శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

రైతులను దగా చేస్తున్న సిఎం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వెంకటాచలం, డిసెంబర్ 11: రైతు ప్రభుత్వం అని చెప్పుకునే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రైతులను దగా చేస్తున్నారని వైకాపా జిల్లా అధ్యక్షులు, సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్థన్‌రెడ్డి విమర్శించారు. మండలంలోని కసుమూరు వద్ద కనుపూరు కాలువను సోమవారం స్థానిక రైతులతో కలిసి కాకాణి పరిశీలించారు. అనంతరం కాకాణి మాట్లాడుతూ ప్రభుత్వం టీడీపీ నాయకుల కోసం నీరు-చెట్టు పనులకు కోట్లాది రూపాయలిస్తూ సాగునీటి ప్రాజెక్టులకు మాత్రం నిధులు విడుదల చేయకుండా ఏటా వాయిదా వేస్తూ రైతులను మోసం చేస్తున్నారన్నారు. సాగునీటి వనరుల ఆధునీకరణ పనుల పేరుతో టీడీపీ ప్రభుత్వం చేపట్టిన నీరు-చెట్టు పనులు టీడీపీ నాయకుల జేబులు నింపుకునేందుకు తప్ప ఒక్కచోట కూడా రైతులకు ఉపయోగం లేదన్నారు. రైతుల పట్ల ప్రభుత్వం ఉదాసీనంగా వ్యహరిస్తోందన్నారు. ప్రభుత్వ చర్యలతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులు, కాలువల ఆధునీకరణ పనులకు ప్రభుత్వం పూర్తిస్థాయిలో నిధులు మంజూరు చేయకపోవటంతో ఏటా రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. జిల్లాలో నెల్లూరు బ్యారేజి, సర్వేపల్లి రిజర్వాయర్, సంగం, కనుపూరు కాలువ ఆధునీకరణ పనులు పూర్తయితే రైతులకు సాగునీటి ఇబ్బందులు ఉండవన్నారు. కనుపూరు కాలువ పరిథిలోని మనుబోలు, వెంకటాచలం మండలాల రైతులకు సాగునీరందక రెండేళ్లుగా పంటలు పండక తీవ్రంగా నష్టపోయారన్నారు. ఈ ఏడాది సోమశిల జలాశయంలో పుష్కలంగా నీరుందని, కాని అధికారుల్లో సమన్వయం లేదన్నారు. ఎక్కడైన ఒక ఎకరా పంట ఎండిపోయినా అధికారులే బాధ్యత వహించాలన్నారు. ప్రభుత్వంతోపాటు అధికారుల నిర్లక్ష్యంతోనే ప్రతి ఏటా రైతులు తీవ్రంగా నష్టపోయారని ఆయన ఆరోపించారు. ఇప్పటికైనా అధికారులు ప్రణాళిక ప్రకారం నీరు విడుదల చేసి పూర్తిస్థాయిలో చివరి ఆయకట్టు వరకు ఉన్న పంటలు పండేలా చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. సాగునీరు పంపిణీలో అధికార పార్టీ నాయకులు రాజకీయ జోక్యం చేసుకుంటే సహించేది లేదన్నారు. రైతులకు తాను ఎల్లప్పుడు అందుబాటులో ఉండి, సాగునీటి ఇబ్బందులు లేకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటానన్నారు. ఈ ఏడాది ఒక్క ఎకరా పంట కూడా ఎండిపోకుండా చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందించే విధంగా జిల్లా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ఆయన వెంట జడ్పీటిసి సభ్యులు మందల వెంకటశేషయ్య, వైస్ ఎంపిపి శ్రీ్ధర్‌నాయుడు, మండల కోఆప్షన్ సభ్యులు హుస్సేన్, వైకాపా జిల్లా ఎస్సీ సెల్ నాయకులు చీకుర్తి నరసయ్య, నాయకులు సర్వేపల్లి సూరి యాదవ్, పలువురు వైకాపా నాయకులు, రైతులు, నీటిపారుదల శాఖ అధికారులు ఉన్నారు.