శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

అభివృద్ధిలో సర్వేపల్లి ముందంజ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వెంకటాచలం, జనవరి 2: భారత ఉప రాష్టప్రతి ముప్పవరపు వెంకయ్యనాయుడు చొరవతోనే వెంకటాచలం మండలం అన్ని రంగాల్లో శరవేగంగా అభివృద్ధిపథంలో దూసుకెళ్తోందని వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి తెలిపారు. మండలంలోని సర్వేపల్లి పంచాయతీ పరిథిలో మంగళవారం ప్రారంభమైన జన్మభూమి - మా ఊరు కార్యక్రమానికి మంత్రి సోమిరెడ్డి హాజరయ్యారు. ఈసందర్భంగా ఏర్పాటు చేసిన గ్రామసభలో మంత్రి సోమిరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో రుర్బన్ పథకం కింద అయిదు మండలాలు ఎంపిక చేస్తే అందులో వెంకటాచలం మండలం ఒకటని, మండల అభివృద్ధికి 115 కోట్లు నిధులు మంజూరు చేయించిన ఘనత వెంకయ్యనాయుడుకే దక్కుతుందన్నారు. పార్టీలకు అతీతంగా సర్వేపల్లి నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానన్నారు. జిల్లాలోనే సర్వేపల్లి నియోజకవర్గం అభివృద్ధిలో ముందంజలో ఉందన్నారు. టీడీపీ ప్రభుత్వం పార్టీలకు అతీతంగా పాదర్శకంగానే పని చేస్తోందని ఆయన స్పష్టం చేశారు. గ్రామాల అభివృద్ధిలో ప్రతిఒక్కరు భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు. జిల్లాలో 6 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తున్నామని, ఏ ఒక్క ఎకరా పంట కూడా ఎండిపోకుండా సాగునీరు అందిస్తున్నామన్నారు. తాను గతంలో అధికారంలో లేకున్నా ప్రస్తుతం అధికారంలో ఉన్నా పేదల అభ్యున్నతే ధ్యేయంగా పని చేస్తున్నానన్నారు. గ్రామాల అభివృద్ధికి అందరూ తోడ్పాటును అందించాలని ఆయన పిలుపునిచ్చారు. సంక్షేమ పథకాలు అందని వారి కోసమే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జన్మభూమి - మా ఊరు కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారన్నారు. టీడీపీ ప్రభుత్వం పేదల కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిందని, జన్మభూమి కార్యక్రమం ద్వారా పేదలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. ప్రభుత్వ పథకాలు క్షేత్రస్థాయిలో అందించేందుకు ప్రతిఒక్కరు కృషి చేయాలన్నారు. జిల్లా, నియోజకవర్గ అభివృద్ధికి తాను పూర్తిస్థాయిలో కృషి చేస్తున్నానన్నారు. రాష్ట్రం లోటు బడ్జెట్‌లో ఉన్నా సంక్షేమ పథకాల అమలులో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎక్కడా రాజీపడటం లేదన్నారు. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బీసీల అభ్యున్నతికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కృషి చేస్తున్నారన్నారు. ఉద్యానవన పంటలు వేసుకునే రైతులకు 100 శాతం సబ్సిడీని ప్రభుత్వం ఇస్తుందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతోనే రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని ఆయన స్పష్టం చేశారు. తూతూ మంత్రంగా పనులు చేసి చేతులు దులుపుకోవటం లేదని, ఎన్నికల హామీలను ఒక్కొక్కటిగా పట్టుదలతో సిఎం అమలు చేస్తున్నారన్నారు. ఆయన రాజకీయాలకు అంకితమైన వ్యక్తి కాదని, ప్రజాసేవకు, అభివృద్ధికి ఆయన ఎంతగానో కృషి చేస్తున్నారన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏ పని ప్రారంభించినా మహాసంకల్పంతో చేస్తున్నారన్నారు. పండుగలకు చంద్రన్న కానుక అందిస్తున్న సంస్కృతి చంద్రబాబునాయుడు తీసుకొచ్చారన్నారు. గ్రామాల్లో వౌలిక వసతుల కల్పనకు చంద్రబాబు కృషి చేస్తున్నారన్నారు. ఈ సందర్భంగా జన్మభూమి ప్రతిజ్ఞ చేయించి, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సందేశాన్ని అధికారులు జన్మభూమి గ్రామసభాముఖంగా వివరించారు. అనంతరం సర్వేపల్లిలో చేసిన అభివృద్ధి కార్యక్రమాల గురించి మంత్రి సోమిరెడ్డి వివరించారు. ఈకార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ముత్యాలరాజు, సర్వేపల్లి నియోజకవర్గ టీడీపీ సమన్వయకర్త సోమిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ కిలారి వెంకటస్వామి నాయుడు, నెల్లూరు ఆర్డీవో హరిత, ఐటిడిఏ ప్రాజెక్టు అధికారిణి కమలకుమారి, ఎస్సీ కార్పొరేషన్ ఇడీ కెఎస్ రోజా మండ్, బీసీ కార్పొరేషన్ ఇడి వెంకటస్వామి, స్థానిక సర్పంచ్ కనుపూరు సువర్ణ, నియోజకవర్గంలోని అన్ని మండలాల టీడీపీ అధ్యక్షులు, నాయకులు, అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు.