక్కుపాదం : డీఎస్పీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డక్కిలి, నవంబర్ 17: ఎర్రచందనం స్మగ్లర్లపై ఉక్కుపాధం మోపుతామని గూడూరు డీఎస్పీ రాంబాబు అన్నారు. శుక్రవారం డక్కిలి పోలీస్‌స్టేషన్‌కు తనిఖీ నిమిత్తం ఆయన విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ ఎర్రచందనం స్మగ్లర్లు ఎంతటి వారైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. స్మగ్లర్లపై అనునిత్యం నిఘా ఉంటుందని తెలిపారు. ఎర్రచందనం స్మగ్లర్లపై నిఘా పెట్టడం వల్లే రాపూరు, డక్కిలి, వెంకటగిరి ప్రాంతాల్లో ఎర్రచందనం స్మగ్లింగ్ పూర్తిగా తగ్గుముఖం పట్టిందన్నారు. ఇటీవలే ఎర్రచందనం తరలిస్తున్న స్మగ్లర్లను ఏర్పేడు రోడ్డు వద్ద అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. అదేవిధంగా రోడ్డు ప్రమాదాలు అరికట్టడమే ధ్యేయంగా పెట్టుకొని ఆటోలు, ద్విచక్ర వాహనాలను తనిఖీలు చేస్తున్నట్లు తెలిపారు. పోలీస్‌స్టేషన్‌లో పెండింగ్‌లో ఉన్న కేసులను త్వరగా పూర్తి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఐ మరిదినాయుడు, ఎఎస్‌ఐ నారాయణస్వామి, సిబ్బంది తదితరులు ఉన్నారు.

ఇంటర్ విద్యార్థులు పరీక్షలకు సిద్ధం కావాలి : ఆర్‌ఐఓ
సీతారామపురం, నవంబర్ 17 : మండలంలో ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థులు సాంవత్సరీక పరీక్షలకు సదా సిద్ధంగా ఉండాలని ఆర్‌ఐఓ బాబూ జాకబ్ తెలిపారు. శుక్రవారం సీతారామపురంలోని ఆదర్శ పాఠశాలను తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనంతరం విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించి ఫిబ్రవరి 28వ తేదీ నుంచి ఇంటర్ ప్రథమ సంవత్సరం, ద్వితీయ సంవత్సరం పరీక్షలు జరుగుతాయని, అలాగే ప్రాక్టికల్స్ సైతం జనవరిలో జరుగుతాయని వివరించారు. విద్యార్థులు ఆత్మస్థైర్యంతో చదివి సత్ఫలితాలు సాధించాలని కోరారు. కంఠస్థ విధానంతో మెరుగైన ఫలితాలు రాబోవన్నారు. విషయాలను క్షుణ్ణంగా ఆకళింపు చేసుకుని అర్థవంతంగా వ్యవహరిస్తే మెరుగైన మార్కులు వస్తాయన్నారు. ప్రాక్టికల్స్‌ను సైతం జంబ్లింగ్ విధానంలోనే చేపడతామన్నారు. ప్రతి ఒక్కరూ తమకు కేటాయించిన బ్యాచుల మాదిరి ప్రాక్టికల్స్‌కు హాజరవ్వాలన్నారు. ప్రైవేట్ కళాశాలలు కేవలం నెల ముందే ప్రాక్టికల్స్ జరుపుతారన్నారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలు జూలై నుంచే పాఠాలతో సహా యధాప్రకారం ప్రాక్టికల్స్ చేయిస్తారన్నారు. అదే రెండు సంస్థల నడుమ వ్యత్యాసంగా చెప్పుకొచ్చారు. ఆదర్శ పాఠశాలలో పరీక్షల నిర్వాహకులకు సైతం అనువుగా ఉందన్నారు. అనంతరం కళాశాల ప్రిన్సిపాల్ చెరుకూరు హరిత మాట్లాడుతూ సీతారామపురం నుంచి ఉదయగిరికి వెళ్లాలంటే 25 కిలోమీటర్లు బస్సులో వెళ్లాల్సి ఉందన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు ఏవీ కృష్ణయ్య, వౌలాలి, పవన్‌కుమార్, జిసి రత్నయ్య, నారాయణ తదితరులు పాల్గొన్నారు.