శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

శ్రీసిటీని సందర్శించిన సోర్సు ఇండియా ప్రతినిధులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తడ, జనవరి 23: ఎలక్ట్రానిక్ ఇండస్ట్రియల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియాకు చెందిన సోర్సు ఇండియా ఎలక్ట్రానిక్స్ సప్లై చైన్‌కు సంబంధించి 22 మంది ప్రతినిధుల బృందం మంగళవారం శ్రీసిటీని సందర్శించారు. శ్రీసిటీ ప్రెసిడెంట్ ఆపరేషన్ సతీష్ కామత్ వీరికి స్వాగతం పలికి రాష్ట్ర ప్రభుత్వం తన ఎలక్ట్రానిక్ పాలసీలో అందించే ప్రోత్సాహకాలు, శ్రీసిటీ ఎలక్ట్రానిక్స్ మాన్యుఫ్యాక్చరింగ్ క్లస్టర్‌లో యూనిట్లు ఏర్పాటు చేయడం వల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు. ఈ సందర్భంగా ఎండి రవీంద్ర సన్నారెడ్డి మాట్లాడుతూ చైనా తరువాత ఎలక్ట్రానిక్ హార్డువేర్ హబ్‌గా భారత్ విస్తరిస్తున్నదని, ఇందుకు దేశీయ మార్కెట్‌లో ఎలక్ట్రానిక్ హార్డువేర్‌కు ఉన్న భారీ డిమాండ్ కారణమని అన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొనడానికై శ్రీసిటీ ఎలక్ట్రానిక్ హార్డువేర్ తయారీ క్లస్టర్‌ను అభివృద్ధి చేసిందన్నారు. దేశీయ ఎగుమతి మార్కెట్ కోసం ఇక్కడ ఎలక్ట్రానిక్ తయారీ యూనిట్లు ఏర్పాటు చేయడానికి ఎల్సీనాతో కలసి పనిచేస్తామన్నారు. సోర్సు ఇండియా ఎలక్ట్రానిక్ చైన్ జట్టు సందర్శన తమకు ఆనందంగా ఉందన్నారు. ఈ సందర్శనలో భాగంగా వీరు శ్రీసిటీ అధికారులతో సమావేశమై పలు సందేహాలను నివృత్తి చేసుకున్నారు. శ్రీసిటీలోని వౌలిక సదుపాయాలు, వాతావరణం అనుకూలత పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు.

ఎన్‌హెచ్ 67 రహదారిని పరిశీలించిన
కేంద్ర రవాణా శాఖ ప్రాంతీయ అధికారి
సంగం, జనవరి 23: సంగం మండలంలో నూతనంగా నిర్మించిన ఎన్‌హెచ్ 67 సిమెంట్ రహదారిని కేంద్ర రవాణా శాఖ ప్రాంతీయ అధికారి శ్రవణ్‌కుమార్ సింగ్ మంగళవారం పరిశీలించారు. మండలంలో ప్రధాన కూడళ్ల వద్ద బస్‌షెల్టర్లను, సిగ్నల్ లైట్లను పరిశీలించారు. ప్రమాదాలు జరగకుండా హెచ్చరికల బోర్డులు ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిమెంటు రహదారిని మంచి నాణ్యతా ప్రమాణాలతో నిర్మించారని తెలిపారు. గ్రామం మధ్యలో రహదారి నిర్మిస్తే నివాసాలు కోల్పోతారని దానిని దృష్టిలో ఉంచుకుని కొండమీద రహదారిని నిర్మించడం జరిగిందన్నారు. కొండ మీద రహదారిని చక్కగా వేశారని అన్నారు. ఈ కార్యక్రమంలో జాతీయ రహదారుల విభాగం ఎస్‌ఇ మనోహర్‌రెడ్డి, ఇఇ ఓబుల్‌రెడ్డి, ఎఇ అనీల్‌కుమార్‌రెడ్డి, బొల్లినేని కంపెనీ ప్రతినిధి బాబునాయుడు, ఇతర అధికారులు పాల్గొన్నారు.