శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

అంతరాష్ట్ర స్మగ్లర్ల అరెస్ట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆత్మకూరు, జనవరి 19: ఎర్రచందనం అక్రమ నరికివేత, తరలింపునేరాలకు పాల్పడుతున్న ఏడుగురు స్మగ్లర్లను అరెస్ట్ చేసినట్లు జిల్లా అదనపు పోలీస్ సూపరింటిండెంట్ పి విఠలేశ్వర్ వెల్లడించారు. వీరిలో తమిళనాడుకు చెందిన నలుగురు అంతరాష్ట్ర స్మగ్లర్లు ఉన్నారన్నారు. శుక్రవారం ఆత్మకూరు పోలీస్‌స్టేషన్ ఆవరణలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన ఇందుకు సంబంధించిన వివరాలు తెలియజేశారు. జిల్లా ఎస్పీ ఆదేశానుసారం ఎర్రచందనం స్మగ్లింగ్ నిరోధక టాస్క్ఫోర్స్ ఓఎస్డీగా వ్యవహరిస్తున్న తన ఆధ్వర్యంలో ఏకకాలంలో మర్రిపాడు, దుత్తలూరు, వెంకటగిరి పోలీస్‌స్టేషన్ల పరిధిలో తాజాగా దాడులు కొనసాగాయని ఏఎస్‌పి విఠలేశ్వర్ వివరించారు. ఈ దాడుల్లో అంతరాష్ట్ర, స్థానిక స్మగ్లర్లు ఏడుగుర్ని అరెస్ట్ చేయడంతో సహా రూ.53 లక్షల విలువైన, 529 కిలోల బరువుగల 45 ఎర్రచందనం దుంగల్ని సీజ్ చేశామన్నారు. అలాగే నిందితుల నుంచి ఎనిమిది మొబైల్ ఫోన్లను సీజ్ చేశామన్నారు. స్థానిక స్మగ్లర్లలో జిల్లాలోని డక్కిలి మండలానికి చెందిన నిందితులుగా పేర్కొన్నారు. వీరు వెలిగొండ అటవీ ప్రాంతంలో ఎర్రచందనం చెట్లను నరికి సైజులుగా చేసి చెన్నైకు తరలిస్తున్నారన్నారు. చెన్నై నుంచి కంటైనర్ల ద్వారా విదేశాలకు ఎగుమతి చేస్తుంటారని వివరించారు. తమ సిబ్బంది వీరిని పట్టుకునే ప్రయత్నంలో కర్రలు, రాళ్లతో ఎదురుదాడికి ప్రయత్నించారని వాపోయారు. వీరితో సంబంధాలు ఉన్న కీలక స్మగ్లర్లను పట్టుకునేందుకు మూడు ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపడుతున్నట్లు వివరించారు. ఎర్రచందనం స్మగ్లర్లపై కఠిన చర్యలతో సహా వారి వ్యక్తిగత ఆస్తులను సైతం సీజ్ చేస్తామని తెలిపారు. ఇప్పటికే ఎర్రచందనం స్మగ్లర్ల జాబితా తయారు చేసి వారి కదలికలపై నిఘా ఏర్పాటు చేశామన్నారు. జిల్లాలో గత ఏడాది 34 కేసులు నమోదు చేసి 481 మందిని అరెస్ట్ చేయడంతో సహా 45 వాహనాలను సీజ్ చేశామన్నారు. అలాగే రూ.16 కోట్ల విలువైన 16.32 టన్నుల ఎర్రచందనం స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ ఏడాది ఇప్పటికే ఆరు కేసులు నమోదు చేసి టన్నుకు పైగా ఎర్రచందనం దుంగలు చేయడంతోపాటు 22 మంది అంతర్ రాష్ట్ర, అంతర్ జిల్లా స్మగ్లర్లను అరెస్ట్ చేశామన్నారు. స్మగ్లర్ల అరెస్ట్‌తోపాటు వెలిగొండ అటవీ ప్రాంతంలో కూంబింగ్, ఏరియా డామినేషన్ నిర్వహిస్తూ ఎర్రచందనం స్మగ్లింగ్‌కు పాల్పడకుండా ప్రత్యేక కౌన్సిలింగ్ చేపడుతున్నట్లు వివరించారు. ప్రస్తుతం మూడు పోలీస్‌స్టేషన్ల పరిధిలో జరిగిన ఈ దాడుల్లో ఆత్మకూరు డిఎస్పీ రామాంజనేయరెడ్డి, టాస్క్ఫోర్స్ సిబ్బంది, మర్రిపాడు, వెంకటగిరి ఎస్సైలు అబ్దుల్జ్రాక్, కె కొండపనాయుడు, దుత్తలూరు ఏఎస్సై ఎన్ శ్రీనివాసరావు పాల్గొన్నట్లు ఓఎస్‌డి విఠలేశ్వర్ వివరించారు.