శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

సీపీఎం కమిటీ ఎన్నికలో బయటపడ్డ లుకలుకలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆత్మకూరు, డిసెంబర్ 11: ‘కమ్యూనిస్టులకు నిన్న రాదు.. రేపు లేదు’ అనేది సగటు రాజకీయ విశే్లషణ. వాస్తవకోణంలో చూస్తే కాలానుగుణంగా మారకపోతే ఎవరైనా కాలగర్భంలో కలసిపోవాల్సిందే. అయితే భారతావనిలో మాత్రం 97 ఏళ్లగా కమ్యూనిస్టు పార్టీలు కొనసాగుతూనే ఉన్నాయి. కాంగ్రెస్‌పార్టీ అధికార భోగం అనుభవిస్తున్నప్పుడు ప్రధాన విపక్షంగా కమ్యూనిష్టులు చాలా రాష్ట్రాల్లో దశాబ్దాల తరబడి కొనసాగారు. ఇక పశ్చిమబంగలో అయితే మూడున్నర దశాబ్ధాలకు పైగా ఏకధాటిగా ఏలినా ఆ తరువాత గత ఎన్నికల్లో చూస్తే మూడో స్థానానికే పరిమితమయ్యే పరిస్థితి. కమ్యూనిజపు సిద్ధాంతాలు ఎంతో పవిత్రమే అయినా ఆచరణలో ఆయా పార్టీలకు చెందిన నేతల నడవడిక మాత్రం అందుకు పూర్తిగా విరుద్ధంగా ఉంటోంది. వామపక్ష భావజాలంతో ఎన్నికైన తూర్పు రాయలసీమ ఎంఎల్‌సి గతంలో తన కుటుంబంలో జరిగిన వివాహ వేడుకను ఆర్భాటంగా చేపట్టారు. ఇలా ఆర్భాటం అనేది కమ్యూనిష్టు సిద్ధాంతాలకు పూర్తి విరుద్ధం. దీనికితోడు సదరు ఎంఎల్‌సి ఆ వేడుకలో విందు ఏర్పాట్లు మరింత విమర్శలకు తావిచ్చేలా చేసింది. తన పదవికి తగ్గట్లుగా వచ్చే ప్రముఖులకు ఓ ప్రత్యేక విభాగంగా విందు ఏర్పాట్లు చేపట్టారు. ఆయనకు ఆ పదవి వచ్చేలా కష్టపడిన సాధారణ కామ్రేడ్లు, తదితరులకు మాత్రం మరో జనతా విభాగంగా ఏర్పాటు చేశారు. కమ్యూనిజం సిద్ధాంతం ముందు అందరూ సమానమే అనే సంగతి గుర్తు చేస్తూ ఆ సందర్భంలో సర్వత్రా తప్పుబట్టారు. జిల్లాలో సీపీఎం నుంచి ఎందరో గెంటివేతకు గురైనా సీపీఐ అక్కున చేర్చుకున్న నేతల జాబితా కొండవీటి చాంతాడనే చెప్పాలి. ఇదేమిటంటే...? సీపీఐ నిర్మాణపరంగా ఎదుగుదల సాధించాలంటే ఇది తప్పనిసరి పరిస్థితిగా చెప్పుకుంటారు. మరోవైపున కమ్యూనిస్టుల పునరేకీకరణ ఆవశ్యమంటూ ప్రగల్భాలు పలుకుతూనే ఉన్నారు. ఇదిలాఉంటే ఆత్మకూరులో సీపీఎం 8వ డివిజన్ మహాసభలో ఆ పార్టీశ్రేణుల నడుమ లుకలుకల్ని మరోమారు వెలుగులోకి వచ్చేలా చేసింది. ఈ డివిజన్ స్థాయి మహాసభకు ముందు నిర్వహించిన ప్రజా ప్రదర్శన పేలవంగా పట్టుమని వంద మంది కూడా హాజరుకాని రీతిలోనే కొనసాగింది. సభలో ఎన్నుకున్న సీపీఎం ఆత్మకూరు పట్టణ కమిటీ కార్యదర్శి పదవి కోసమై సుమారు ఐదు గంటలసేపు సుదీర్ఘ చర్చలు చోటుచేసుకున్నాయి. ఎట్టకేలకు సీపీఎం పట్టణ కార్యదర్శిగా డివైఎఫ్‌ఐ పూర్వ నేత నాగేంద్రకు ఆమోదం లభించింది. ఈ పదవికి స్థానికంగా పార్టీలో చలామణి సాగించే ఇప్పటి వరకు కార్యదర్శిగా కొనసాగిన ఆత్మకూరు నాగయ్యతో సహా మున్సిపల్ వైస్ చైర్మన్ సందానీ, ఆళ్ల హజరత్తయ్య, వాగాల శ్రీహరి, నాగేంద్ర పేర్లు తొలుత ప్రతిపాదనలోకి వచ్చాయి. వీరిలో వాగాల శ్రీహరి తనకు తానుగా ఆ పదవి వద్దంటూ నిరాకరించారు. సభలో ప్రతినిధులు పేర్లు తెలిపిన మిగిలిన ముగ్గురు మాత్రం కార్యదర్శి పదవి ఇస్తే స్వీకరించేలా సంసిద్ధమయ్యారు. ఇప్పటికే నాగయ్య పలు పర్యాయాలు ఆ పదవిలో కొనసాగినందున ఆయన పేరును తోసిపుచ్చారు. అలాగే వైస్ చైర్మన్ సందానీ మున్సిపాలిటీలో బాధ్యతలు నిర్వహిస్తున్నందున ఆయన పేరును కూడా తప్పించారు. అదేవిధంగా మరొకరైన ఆళ్ల హజరత్తయ్య ప్రైవేట్ ఉపాధ్యాయునిగా కొనసాగుతున్నందున ఆయన పేరుకు కూడా గ్రీన్‌సిగ్నల్ ఇవ్వక అంతిమంగా నాగేంద్ర పేరును ఖరారు చేశారు. సీపీఎం పట్టణ కార్యదర్శిగా నాగేంద్రతో సహా కమిటీ సభ్యుల్లో మాత్రం ప్రతిపాదనలకు వచ్చిన సందానీ, ఆళ్ల హజరత్తయ్య, నాగయ్యలతో సహా సిఐటియూ నేతలైన కొండమూరి హజరత్తయ్య, శివప్రసాద్, మహిళా నేత గుల్జార్‌బేగమ్‌లకు అవకాశం లభించింది. ఈ కమిటీ ఎన్నిక సందర్భంలో సిపిఎం డివిజన్, పట్టణ కమిటీ పూర్వ కార్యదర్శులైన గంటా లక్ష్మీపతి, నాగయ్య నడుమ కొంతసేపుఅంత్యాక్షరిలా వాదోపవాదాలు చోటుచేసుకున్నాయి. ఇకపై డివిజన్ కమిటీలు లేకుండా మండల కమిటీలు మాత్రమే రాణించేలా చర్యలు తీసుకున్నారు. అనంతసాగరం మండలానికి మంగళ పుల్లయ్య, మర్రిపాడు మండల కార్యదర్శిగా మూలి వెంగయ్యలను నియమించారు. ఈ మహాసభలను ఉద్దేశించి సీపీఎం జిల్లా కార్యదర్శి చండ్ర రాజగోపాల్ చేసిన ఉపన్యాసపు ఉపోద్ఘాతం అనుసరించి ‘మనం ఏలాలి అంటే.. ముందుగా మనం మారాలి’ అనే అంశంపై ఆత్మకూరు కామేడ్ల్రు ఏమేర నిబద్ధత, ఆచరణాత్మకంగా కొనసాగుతారనేది వేచి చూడాల్సిందే.