శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

ప్రభుత్వ కార్యాలయాల్లో బయోమెట్రిక్ అమలు చేయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వేదాయపాళెం, నవంబర్ 17: అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో బయోమెట్రిక్ విధానాన్ని వెంటనే అమలు చేయాలని జాయింట్ కలెక్టర్ ఎఎండి ఇంతియాజ్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని గ్రీవెన్స్ హాలులో అధికారులు, హెచ్‌ఓడిలు, నోడల్ అధికారులతో బయోమెట్రిక్ విధానం, ఇ - ఆఫీసు, ఆర్‌టిజి తదితర అంశాలపై ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా జేసి మాట్లాడుతూ అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో నూరుశాతం బయోమెట్రిక్ విధానాన్ని ప్రభుత్వ అధికారులు, కాంట్రాక్టు ఉద్యోగులు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులందరిని నమోదు చేయాలన్నారు. గ్రామ పంచాయతీల్లో కూడా అమలు చేయాలన్నారు. ఇ - ఆఫీసు, ఆర్‌టిజితో అనుసంధానం చేయడానికి ప్రతి ప్రభుత్వ డిపార్టుమెంట్ మ్యాపింగ్ శనివారం సాయంత్రానికి పూర్తిచేయాలన్నారు. బయోమెట్రిక్ అమలుచేయని శాఖల జీతభత్యాలు నిలిపివేస్తామన్నారు. ఇ - ఆఫీసుని సక్రమంగా అమలుచేసి నిర్వహించే బాధ్యత స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లకు ఇవ్వబడుతుందన్నారు. డిఆర్‌ఓ వెంకటసుబ్బయ్య మాట్లాడుతూ శనివారం ఉదయం 9 గంటలకు జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ పేదవారికి న్యాయసేవలు ఎలా అందించాలనే అంశంపై ర్యాలీ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ ర్యాలీ జిల్లా కలెక్టర్ కార్యాలయం నుంచి ప్రారంభమై జిల్లా కోర్టు వరకు సాగుతుందన్నారు. ఈ ర్యాలీలో ప్రభుత్వ అధికారులు, సిబ్బంది పాల్గొనాలని కోరారు. ఈ సమావేశంలో అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు.