శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

14 మంది అంతర్రాష్ట్ర స్మగ్లర్ల అరెస్ట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు, జనవరి 2: ఎర్రచందనం అక్రమ రవాణాకు పాల్పడుతున్న వారిపై జిల్లా పోలీసులు దాడులు ముమ్మరమవుతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా 14 మంది అంతర్రాష్ట్ర, స్థానిక స్మగ్లర్లను అరెస్ట్ చేసిన పోలీసులు వారి నుండి భారీగా ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలను మంగళవారం స్థానిక ఉమేష్‌చంద్ర సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంల క్రైం ఓఎస్‌డి టిపి విఠలేశ్వర్ తెలియచేశారు. ఆయన తెలిపిన వివరాల మేరకు.. ఎర్రచందనం రవాణాపై ప్రత్యేక దృష్టి పెట్టిన ఎస్పీ రామకృష్ణ ఆదేశాల మేరకు ఓఎస్‌డి విఠలేశ్వర్ ఆధ్వర్యంలో జిల్లా టాస్క్ఫోర్స్ సిబ్బందితో పాటు రాపూరు ఎస్సై బగ్గు లక్ష్మణరావు, ఉదయగిరి ఎస్సై నక్కా ప్రభాకర్, సోమశిల ఎస్సై బలగాని జగన్‌మోహన్‌రావు తమ సిబ్బందితో కలిసి జిల్లాలోని రాపూరు, ఉదయగిరి, సోమశిల పోలీస్‌స్టేషన్ల పరిధిలో ఏకకాలంలో దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో రాపూరు పరిధిలో నలుగురు, ఉదయగిరిలో ఐదురుగు, సోమశిల స్టేషన్ పరిధిలో ఐదుగురు వెరసి 14 మంది అంతరాష్ట్ర ఎర్రచందనం స్మగ్లర్లను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి 554 కిలోల 33 ఎర్రచందనం దుంగలు, 8 సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న ఎర్రచందనం విలువ రూ.55లక్షల వరకూ ఉంటుంది. అరెస్టయిన వారిలో ఆరుగురు కడపజిల్లాకు చెందిన వారు కాగా మిగతావారు రాపూరు, నెల్లూరు, ఉదయగిరి ప్రాంతాలకు చెందినవారు. వారు వెలిగొండ అటవీ ప్రాంతంలో ఎర్రచందనం దుంగలు నరికి చెన్నై అక్కడ్నుంచి విదేశాలకు ఎగుమతి చేయడం వృత్తిగా ఉన్నారు. నిందితులను పట్టుకునే సమయంలో వారు పోలీసులపై కర్రలు, రాళ్లతో దాడికి ప్రయత్నించగా పోలీసులు తప్పించుకొని చాకచక్యంగా పట్టుకోగలిగారు. పట్టుబడిన వారితో సంబంధాలు ఉన్న స్మగ్లర్ల కోసం మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు ఓఎస్‌డి తెలిపారు.
స్మగ్లర్ల కదలికలపై నిఘా
ఎర్రచందనం అక్రమ రవాణాకు పాల్పడుతున్న నేరగాళ్ల కదలికలపై గట్టి నిఘా ఏర్పాటు చేసినట్లు ఓఎస్‌డి తెలిపారు. పట్టుబడిన స్మగ్లర్ల ఆస్తులు సీజ్ చేస్తామని స్పష్టం చేశారు. ఇప్పటికే జిల్లావ్యాప్తంగా స్మగ్లింగ్‌కు పాల్పడుతున్న వారి జాబితా తయారుచేశామన్నారు. గతేడాది 481 మంది స్మగ్లర్లను అరెస్ట్ చేయడంతో పాటు రూ.16 కోట్ల విలువ చేసే ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. వారిని అరెస్ట్ చేయడానికే పరిమితం కాకుండా వెలిగొండ పరిధిలోని కొండ కింది గ్రామాల్లో కూంబింగ్, ఏరియా డామినేషన్ నిర్వహిస్తూ స్మగ్లింగ్‌కు పాల్పడకుండా ప్రత్యేక కౌనె్సలింగ్ ఇస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో ఈ తరహా స్మగ్లింగ్ కార్యకలాపాలు జరుగుతున్నట్లు తెలిస్తే ప్రజలు 9390777727 నెంబరుకు వాట్సప్ ద్వారా సమాచారం అందించాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో టాస్క్ఫోర్స్, రాపూరు, సోమశిల, ఉదయగిరి పోలీస్ అధికారులు పాల్గొన్నారు.