శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

అన్నిదానాల్లోకెల్లా అవయవదానం గొప్పది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరుటౌన్, డిసెంబర్ 11 : అన్నిదానాల్లోకెల్లా అవయవదానం గొప్పదని, తద్వారా మరో మనిషికి పునరుజ్జీవితాన్ని ప్రసాదించవచ్చని, అంతకంటే పుణ్యం మరొకటి వుండదని ప్రముఖ సినీదర్శకుడు, కళాతపస్వీ, దాదాఫాల్కే అవార్డుగ్రహీత కె విశ్వనాథ్ అన్నారు. సోమవారం నగరంలోని ఆర్టీసీ సమీపాన ఉన్న హోటల్ యష్‌పార్కులో సింహపురి వైద్యశాల ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ మనిషి తన జీవితం ముగిసిన తరువాత అవయవదానం చేసి మరో ఏడుగురికి ప్రాణదానం చేయవచ్చన్నారు. ప్రధానంగా హిందూ సంప్రదాయాల ప్రకారం ఓ వ్యక్తి మరణిస్తే అతనిని ఖననం చేయాలా లేదా దహనం చేయాలా చేస్తే స్వర్గానికి పోతాడా లేక నరకానికి పోతాడా ఆలోచిస్తాడని, అలా ఆలోచించడం కంటే మరణించిన వారి అవయవాలను ఇతరులకు దానం చేస్తే పునర్జన్మ ప్రసాదించడమే కాక ఎన్నో జన్మల పుణ్యం వస్తుందన్నారు. ఇలాంటి అవకాశం ఎన్నో జన్మల పుణ్యం చేసుకుంటే గానీ దక్కదన్నారు. ప్రతిఒక్కరూ అవయవదానం పట్ల అవగాహన కలిగి ఉండాలన్నారు. అవయవదానం చేసినవారే నిజంగా కీర్తిశేషులవుతారన్నారు. నేటి సమాజంలో చదువుకున్న వారికే అవయవదానంపై అవగాహన లేదని, అందరికీ కూడా దీనిపై అవగాహన కల్పించాలని సింహపురి వైద్యశాల యాజమాన్యాన్ని ఆయన కోరారు. సింహపురి వైద్యశాల యాజమాన్యం చేపట్టిన ఈ అవగాహన కార్యక్రమం దిగ్విజయం కావాలని కోరారు.
ఒకరి అవయవాలతో ఏడుగురికి ప్రాణదానం
ఈ సందర్భంగా సింహపురి వైద్యశాల వైద్యులు మాధవ్ దేశాయ్ మాట్లాడుతూ నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో అధిక సంఖ్యలో కిడ్నీ వ్యాధిగ్రస్తులున్నారని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా లక్ష మంది కిడ్నీవ్యాధికి గురవుతుంటే వారిలో 600 మంది మాత్రమే కిడ్నీ మార్పిడి చేసుకుంటున్నారన్నారు. మిగిలిన వారంతా డయాలసిస్ చేసుకుంటూ మృత్యువాత పడుతున్నట్లు చెప్పారు. బ్రెయిన్‌డెడ్ అయిన వారి జీవితం ముగిసిపోతుందన్న తరుణంలో వారి కుటుంబ సభ్యులతో జీవన్‌దాన్ కమిటీ సభ్యులు మాట్లాడి వారిని ఒప్పించి రాష్ట్రంలో ఏ రోగికైతే కిడ్నీ మార్పిడి చేయమంటారో వారికే ఆ అవయవాలను ప్రభుత్వ నిబంధనల మేరకు అందిస్తామన్నారు. అలాగే మరో ఆరుగురి ప్రాణాలను కూడా నిలబెట్టవచ్చన్నారు. ప్రజలు దీనిపై పూర్తి అవగాహన కలిగి వుండాలని కోరారు. అనంతరం సినీదర్శకుడు కె విశ్వనాథ్‌ను సింహపురి వైద్యశాల చైర్మన్ కాటంరెడ్డి రవీంద్రరెడ్డి పుష్పగుచ్ఛం, శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ సమావేశంలో ఆ వైద్యశాల సిబ్బంది పాల్గొన్నారు.